OTT Bold Movies: ఓటీటీలో బెస్ట్ 5 తెలుగు బోల్డ్ సినిమాలు- కానీ, ఒంటరిగా చూడాల్సిందే! ఏది ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

Best Web Hosting Provider In India 2024

Top 5 OTT Bold Movies In Telugu: ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్ ప్రేక్షకులకు ఎలాంటి ఫిల్టర్ లేకుండా అందుబాటులో ఉంటుంది. వాటిలో బోల్డ్ లేక అడల్ట్ కంటెంట్ జోనర్ ఒకటి. ఈ మధ్య కాలంలో తెలుగులో చాలా వరకు బోల్డ్ సినిమాలు వచ్చాయి. మరి ఆ బోల్డ్ సినిమాలు ఏంటీ, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఎవోల్ ఓటీటీ

ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో శృంగారం చేస్తే అనే కాన్సెప్ట్‌తో వచ్చిన తెలుగు బోల్డ్ మూవీనే ఎవోల్ (EVOL). లవ్ (LOVE) అనే ఇంగ్లీష్ పదాన్ని తిరగేసి చదివితే ఎవోల్ వస్తుంది. శివకుమార్ రామచంద్రవరపు, సూర్య శ్రీనివాస్, జెన్నిఫర్ ఇమ్మాన్యూయెల్, దివ్య శర్మ కీలక పాత్రలు పోషించిన ఎవోల్ ఆహా‌ ఓటీటీలో డైరెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ఆగస్ట్ 15న ఎవోల్ ఓటీటీ రిలీజ్ అయింది. థియేటర్‌లో చూపించనంత అడల్డ్ కంటెంట్ ఉన్నందునే ఎవోల్‌ను నేరుగా ఓటీటీ రిలీజ్ చేశారు.

మిక్స్ అప్ ఓటీటీ

ఒకరి భార్య మరొకరితో ఎఫైర్ నడిపిస్తే ఎలా ఉంటుందనే కథాంశంతో తెరకెక్కిన తెలుగు బోల్డ్ చిత్రం మిక్స్ అప్. ఆకాష్ బిక్కీ దర్శకత్వం వహించిన మిక్స్ అప్‌లో కమల్ కామరాజు, పూజా జావేరి, ఆదర్శ్ బాలకృష్ణ, అక్షర గౌడ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు. ఘాటు ముద్దు సన్నివేశాలతో, న్యూ ఏజ్ బోల్డ్ సినిమాగా వచ్చిన మిక్స్ అప్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

లవ్ మౌళి ఓటీటీ

శృంగారం అనే లస్ట్ డిజైర్ తీర్చుకునేందుకు మల్టిపుల్ లవ్ స్టోరీస్ నడిపించే వ్యక్తి కథగా లవ్ మౌళి సినిమా ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి తను మాత్రమే సర్వస్వంగా భావించాలని పరితపించే యువకుడి కథగా వచ్చిన లవ్ మౌళీ ఆహా, అమెజాన్ ప్రైమ్‌ రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అవనీంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో నవదీప్ హీరోగా చేశాడు. బ్రాలో నవదీప్ మందు తాగుతున్న పోస్టర్‌తో లవ్ మౌళి ఎంత బోల్డ్‌గా ఉంటుందో తెలియజేశారు మేకర్స్.

సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ

మరో అర్జున్ రెడ్డి మూవీ అంటూ ప్రమోట్ అయిన తెలుగు రొమాంటిక్ అండ్ లవ్ మూవీ సిద్ధార్థ్ రాయ్. సెక్స్ అనే కామన్ ఫీలింగ్‌ను ఎవరితో పడితే వారితో తీర్చుకునే హీరో చుట్టూ ఈ మూవీ సాగుతుంది. చైల్డ్ ఆర్టిస్డ్‌గా పాపులర్ అయిన దీపక్ సరోజ్ హీరోగా అరంగ్రేటం చేసిన సిద్ధార్థ్ రాయ్‌ను ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో చూడొచ్చు.

హనీమూన్ ఎక్స్‌ప్రెస్ ఓటీటీ

హెబ్బా పటేల్, చైతన్య రావు జోడీగా చేసిన రొమాంటిక్ కామెడీ చిత్రం హనీమూన్ ఎక్స్‌ప్రెస్. బాల రాజశేఖరుని దర్శకత్వం వహించిన హానీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ ఆహా ఓటీటీలో ఇటీవలే 75 మిలియన్ వ్యూస్‌పైగా సాధించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.

హెబ్బా పటేల్ ఇంతకుముందు నటించినంత బోల్డ్‌గా యాక్ట్ చేసిన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీలో 8.5 రేటింగ్ ఉండటం విశేషం. అయితే, ఇలా పైన చెప్పిన తెలుగు బోల్డ్ సినిమాలన్నీ ఆహా ఓటీటీలో అందుబాటులో ఉండటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024