Kiwi Fruit: కివీ పండు తొక్కతో తినాలా? తీసి తినాలా? అలా తింటేనే పోషకాలు రెట్టింపు

Best Web Hosting Provider In India 2024


పుల్లగా తియ్యగా జ్యూసీగా ఉండే కివీ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అంతే రుచిగా ఉంటుంది. స్మూతీలు, ఐస్ క్రీం, కేకులు, పేస్ట్రీలు వంటి అనేక రకాల వంటకాల రుచిని పెంచడానికి కివీని ఉపయోగిస్తారు. ఇది కాకుండా, కివిని సలాడ్ లేదా జ్యూస్ రూపంలో కూడా తింటారు. కివిని ఎలా తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ కివీని తొక్క లేకుండా తినాలా లేక తొక్కతో తినాలా అనేది చాలా మందిలో ఉండే సందేహం. కివీ పండులో పోషకాలు మీకు పూర్తిగా అందాలంటే దాన్ని తినడానికి సరైన మార్గం, కివీ ప్రయోజనాల గురించి తెల్సుకుందాం.

కివి తినడానికి సరైన మార్గం:

కివీ పండు ఏ విధంగా తిన్నా పోషకాలు అందుతాయి. అయితే ఈ పండు నుండి రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలను కోరుకుంటే, దీనిని తొక్కతో తినడం లాభదాయకంగా ఉంటుంది. కివి పండు తొక్కపై చిన్న చిన్న వెంట్రుకల్లాంటివి ఉంటాయి. దాంతోనే చాలా మంది దీన్ని తొక్కతో సహా తినరు. కానీ దాని తొక్క ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ కివీ తొక్కతో తినడానికి ప్రయత్నించండి. అయితే దాని మీద కాస్త పై తొక్కను తీయడానికి చాకు వాడండి. చేయితో చాకును పండు మీద గీకినట్లు చేయండి. ఇలా చేస్తే తొక్క పూర్తిగా పోదు. తర్వాత కివీని ముక్కల్లాగా తొక్కతో సహా కట్ చేసేకుని తినేయొచ్చు.

కివీ ఎందుకు తినాలి?

కివీ పండు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను చూద్దాం. ఈ పండు ఇతర పండ్ల కంటే కొంచెం ఖరీదే. అయితే కాస్త అనారోగ్యం ఉన్నా కూడా దీన్ని తినమని సిఫార్సు చేస్తారు.

విటమిన్ సి:

కివీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా కివీ తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది సీజనల్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యం:

కివీలో ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెకు కూడా మేలు జరుగుతుంది. రోజూ ఒక కివీ తినడం వల్ల శరీరంలోని రక్తపోటు అదుపులో ఉంటుంది. కివీలో ఉండే ఫైబర్, పొటాషియం శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ప్లేట్‌లెట్ కౌంట్:

కివీలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరంలో రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది. శరీరంలో ప్లేట్ లెట్స్ తగ్గినప్పుడు కూడా కివి తినడం మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే ఐరన్ ప్లేట్ లెట్స్ ను వేగంగా పెంచడానికి పనిచేస్తుంది. ఇది కాకుండా, కివీ తినడం గర్భధారణ సమయంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

పొట్ట ఆరోగ్యం:

కివీలో లభించే విటమిన్ సి, ఫైబర్ కడుపుకు ఎంతో మేలు చేస్తాయి. ఇది పేగు వాపు, మలబద్ధకం నుండి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. కివీలో ఉండే ఆక్టినిడిన్ సమ్మేళనాలు శరీరంలోని ప్రోటీన్లను విచ్ఛిన్నం చేయడం ద్వారా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

చర్మ ఆరోగ్యం:

విటమిన్ ఇ కూడా కివిలో పుష్కలంగా లభిస్తుంది. దీన్ని రెగ్యులర్ గా తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోయి చర్మం మెరిసేలా చేస్తుంది. డీహైడ్రేషన్ సమస్య ఉన్నా కూడా కివీ తినడం ఆరోగ్యకరం.

Whats_app_banner

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024