Best Web Hosting Provider In India 2024
రోజురోజుకు అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఆసక్తి పెరుగుతోంది. ఈ ఎన్నికలు కూడా భారత్‌పై ప్రభావం చూపిస్తాయి. ఎవరు గెలిచినా భారత్‌లో ప్రభావితం చేసే 5 కీలకాంశాలు ఉన్నాయి. ఇటీవలే మోదీ సెప్టెంబర్ 21న అమెరికాను సందర్శించారు. ట్రంప్‌ను గానీ, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ను గానీ కలవకుండానే న్యూయార్క్ నుంచి భారత్‌కు వచ్చారు.
2019లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టెక్సాస్‌లో 50,000 మంది హాజరైన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీకి ఆతిథ్యం ఇచ్చారు. ఏడాది తర్వాత గుజరాత్‌లో ఏర్పాటు చేసిన 1,20,000 మందికిపైగా హాజరైన కార్యక్రమానికి మోదీ.. ట్రంప్‌కు స్వాగతం పలికారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ లేదా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షులుగా ఎవరు అవుతారో చూడాలి.
భారత్, యూఎస్ సంబంధాలు ప్రస్తుత జో బైడెన్ పరిపాలనలో వివిధ స్థాయిల సహకారంతో నడిచాయి. ముఖ్యంగా వ్యూహం, రక్షణ, వాణిజ్యం, ఆరోగ్యం, వాతావరణ మార్పు వంటి కొన్ని రంగాలలో కలిసి ముందుకు వెళ్లాయి. క్వాడ్ చొరవ రెండు దేశాల మధ్య సైనిక, వ్యూహాత్మక సంబంధాలను మెరుగుపరిచాయి. రక్షణ ఉత్పత్తుల అమ్మకాలు, సంయుక్త విన్యాసాలు, ఇంటెలిజెన్స్ భాగస్వామ్యం కూడా ఇరు దేశాల మధ్య బాగానే ఉంది. వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి, అంతరాన్ని తగ్గించడానికి ప్రయత్నాలు జరిగాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు భారత్‌పై అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. అందులోని ఐదు కీలకాంశాలు ఇవే..
ద్వైపాక్షిక సంబంధాలు
డొనాల్డ్ ట్రంప్ లేదా కమలా హారిస్ అయినా నవంబర్ 5 ఎన్నికల ఫలితం వెలువడిన తర్వాత భారత్‌పై ప్రభావం పడుతుంది. నిస్సందేహంగా రక్షణ, వాణిజ్యం, వ్యూహాత్మక రంగాలలో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేస్తుంది.
ఎకనామిక్ ఇంపాక్ట్
భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఇరు దేశాల సంబంధాలకు మూలస్తంభం. ఎకనామిక్స్ థింక్ ట్యాంక్ జీటీఆర్ఐ మే 2024 డేటా ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాలు సుమారు 118 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు, సేవలను మార్చుకున్నాయి.
జియో పాలిటిక్స్
చైనా, రష్యా, ఇతర ప్రాంతీయ అంశాలపై అమెరికా వైఖరి.. భారత్ చేయాలనుకుంటున్న వ్యూహాత్మక ఎత్తుగడలను ప్రభావితం చేస్తుంది. చైనాపై అమెరికా కఠిన వైఖరి తీసుకోవడం భారత్ కు మేలు చేస్తుంది.
ఇండియన్ అమెరికన్లు
అమెరికాలోని భారతీయ ప్రవాసులు అభిప్రాయాలు, విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ద్వైపాక్షిక అంశాల్లో వారి భాగస్వామ్యాన్ని ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది. 2020 యూఎస్ సెన్సస్ డేటా ప్రకారం అమెరికాలో 4.5 మిలియన్ల మంది భారత సంతతికి చెందిన వారుగా గుర్తించారు.
క్లైమెట్ అండ్ టెక్నాలజీ
క్లైమెట్ ఛేంజ్, టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ సహకారం కూడా అమెరికా భారత్‌లను ప్రభావితం చేస్తుంది. ఇండియా-యూఎస్ క్లైమెట్ అండ్ క్లీన్ ఎనర్జీ ఎజెండా 2030 భాగస్వామ్యం ముందుగు వెళ్తుంది. పర్యావరణ హితం కోసం భారత్, అమెరికా నూతన భాగస్వామ్యాన్ని నెలకొల్పాయి.
Best Web Hosting Provider In India 2024
Source link