Bigg Boss 8 Telugu: త్యాగం చేసిన నబీల్.. మణి కోసం హరికథ పాడిన హరితేజ.. చార్జింగ్ కోసం కిందామీదా పడిన కంటెస్టెంట్లు

Best Web Hosting Provider In India 2024

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఆట హోరాహోరీగా సాగుతోంది. హౌస్‍లో ప్రస్తుతం ఏడో వారం జరుగుతోంది. నేటి (అక్టోబర్ 16) ఎపిసోడ్‍లో నామినేషన్ల సందర్భంగా జరిగిన గొడవను కంటెస్టెంట్లు రీక్రియేట్ చేశారు. విష్ణుప్రియ, గంగవ్వ మధ్య ఎమోషనల్‍గా మాటలు సాగాయి. హరితేజ.. హరికథ పాడారు. చార్జింగ్ గేమ్ కూడా పోటాపోటీగా మొదలైంది. ఆ వివరాలు ఇవే..

ప్రేరణ అసంతృప్తి

నామినేషన్ల సమయంలో జరిగిన విషయాలకు ప్రేరణ బాగా అసంతృప్తి చెందినట్టు అర్థమైంది. కిచెన్‍లో పని చేస్తున్న ప్రేరణను నిఖిల్ పలుకరించారు. విష్ణు అన్న మాటలకు కూడా హర్ట్ అయినట్టు చెప్పారు. తాను హౌస్ కోసం పని చేస్తానని అన్నారు.

విష్ణు ఎమోషనల్.. గంగవ్వ కన్నీరు

గంగవ్వతో తన కుటుంబ విషయాలను విష్ణుప్రియ చెప్పుకున్నారు. “నాకేం కావోలో అవన్నీ ఇచ్చి మా అమ్మ.. నన్ను పెంచింది. అందుకే మా నాన్నపై ఎంత ప్రేమ ఉన్నా అమ్మ కోసం ఆయనతో మాట్లాడలేదు” అని విష్ణు చెప్పారు. దీంతో గంగవ్వ కన్నీరు పెట్టుకున్నారు. చిన్నప్పుడు నాకు జరిగిన ఘోరం అమ్మనాన్న విడిపోవడం అంటూ గంగవ్వను విష్ణు హత్తుకున్నారు.

తనతో ఎందుకు మాట్లాడడం లేదని ప్రేరణను విష్ణు అడిగారు. దీంతో మాట్లాడేందుకు ఏముంది అని ప్రేరణ అన్నారు. ఎమోషనల్ అయినా తన వద్దకు రాలేదని విష్ణును ప్రేరణ నిలదీశారు. పృథ్వి రివేంజ్ కోసం చేస్తున్నారని అందరికీ అర్థమైందని ప్రేరణ అన్నారు. పృథ్వి నామినేషన్లలో ఉండేందుకు, బయటికి వెళ్లేందుకు కూడా అర్హుడని ప్రేరణ అన్నారు. తమ క్లాన్‍లో ఐకమత్యం లేదని నబీల్, మణి మాట్లాడుకున్నారు.

నబీల్ ‘స్వీట్స్’ త్యాగం

అన్‍లిమిటెడ్ రేషన్ కావాలని నబీల్ కోరాడని, ఈ వారానికి అది నెరవేరుస్తానని బిగ్‍బాస్ చెప్పారు. అయితే దీని కోసం హౌస్‍లో ఉన్నంతకాలం నబీల్ స్వీట్లు తినకూడదని అన్నారు. అలా చేస్తే మెగాచీఫ్ మహబూబ్.. అన్‍లిమిటెడ్ రేషన్ తీసుకోవచ్చని చెప్పారు.

స్వీట్లు, చాకెట్లు లాంటి స్వీట్లు ఏమీ తనను అని నబీల్ చెప్పారు. హౌస్ కోసం స్వీట్స్ త్యాగం చేశారు. దీంతో సూపర్ మార్కెట్‍లో అన్‍లిమిటెడ్ షాపింగ్ చేశారు మహబూబ్. ఉన్నవన్నీ తీసుకున్నారు.

వారానికో అరతులం

ఈ వారం తాను సేవ్ అయితే బంగారు ముక్కు పుడక ఇస్తానని గంగవ్వతో మణికంఠ చెప్పారు. హరితేజ బంగారు వడ్డాణం అడిగితే.. బేగంబజార్‌కు వెళ్లి ఇస్తానని అన్నారు. రోహిణి అడిగితే.. లిప్‍స్టిక్, ముద్దు ఇస్తానని మణి చెప్పారు. తులం బంగారం కావాలని గంగవ్వ అడిగారు. మొత్తంగా హౌస్‍లో ఉండే ప్రతీ వారానికి అర తులం బంగారం ఇస్తానని గంగవ్వకు మణి మాట ఇచ్చారు.

నామినేషన్లపై ఫన్నీగా..

నామినేషన్ల సమయంలో కంటెస్టెంట్లు చేసిన వాగ్వాదాలను రోహిణి, అవినాశ్ రీక్రియేట్ చేశారు. మరికొందరు హౌస్‍మేట్స్ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా రోహిణి బాగా ఎంటర్‌టైన్ చేశారు. గంగవ్వను బాగా ఇమిటేట్ చేశారు. కంటెస్టెంట్లు బాగా నవ్వుకున్నారు. ఆ తర్వాత 45వ రోజు మొదలైంది.

గంగవ్వకు మెగాచీఫ్ షీల్డ్

రాయల్ క్లాన్ నుంచి మెగా చీఫ్ పోటీదారుగా గంగవ్వకు షీల్డ్ ఇచ్చారు సభ్యులు. గంగవ్వకు షీల్డ్ ఇచ్చారు మహబూబ్. లాస్ట్ టైమ్ తాము ఆడిన గేమ్‍ల్లో తేజ, గంగవ్వ కంటెండర్లు అవలేదని గౌతమ్ చెప్పారు. గంగవ్వకు ఇచ్చేందుకు తేజ అంగీకరించారని, అందుకే ఆమెకు షీల్డ్ ఇస్తున్నామని గౌతమ్ చెప్పారు.

చార్జింగ్ కోసం హోరాహోరీ

2050వ సంవత్సరంలో పరిస్థితి ఎలా ఉంటుందో కంటెస్టెంట్లకు కథ చెప్పారు బిగ్‍బాస్. ఆ తర్వాత ఆ సంవత్సరంలో ఉన్నామనుకోవాలని చెప్పారు. రాయల్ టీమ్‍ను ఓవర్ స్మార్ట్ ఫోన్స్ టీమ్‍గా బిగ్‍బాగ్ చెప్పారు. ఓజీ క్లాన్ సభ్యులను ఓవర్ స్మార్ట్ చార్జర్లుగా నియమించారు. ఓవర్ స్మార్ట్ ఫోన్ల చార్జింగ్ అయిపోతుందని, అయితే బ్యాటరీ అయిపోయి చనిపోకుండా వారు చూసుకోవాలని బిగ్‍బాస్ చెప్పారు. ఇందుకోసం ఓవర్ స్మార్ట్ చార్జర్ల నుంచి వైర్ల ద్వారా చార్జింగ్ పొందాలని అన్నారు. ఇందుకోసం వారు అడిగినవి ఇవ్వాలని, లేకపోతే తెలివితేటలతో పొందాలని ఓవర్ స్మార్ట్ ఫోన్ మెంబర్లకు చెప్పారు.

చార్జింగ్ గేమ్‍లో కంటెస్టెంట్లు కిందామీదా పడ్డారు. ఇలా రెండు క్లాన్‍ల మధ్య హోరాహోరీగా ఆట సాగింది. నబీల్‍ వెనుక నుంచి సైలెంట్‍గా వచ్చి చార్జింగ్ పెట్టుకున్నారు అవినాశ్. కుండ పగులగొట్టే చాలెంజ్ కూడా గట్టిగానే జరిగింది.

మణికి హరికథ చెప్పిన హరితేజ

చార్జింగ్ కోసం ఓవర్ స్మార్ట్ చార్జర్ మణికంఠను కాకాపట్టారు హరితేజ. హౌస్‍లో మణికంఠ జర్నీ గురించి హరికథ పాడారు హరితేజ. ఈ హరికథతో మణిని ఇంప్రెస్ చేశారు. దీన్ని మణి బాగా ఎంజాయ్ చేశారు. దీంతో తన వైర్‌తో హరితేజకు ఒక నిమిషం చార్జింగ్ ఇచ్చారు మణి. హరితేజ బ్యాటరీ పెరిగింది. ఆమె డ్యాన్స్ చేశారు.

కిందామీద పడిన కంటెస్టెంట్లు

ఓవర్ స్మార్ట్ ఫోన్ సభ్యులు చార్జింగ్ కోసం ప్రయత్నిస్తే.. ఓవర్ స్మార్ట్ చార్జర్ సభ్యులు అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో కొందరు కంటెస్టెంట్లు కిందామీదా పడ్డారు. నయని పావనికి కాస్త గాయం అయింది. ఇది హోరాహోరీగా సాగింది. ఈ గేమ్ ఇంకా కొనసాగనుంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024