Bengaluru rain: ‘‘చావు తప్పదు అనుకున్నా’’.. వర్షంలో తన కష్టాలు వివరించిన బెంగళూరు వాసి

Best Web Hosting Provider In India 2024


Bengaluru rains: బెంగళూరులో భారీ వర్షాలు కురుస్తుండటంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది. బెంగళూరుకు చెందిన ఒక యువ ప్రొఫెషనల్ కూడా అదే విషయాన్ని తన అనుభవాన్ని వివరిస్తూ హెచ్చరించారు. ఓ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ ఉద్యోగి అయిన ఆ వ్యక్తి తప్పనిసరై వర్షంలో బయటకు వెళ్లి, అనుభవించిన దారుణ పరిస్థితిని గ్రేప్ వైన్ యాప్ లో వివరించాడు.

జీవన్మరణ పరిస్థితి

‘జోర్డాన్ లీ’ అనే మారుపేరుతో ఆ వ్యక్తి తన అనుభవాన్ని గ్రేప్ వైన్ యాప్ లో రాశాడు. “ఈ వర్షంలో జీవన్మరణ పరిస్థితిని ఎదుర్కొన్నాను” అని ఆయన గ్రేప్ వైన్ లో రాశారు. తాను ఐదేళ్లుగా బెంగళూరు (bengaluru) లో ఉంటున్నానని, కానీ ఇప్పటి వరకు ఇలాంటివి ఎప్పుడూ చూడలేదన్నారు. ‘‘ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చేసరికి వర్షం పెద్దగా లేకపోవడంతో పనిపై బయటకు వచ్చాను. అయితే సోనీ సిగ్నల్ వద్దకు చేరుకునే సరికి భారీ వర్షం కురవడం ప్రారంభమైంది. రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. అప్పటికే అక్కడ ట్రాఫిక్ జామ్ అయి ఉంది. వాహనాలు కదలడం లేదు’’ అంటూ తన పరిస్థితిని వివరించారు.

10 మీటర్ల దూరంలో తెగిపడిన విద్యుత్ తీగ

తన కష్టాలు అక్కడితో ఆగలేదని, ఆ వర్షంలో, వరద నీటిలో తన స్కూటర్ ఆగిపోయిందని తెలిపారు. ‘‘ఎగ్జాస్ట్ లోకి నీరు చేరడంతో స్కూటర్ ఆగిపోయింది. అదే సమయంలో కేవలం తనకు 10 మీటర్ల దూరంలో మరో ప్రమాదం కనిపించింది. అక్కడ విద్యుత్ కేబుల్ ఒకటి నేలపై పడటం నేను చూశాను. అక్కడ నుంచి చిన్నచిన్న నిప్పు రవ్వలు రాసాగాయి. భయంతో గుండె ఆగిపోయింది. అక్కడే ఉంటే చావు తప్పదనిపించింది. అక్కడ ఉండడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని, వెంటనే నా స్కూటర్ ను నెట్టుకుంటూ అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఫ్రెండ్ ఇంటికి వచ్చాను’’ అని వివరించారు.

ఇంకా కష్టాలున్నాయి..

అయితే, ఇంటికి తిరిగి వెళ్ళడం కూడా ఈ వ్యక్తికి అంత సులభం కాలేదు. తన స్నేహితుడి ఇంటికి చేరుకుని రైడ్ హెయిలింగ్ యాప్ ద్వారా తన ఇంటికి వెళ్లడానికి ఆటో బుక్ చేసుకున్నానని ఆ వ్యక్తి వివరించాడు. ‘‘అయితే ఆటో డ్రైవర్ పికప్ లొకేషన్ కు చేరుకోగానే ఛార్జీలు పెంచి, 6 కిలోమీటర్ల ప్రయాణానికి రూ.500 చెల్లించకపోతే ప్రయాణాన్ని రద్దు చేస్తానని బెదిరించాడు. గత్యంతరం లేక, నా స్కూటర్ ను అక్కడే వదిలేసి, ఆ మొత్తాన్ని చెల్లించి ఆటోలో ఇంటికి చేరుకున్నాను’’ అని తన అనుభవాన్ని ముగించాడు. గ్రేప్ వైన్ (Grapevine) అనేది ఒక యాప్.

నెటిజన్ల స్పందన

ఈ పోస్ట్ కు చాలా మంది నెటిజన్లు స్పందించారు. అనేక మంది గ్రేప్ వైన్ వినియోగదారులు బెంగళూరుపై అతని అనుభవాలతో ఏకీభవించారు. ‘‘మీరు క్షేమంగా ఉన్నందుకు సంతోషంగా ఉంది. వర్షం పడుతున్నప్పుడు ప్రయాణాల విషయంలో మా అమ్మానాన్నలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. బెంగళూరులో పుట్టి పెరిగారు కాబట్టి ట్రాఫిక్ తో ఎంత కష్టపడతారో వారికి తెలుసు’’ అని ఓ వ్యక్తి రాసుకొచ్చాడు. రోడ్లు సరిగా లేకపోవడం, ట్రాఫిక్, స్థానిక క్యాబ్/ఆటో డ్రైవర్ల దురుసు ప్రవర్తన కారణంగా బెంగళూరును వదిలివెళ్లినట్లు మరొకరు వెల్లడించారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024



Source link