AP Cabinet Decisions : ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన, ఆరు కొత్త ఇండస్ట్రియల్ పాలసీలకు ఆమోదం- ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

Best Web Hosting Provider In India 2024

సీఎం చంద్రబాబు అధ్యక్షత ఏపీ కేబినెట్ బుధవారం రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యింది. ఈ సమావేశంలో ఆరు కొత్త ఇండస్ట్రియల్ పాలసీలపై చర్చించారు. మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట, అక్రమ మద్యం అమ్మకాలు అరికట్టడం, రీహాబిలిటేషన్ పై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

వన్ ఫ్యామిలీ-వన్ ఎంట్రప్రెన్యూర్

‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్‌’ అనే నినాదంతో కూటమి ప్రభుత్వం కొత్త ఇండస్ట్రియల్ పాలసీలు అమలు చేస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉద్యోగాలు చేయటం కాదు, ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలన్నారు. ఇవాళ్టి కేబినెట్ సమావేశంలో ఆరు కొత్త ఇండస్ట్రియల్ పాలసీలపై చర్చించి, ఆమోదించామన్నారు. ‘థింక్ గ్లోబల్లీ, యాక్ట్ గ్లోబల్లీ’ అనేది తమ విధానం అన్నారు. రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

కేబినెట్ ఆమోదించిన కొత్త ఇండస్ట్రియల్ పాలసీలు :

1. ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం

2. ఏపీ ఎంఎస్ఎంఈ & ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్ పాలసీ

3. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ

4. ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ

5. ఏపీ ప్రైవేట్ పార్కుల విధానం

6. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ

ప్రతి కుటుంబం ఒక చిన్న తరహా పరిశ్రమ

ఒక పక్క నాలెడ్జ్ ఎకానమీ… మరో పక్క అగ్రో, ఆక్వా, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ అనేవి ఏపీకి ఉన్న బలాలు అని సీఎం చంద్రబాబు అన్నారు. జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ ను ఇంకా ఎక్కువ ప్రమోట్ చేస్తామన్నారు. ఎంఎస్ఎంఈలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తామన్నారు. ప్రతి కుటుంబం ఒక చిన్న తరహా పరిశ్రమ పెట్టేలా తగిన శిక్షణ, ఆర్థిక సాయం చేస్తామన్నారు. జాబ్ ఫస్ట్ పేరుతోనే అన్ని ఇండస్ట్రియల్ పాలసీలను రూపొందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రతి పాలసీలో ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. గతంలో ఎంత పెట్టుబడులు వచ్చాయని అడిగేవారని, తమ ప్రభుత్వం తెచ్చే ఇండస్ట్రీయల్ పాలసీలో ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తున్నామనేది చూస్తున్నామన్నారు. ఉద్యోగాలు, ఉపాధి, చదువుకున్న పిల్లల భవిష్యత్తు కోసమే కూటమి సర్కార్ కొత్త ఇండస్ట్రీయల్ పాలసీలు రూపొందిస్తుందన్నారు.

నాలెడ్జ్ ఎకనమీతో ప్రపంచానికి సేవలు అందిచడమే కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించడం, డబ్బులు సంపాదించే మార్గం వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. యువత ఉద్యోగాలు చేయడం కాదని, ఉద్యోగాలు కల్పించేలా మారాలన్నారు. 25 ఏళ్లకంటే ఐటీ పాలసీ తీసుకొచ్చామని, దీనితో ఎన్నో ఇంజినీరింగ్ కాలేజీలు, కంపెనీలు వచ్చాయన్నారు. ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఆరు పాలసీలు రానున్న రోజుల్లో రాష్ట్రాభివృద్ధికి, యువత భవిష్యత్తుకు పెనుమార్పులు తీసుకొస్తాయన్నారు.

ఏపీలో పునరుద్పాదక విద్యుత్, పంప్డ్ స్టోరేజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి, గ్రీన్ హైడ్రోజన్ వనరుల వినియోగం పెంచేందుకు ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 2024-29 రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి పాలసీ 4.0పై చర్చించి ఆమోదించింది. 2030 నాటికి ఇంటింటికీ ఓ పారిశ్రామిక వేత్త అనే నూతన ఎంఎస్ఎంఈ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Ap CabinetChandrababu NaiduAndhra Pradesh NewsTrending ApTelugu News
Source / Credits

Best Web Hosting Provider In India 2024