NNS October 16th Episode: ఆత్మను బంధించలేకపోయిన ఘోరా.. కుప్పకూలిన మనోహరి.. రణ్​వీర్​, మనోహరిని ఒక్కటి చేసిన అంజు​​​!

Best Web Hosting Provider In India 2024

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌ (NNS 16th October Episode)లో పుట్టినరోజు పార్టీకి క్యూట్‌గా రెడీ అయి కిందకు వస్తుంది అంజు. అందరూ షాక్ అవుతారు. అంజును చాలా బాగా రెడీ చేశావని భాగీని మెచ్చుకుంటారు. దీంతో ,అంజు అందరినీ తిడుతుంది. నేను అందంగా ఉన్నాను కాబట్టే కనిపిస్తున్నాను అంటుంది.

గిఫ్ట్ ఎక్కడ పెట్టాలి

ఇంతలో నిర్మల వచ్చి దుర్గామాత డాలర్‌ ఉన్న గోల్డ్‌ చైన్‌‌ను అంజు మెడలో వేయమని భాగీకి ఇస్తుంది. సరేనని భాగీ చెప్తుంది. మరోవైపు కింద ఘోర ఇచ్చిన పొడిని ఎక్కడ పెట్టాలా? అని మనోహరి ఆలోచిస్తుంది. అరుంధతి కూడా తాను తయారు చేసిన గిఫ్ట్‌ ఎక్కడ పెట్టాలా అని చూస్తుంది. ఇంతలో పై నుంచి అంజును తీసుకుని భాగీ, పిల్లలు, కరుణ వస్తారు. మెనీ మెనీ రిటర్న్‌ ఆఫ్‌ ది డే.. అంటాడు అమర్​.

ఈ డ్రెస్‌ చాలా బాగుంది డాడ్‌ అంటుంది అంజు. నీకు నచ్చిందా? అని అమర్​ అడగగానే చాలా నచ్చింది అంటుంది. హ్యాపీ బర్తుడే అంజు పాప అంటాడు రణ్​వీర్​. థాంక్యూ అంకుల్‌ కానీ గిఫ్ట్‌ ఇప్పుడే ఇవ్వకూడదు. కేక్‌ కట్‌ చేసిన తర్వాత ఇవ్వాలి అంటుంది అంజు. దేవుడికి దండం పెట్టుకుని వద్దువు రా అంజు.. రండి అందరూ రండి అంటుంది నిర్మల. అంజు నాన్న దగ్గర అశీర్వాదం తీసుకో.. అంటుంది భాగీ.

ఒకటి వచ్చేలా మార్కులు

నాన్న దగ్గరే కాదమ్మా.. నాన్న దగ్గర, మిస్సమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో.. అంటాడు శివరామ్. అంజు రాథోడ్‌ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకో అంటాడు అమర్​. నేనెందుకులే సార్‌.. అంటున్న రాథోడ్​తో మామయ్యా మామయ్యా అంటావు కదా రాథోడ్‌ కమాన్‌ అంజు రా.. అంటుంది అమ్ము. ఎప్పటిలాగా సున్నాలు కాకుండా సున్నాల పక్కన ఒక్కటి వచ్చేలా మార్కులు తెచ్చుకో.. అని ఆశీర్వదిస్తాడు రాథోడ్.

అంజు.. రణవీర్‌, మనోహరి దగ్గర ఆశీర్వాదం తీసుకో.. అంటాడు శివరామ్​. ఇన్ని సార్లు బెండ్​ అవ్వడం నా వల్ల కాదు. నా వల్ల కాదు, కానీ మీరిద్దరూ ఒక్కదగ్గరికి రండి అంటూ రణవీర్‌, మనోహరిని దగ్గరకు చేర్చి ఆశీర్వాదం తీసుకుంటుంది అంజు. నీ సమక్షంలోనే అందరినీ ఒక్క దగ్గరికీ తీసుకొచ్చావా? స్వామి. ప్రేమ లేని తండ్రి, స్వార్థంతో నిండిన తండ్రి. ఇదేనా నువ్వు అంజుకు రాసిన తలరాత అంటూ అరుంధతి బాధపడుతుంది.

ఐదు నిమిషాల్లో అన్ని రెడీ చేస్తాను. రాథోడ్ పిల్లల్ని నువ్వే చూసుకోవాలి అని అక్షింతలు దేవుడి రూంలో పెట్టి వెళ్లిపోతుంది భాగీ. అక్షింతలు చూసిన మనోహరి ఘోర ఇచ్చిన పొడిని అక్షింతల్లో కలుపుతుంది. అరుంధతి దేవుడి రూంలోకి రాలేదని ఎందుకైనా మంచిది బయట పెడదామని తీసుకొచ్చి బయట టేబుల్‌ మీద పెట్టి వెళ్లిపోతుంది. గుప్త ఆరుని పిలుస్తాడు.

జాగ్రత్తగా ఉండవలే

ఏంటి గుప్త గారు..? అంటున్న ఆరుతో బహుమతి ఇచ్చి వెను వెంటనే వచ్చేదని చెప్తివి.. అది చేయడం లేదు అంటాడు గుప్త. జస్ట్‌ అక్షింతలు తీసుకుని నా కూతురిని ఆశీర్వదించి వచ్చేస్తాను అంటుంది అరుంధతి. ఇటువంటివే చేయరాదని చెప్పితిని. నా మాట వినుము. ఆ ఘోర నీకోసం ఎచ్చట ఉచ్చు పెట్టెనో తెలియడం లేదు. నువ్వు జాగ్రత్తగా ఉండవలెను అని గుప్తా అంటాడు.

దేవుడి ముందు ఉన్న అక్షింతలు ఏం చేయగలరు గుప్తగారు. ఒకవేళ ఏమైనా చేసినా కూడా ఆయన చూస్తూ ఊరుకుంటాడా? ఏం కాదు అంటూ అరుంధతి వెళ్లిపోతుంది. మనోహరి దూరంగా వచ్చి అక్షింతల వైపే చూస్తుంది. ఇంతలో అరుంధతి వెళ్లి అక్షింతలు ఉన్న పల్లెం తీసుకోవడం చూసి హ్యాపీగా ఘోరా రూంలోకి వెళ్తుంది. ఘోర బంధించేశావా? చెప్పు ఘోరా బంధించేశావా? ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎవ్వరి కంట పడకుండా వెళ్లిపో.. కావాలంటే నేనే పూజ దగ్గరకు వస్తాను. ఏంటి ఘోర ఇంకా అలాగే ఉన్నావు అంటుంది మనోహరి.

ఎక్కడికి వెళ్లేది. ఆ ఆత్మను బంధించలేదు అంటాడు ఘోరా. బంధించలేదా? ఏం మాట్లాడుతున్నావు ఘోరా బంధించలేదా? అంటే నీ మంత్రం పని చేయలేదా? అంటే దాన్ని ఎప్పటికీ బంధించలేమా? అంటుంది మనోహరి. లేదు అలా జరిగే అవకాశమే లేదు. అసలు పొడిని దేని మీద వేశావు అంటాడు ఘోరా. అక్షింతల్లో వేశాను అంటున్న మనోహరితో దేవుడికి వాడే పవిత్రమైన పసుపులో మన పొడిని కలిపితే అసలు ఎలా పనిచేస్తుంది అనుకున్నావు అని ఘోర చెప్పగానే మనోహరి షాక్‌ అవుతుంది.

భయపడిన అంజు

ఒక్కసారిగా కింద కూలబడిపోతుంది మనోహరి. అక్షింతలు తీసుకుని అరుంధతి అంజు దగ్గరకు వెళ్లి ఆశీర్వదిస్తుంది. తనపై అక్షింతలు పడటంతో అంజు భయపడుతుంది. ఎవ్వరూ లేకుండా తనపై అక్షింతలు పడ్డాయని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన భాగీ అరుంధతిని చూసి పలకరిస్తుంది.

మీరొచ్చి ఎంతసేపు అయింది అని అడుగుతుంది. తర్వాత మీరు వెళ్లి పార్టీలో జాయిన్‌ అవ్వండి నేను వస్తాను అని చెప్పి భాగీ లోపలికి వెళ్తుంది. అరుంధతిని ఘోర బంధిస్తాడా? ఆరు ఆత్మని ఘోరా బారినుంచి ఎవరు కాపాడతారు? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు అక్టోబర్​ 16న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తప్పకుండా చూడాల్సిందే!

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024