OTT Horror Comedy: ఓటీటీలోకి సూపర్ హిట్ హారర్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Best Web Hosting Provider In India 2024

విరాజ్ ఘలానీ, మానసి పరేఖ్ ప్రధాన పాత్రలు పోషించిన జామ్‍కుడి సినిమా ఈ ఏడాది మే 31వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ గుజరాతీ హారర్ కామెడీ మూవీ మంచి హిట్ అయింది. తక్కువ బడ్జెట్‍తో తెరకెక్కి మంచి కలెక్షన్లు సొంతం చేసుకుంది. ఈ మూవీకి ఉమాంగ్ వ్యాస్ దర్శకత్వం వహించారు. జామ్‍కుడి చిత్రం ఇప్పుడు ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్‍కు వస్తోంది.

స్ట్రీమింగ్ వివరాలివే..

జామ్‍కుడి చిత్రం అక్టోబర్ 17వ తేదీన ‘షెమారోమీ’ అనే ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రం పాజిటివ్ టాకే తెచ్చుకున్నా.. ఓటీటీ డీల్ మాత్రం ఆలస్యమైంది. దీంతో స్ట్రీమింగ్‍ లేట్ అవుతూ వచ్చింది. ఎట్టకేలకు ‘షెమారోమీ’ ప్లాట్‍ఫామ్ స్ట్రీమింగ్ హక్కులను తీసుకుంది. దీంతో థియేటర్లలో రిలీజైన నాలుగున్నర నెలల తర్వాత ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తోంది.

జామ్‍కుడి సినిమాతోనే పాపులర్ సోషల్ మీడియా ఇన్‍ఫ్లుయెన్సెర్ విరాజ్ ఘలానీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మానసి ఫరేఖ్ కూడా మెయిన్ రోల్ చేశారు. సంజయ్ గోరాడియా, ఓజాస్ రావల్, జయేశ్ మోర్, కృణాల్ పండిట్, చేతన్ ధైర్య, భవానీ జానీ కీలకపాత్రలు పోషించారు.

జామ్‍కుడి చిత్రాన్ని హారర్ ఎలిమెంట్లతో కామెడీ మూవీగా తెరకెక్కించారు డైరెక్టర్ ఉమాంగ్ వ్యాస్. రూరల్ బ్యాక్‍డ్రాప్‍లో రూపొందించారు. ఈ చిత్రాన్ని సౌల్ సూత్రా, ఆర్డీ బ్రదర్స్ బ్యానర్లపై పార్థివ్ గోహిల్, మానసి పరేఖ్ నిర్మించారు.

జామ్‍కుడి స్టోరీలైన్

గుజరాత్‍లోని రణివడాలో నవరాత్రుల్లో గార్బా జరగదు. జామ్‍కుడి అనే దెయ్యం శాపం వల్ల అక్కడ గార్బా నిర్వహించకూడదని జనం భయపడుతుంటారు. అయితే, ఈ నిబంధనను ధిక్కరించటంతో జామ్‍కుడి దెయ్యం మళ్లీ వేట మొదలుపెడుతుంది. దీంతో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అయిన బబ్లూ.. రాజకుటుంబానికి చెందిన ఎన్‍ఆర్ఐ కుముద్‍ను గ్రామానికి పిలిపిస్తాడు. మరి బబ్లూ ఈ మిస్టరీని ఛేదిస్తాడా? ఈ శాపం నుంచి రాణివాడా బయటపడుతుందా? జామ్‍కుడి దెయ్యం కథేంటి? అనే అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. జామ్‍కుడి మూవీలో ట్విస్టులు, కామెడీ, హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి.

హాట్‍స్టార్‌లో ‘ముంజ్య’

డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో హిందీ బాలీవుడ్ హారర్ కామెడీ మూవీ ‘ముంజ్య’ ఇంకా ట్రెండింగ్‍లోనే ఉంది. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీనే హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ముందుగా హిందీలోనే స్ట్రీమింగ్‍కు వచ్చిన ఈ చిత్రం.. ఆ తర్వాత తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. ముంజ్య చిత్రం జూన్ 7న థియేటర్లలో రిలీజైంది. తక్కువ బడ్జెట్‍తో రూపొందిన ఈ మూవీ ఏకంగా రూ.130కోట్ల కలెక్షన్లతో బ్లాక్‍బస్టర్ అయింది. హాట్‍స్టార్ ఓటీటీలోనూ ముంజ్య భారీ వ్యూస్ దక్కించుకుంటోంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024