Allu Arjun Fan: అల్లు అర్జున్‍ను కోసం 1,600 కిలోమీటర్లు సైకిల్ తొక్కిన యూపీ ఫ్యాన్.. ఆప్యాయంగా మాట్లాడిన ఐకాన్ స్టార్

Best Web Hosting Provider In India 2024

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప చిత్రంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. 2021 డిసెంబర్‌లో రిలీజైన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్‍లో బంపర్ హిట్ కొట్టింది. దీంతోపాటు దేశ నలుమూలల్లో అల్లు అర్జున్‍కు ఫ్యాన్స్ విపరీతంగా పెరిగిపోయారు. హిందీలోనూ చాలా మంది అభిమానులయ్యారు. ఉత్తరాదిలోనూ బాలీవుడ్ హీరోలను మించి క్రేజ్ దక్కించుకున్నారు. అల్లు అర్జున్ స్వాగ్, మేనరిజమ్స్, మాస్ యాక్షన్, డ్యాన్స్, స్టైల్‍ అందరికీ తెగనచ్చేశాయి. ఇలా అభిమానం పెంచుకున్న ఓ వ్యక్తి అల్లు అర్జున్‍ను కలిసేందుకు ఏకంగా 1,600 కిలోమీటర్లు సైకిల్ తొక్కాడు. ఆ వివరాలివే..

యూపీ నుంచి సైకిల్‍పై..

అల్లు అర్జున్‍ను కలిసేందుకు ఉత్తర ప్రదేశ్‍లోని అలీగఢ్ నుంచి సైకిల్‍పై హైదరాబాద్‍కు వచ్చారు ఓ అభిమాని. ఏకంగా 1,600 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ వచ్చారు. హైదరాబాద్‍లో నేడు (అక్టోబర్ 16) అల్లు అర్జున్‍ను కలిశారు. తన అభిమాన నటుడిని కలిసి ఎమోషనల్ అయ్యారు.

ఆప్యాయంగా పలకరింపు

తన కోసం వచ్చిన అభిమానిని అల్లు అర్జున్ ఆప్యాయంగా పలుకరించారు. తాను ఉత్తర ప్రదేశ్‍ నుంచి వచ్చానని ఆ ఫ్యాన్ చెప్పారు. అల్లు అర్జున్ కాళ్లు మొక్కబోయారు. ఎలా వచ్చావని అడిగితే.. సైకిల్‍పై అని చెప్పారు. దీంతో అల్లు అర్జున్ ఆశ్చర్యపోయారు.

జాగ్రత్తగా పంపండి

ఆ అభిమానిని జాగ్రత్తగా తిరిగి పంపాలని అక్కడి వారితో అల్లు అర్జున్ చెప్పారు. ట్రైన్‍, ఫ్లైట్ ఏదో ఒకటి బుక్‍ చేసి అతడిని ఇంటికి తిరిగి పంపాలని ఆదేశించారు. సైకిల్‍పై వెళ్లవద్దని అతడితో చెప్పారు.

యూపీ వస్తే కలుస్తా

పుష్ప 2 ప్రమోషన్లకు ఉత్తర్ ప్రదేశ్ వస్తే కలుస్తానని ఆ అభిమానితో అల్లు అర్జున్ చెప్పారు. దీంతో అతడు చాలా సంతోషించారు. తాను డైహార్ట్ ఫ్యాన్ అని అతడు అన్నారు. ఓ మొక్కను అతడికి అందించారు అల్లు అర్జున్. అతడికి కొన్ని డబ్బులు కూడా ఇవ్వాలని, జాగ్రత్తగా పంపించాలని అక్కడి వారికి సూచించారు. చివర్లో జుకేగా నై (తగ్గేదే లే) అంటూ పుష్ప డైలాగ్ చెప్పారు ఆ ఫ్యాన్.

అభిమానిని అల్లు అర్జున్ అంత ఆప్యాయంగా పలుకరించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడు అంత కష్టపడి వచ్చినందుకు బాగా సంతోషించేలా చేశారని, ఇంటికి పంపేందుకు కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచి విషయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. అభిమానులకు ఐకాన్ స్టార్ చాలా విలువనిస్తారంటూ రాసుకొస్తున్నారు.

‘పుష్ప 2’ ఒక రోజు ముందుగానే..

పుష్పకు సీక్వెల్‍గా ‘పుష్ప 2: ది రూల్’ మూవీ వస్తోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 6న రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ప్రకటించింది. అయితే, అందుకు ఒకరోజు ముందుగానే డిసెంబర్ 5నే విడుదల చేసేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ సీక్వెల్ మూవీని డైరెక్టర్ సుకుమార్ మరింత గ్రాండ్ స్కేల్‍లో యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ ఫైనల్ ఎడిటింగ్ కూడా పూర్తయి లాక్ అయిందని అప్‍డేట్ కూడా వచ్చేసింది. మిగిలిన షూటింగ్ కూడా త్వరలోనే ఫినిషి కానుంది. పుష్ప 2పై పాన్ ఇండియా రేంజ్‍లో భారీ అంచనాలు ఉన్నాయి.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024