Sitaphal Rabdi: సీతాఫలంతో స్వీట్ రబ్డీ.. ఒక్కసారైనా చేసి తినాల్సిందే

Best Web Hosting Provider In India 2024

రబ్డీ గురించి ఉత్తర భారత దేశ వంటకాల్లో ఎక్కువగా వింటుంటాం. కాస్త బాసుంది లాగా పోలి ఉంటుందిది. పాలను సగం దాకా మరిగించి చిక్కగా తయారు చేసి దాంతో రబ్డీ తయారు చేస్తారు. ప్రత్యేక వేడుకల్లో తప్పకుండా రబ్డీ ఉండాల్సిందే. అయితే దీనికి సీతాఫలం జోడిస్తే రుచి మరింత బాగుంటుంది. ఒక మంచి డెజర్ట్ రెసిపీ అవుతుంది.

సీతాఫలం వాడటం వల్ల తీపి కోసం ఎక్కువగా పంచదార వాడాల్సిన అవసరం లేకుండా హెల్తీగా ఉంటుంది. సీతాఫలం సీజన్ మొదలైనట్లే. ఈ పండ్లు పుష్కలంగా దొరికినప్పుడే ఒక్కసారన్నా ఈ స్వీట్ రెసిపీ ట్రై చేయండి. రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది.

సీతాఫల్ రబ్డీ కోసం కావాల్సిన పదార్థాలు:

  • 1 లీటర్ పాలు
  • 1/4 కప్పు బెల్లం
  • 1/2 టీస్పూన్ యాలకుల పొడి
  • 1 సీతాఫలం గుజ్జు

(సీతాఫలం గింజలు వేరు చేసి గుజ్జును మాత్రమే తీసుకోవాలి)

గార్నిష్ కోసం:

  • గులాబీ రేకులు
  • పిస్తా తరుగు
  • సిల్వర్ పూత రేకు (ఆప్షనల్)
  • కుంకుమపువ్వు కలిపిన పాలు (ఆప్షనల్)

సీతాఫల్ రబ్డీ తయారీ విధానం:

  1. ముందుగా పాలను ఒక కడాయిలో వేసి మరిగించండి. రెండు మూడు సార్లు బాగా ఉడుకు వచ్చాక మంట తగ్గించి సగానికి ఇంకిపోయే చిక్కబడే వరకు పాలను మరిగించాలి.
  2. మధ్య మధ్యలో కలియబెడుతూ ఉండాలి. లేదంటే పాలల్లో అడుగున చిన్న స్టీల్ ప్లేట్ వేసేస్తే పొంగకుండా ఉంటాయి.
  3. పాలు సగానికి ఇంకిపోయి చిక్కబడ్డ తర్వాత అందులో యాలకుల పొడి, బెల్లం లేదా పంచదార, సీతాఫలం గుజ్జు వేసి కలపాలి.
  4. బెల్లం బాగా కలుపుకోవాలి. అది కరిగిన తర్వాత స్టవ్ నుంచి తీసేసి చల్లారనివ్వాలి. చివరగా కుంకుమపువ్వు కలిపిన పాలు, గులాబీ రేకులు, పిస్తాపప్పులు, సిల్వర్ వార్క్ తో గార్నిష్ చేయండి.
  5. కనీసం ఓ గంటపాటు ఫ్రిజ్ లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే అద్భుతమైన డెజర్ట్ రెడీ అవుతుంది.

ప్రయోజనాలు:

సీతాఫల్ తీపి, క్రీమీ గుజ్జుతో కూడిన పండు. దీంట్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రబ్డీ కోసం వాడే పాల నుండి కాల్షియం, ప్రోటీన్ దొరుకుతుంది. ఇది ఎముక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. గార్నిష్ కోసం ఉపయోగించే బాదం, పిస్తాపప్పులు అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఇ ను అందిస్తాయి. ఇవన్నీ ఈ కమ్మటి స్వీట్ పోషక విలువల్ని పెంచుతాయి.

Whats_app_banner

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024