Breakfast: అన్నం మిగిలిపోయిందా? ఇలా స్పాంజీ ప్యాన్‌కేక్స్ చేసేయండి

Best Web Hosting Provider In India 2024

రాత్రి పూట అన్నం మిగిలిపోయినా, లేదంటే ప్రొద్దున చేసిన అన్నంతో అయినా సాయంత్రం పూట స్నాక్ లేదా పొద్దున అల్పాహారం చేసేయొచ్చు. మిగిలిన అన్నంలో గోదుమ పిండి, కూరగాయలు కలిపి చేసే ప్యాన్ కేకులు చాలా రుచిగా ఉంటాయి. దీంట్లో అన్నాన్ని మిక్సీ పట్టకుండా అలాగే వాడతాం కాబట్టి మధ్య మధ్యలో క్రిస్పీగా మారిన అన్నం పలుకులు తినేటప్పుడు తగిలి మంచి రుచినిస్తాయి.

అన్నం ప్యాన్‌కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల అన్నం

పావు కప్పు గోధుమ పిండి

సగం కప్పు శనగపిండి

1 క్యారట్ తురుము

1 ఉల్లిపాయ సన్నటి ముక్కలు

2 ఉల్లికాడల సన్నటి తరుగు

పావు కప్పు క్యాబేజ్ తరుగు

పావు చెంచా పసుపు

చిటికెడు ఇంగువ

2 పచ్చిమిర్చి సన్నటి తరుగు

చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద

2 చెంచాల పెరుగు

తగినంత ఉప్పు

కొద్దిగా కొత్తిమీర తరుగు

నూనె

అన్నం ప్యాన్‌కేక్ తయారీ విధానం:

1. ఒక పెద్ద గిన్నెలో అన్నం, క్యారట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజీ తరుగు, ఉల్లికాడ తరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి.

2. అందులోనే గోదుమపిండి, శనగపిండి, పసుపు, ఇంగువ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, పెరుగు, ఉప్పు, కొత్తిమీర కూడా వేసుకుని మరోసారి కలపాలి. ఇప్పుడు పావు కప్పు నీళ్లు పోసుకుని ముద్దలాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కాస్త మెత్తగానే ఉండాలి.

3. ఈ పిండి మీద తడిగుడ్డ కప్పేసి కనీసం పావుగంట సేపు పక్కన ఉంచుకోవాలి.

4. పిండిని సమాన భాగాలుగా చేసుకుని ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి.

5. ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకుని దానికి బాగా నూనె రాసి పిండి ఉండను పెట్టి చేత్తోనే వెడల్పుగా పరాటా సైజులో ఈ ప్యాన్ కేక్ ఒత్తుకోవాలి.

6. పెనం పెట్టుకుని వేడెక్కాక కాస్త నూనె వేసుకుని ఈ ప్యాన్ కేక్ పెట్టాలి. చుట్టూ నూనె పోసుకుంటే కాల్చుకోవాలి. కాస్త రంగు మారాక తీసేసుకుంటే చాలు. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే ప్యాన్ కేక్ రెడీ అయినట్లే.

7. దీన్ని కెచప్ లేదా చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. లేదంటే అలాగే తినేయొచ్చు.

ఈ ప్యాన్‌కేక్ లో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అన్ని రకాల కూరగాయ ముక్కలు కూడా వాడుతున్నాం కాబట్టి మరింత ఆరోగ్యకరం. ఉదయం పూట అల్పాహారానికి, సాయంత్రం పూట స్నాక్ లాగా తినడానికి కూడా మంచి రెసిపీ ఇది.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024