బాబా సిద్ధిఖీ హత్య కేసు.. యూట్యూబ్ చూసి శిక్షణ పొందిన షూటర్లు.. ఇన్‌స్టా, స్నాప్‌చాట్‌లో కమ్యూనికేషన్

Best Web Hosting Provider In India 2024


మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య సంచలనం సృష్టించింది. ముంబై పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. నెలల తరబడి సిద్ధిఖీని చంపేందుకు ఎలా ప్లాన్ వేశారో బయటపెట్టారు. ఈ నేరంలో నెట్‌వర్క్ ప్రమేయం ఉంది. దర్యాప్తులో నిందితులు, వారి పద్ధతులు, హత్య చేసేందుకు ఎలాంటి పద్ధతులో పాటించారో బయట పడింది.

పూణేలో సిద్ధిఖీని హతమార్చడానికి పక్కా ప్రణాళిక వేశారు. దాడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి ఎటువంటి ఆయుధాలు లేకుండా సిద్ధిఖీ నివాసానికి అనేకసార్లు నిందితులు సందర్శించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ కీలక ప్రత్యక్ష సాక్షులతో సహా 15 మంది వ్యక్తుల నుండి వాంగ్మూలాలను నమోదు చేసింది.

‘ముంబై క్రైమ్ బ్రాంచ్ నుండి అందిన సమాచారం ప్రకారం.., బాబా సిద్ధిఖీ హత్యకు సంబంధించిన మొత్తం ప్లానింగ్ పూణేలో జరిగింది. ముంబై క్రైమ్ బ్రాంచ్ ఇప్పటివరకు 15 మందికి పైగా వాంగ్మూలాలను నమోదు చేసింది. సంఘటన సమయంలో అక్కడ చాలా మంది ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు.’ అని ఏఎన్ఐ తెలిపింది.

అక్టోబర్ 12 ఘటన జరిగిన కొద్దిసేపటికే అరెస్టయిన షూటర్లు గుర్మైల్ సింగ్, ధరమ్‌రాజ్ కశ్యప్‌లు యూట్యూబ్ వీడియోలను చూసి శిక్షణ పొందారని తెలుస్తోంది. వారు సిద్ధిఖీ ఫోటోను అందుకోగానే అతడిని లక్ష్యంగా చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి.

ప్రస్తుతం నలుగురు వ్యక్తులను అరెస్టు చేయడంతో అనుమానితుల వల బయటపడింది. పూణేకు చెందిన ప్రవీణ్ లోంకర్ ఈ ఇందులో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. తాజాగా అరెస్టు అయిన హరీష్‌కుమార్ నిసాద్.. నిందితులకు రూ. 2 లక్షలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆయుధాలు డెలివరీ చేయడంతో సహా ఆర్థిక, రవాణా సహాయాన్ని అందించాడనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో ఇద్దరు కీలక వ్యక్తులు పరారీలో ఉన్నారు. మరో అనుమానిత షూటర్ శివకుమార్ గౌతమ్, ప్రవీణ్ సోదరుడు శుభమ్ లోంకర్ జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి.

నిందితులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై ఎక్కువగా ఆధారపడినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కమ్యూనికేషన్ కోసం స్నాప్‌చాట్, కాల్‌ల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. దాడికి ముందు 25 రోజుల పాటు సిద్ధిఖీ నివాసం, కార్యాలయంపై నిఘా పెట్టారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024



Source link