Kiran Abbavaram: నా సినిమాను రెండు రోజులు ఆగి చూసిన పర్వాలేదు, కానీ.. హీరో కిరణ్ అబ్బవరం కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Kiran Abbavaram Comments On Ka: గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “లవ్ రెడ్డి” . అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా స్వచ్ఛమైన ప్రేమకథగా నూతన దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్

ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి “లవ్ రెడ్డి” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా “లవ్ రెడ్డి” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు వస్తోంది.

కిరణ్ అబ్బవరం కామెంట్స్

“లవ్ రెడ్డి” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హీరో కిరణ్ అబ్బవరం ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. లవ్ రెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరం కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆర్థిక ఇబ్బందులతో

“నేనూ, అంజన్ షార్ట్ ఫిలింస్ నుంచి వచ్చాం. ఆ ఎమోషనల్ బాండింగ్ మా మధ్య ఉంది. చాలా మంది ఇక్కడ కష్టాలు పడలేక, ఆర్థిక ఇబ్బందులతో తిరిగి వెళ్లిపోయారు. అంజన్ గట్టిగా నిలబడి ఉన్నందుకు అతనికి థ్యాంక్స్ చెబుతున్నా. మూడేళ్లుగా అంజన్ ఫ్యామిలీ అంతా లవ్ రెడ్డి సినిమా కోసం కష్టపడుతున్నారు. ఒక ఫ్యామిలీ కష్టపడి చేసిన సినిమా కాబట్టి మీరంతా ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడండి” అని కిరణ్ అబ్బవరం అన్నాడు.

స్పాన్సర్ చేస్తాను

“కంటెంట్ నచ్చితే లవ్ రెడ్డి సినిమాను హార్ట్‌ఫుల్‌గా సపోర్ట్ చేయండి. నా వల్ల అయిన హెల్ప్ నేను చేస్తా. ఆంధ్ర, సీడెడ్, నైజాంలో ఒక్కో షో నేను స్పాన్సర్ చేస్తాను. అంజన్‌కు ఇండస్ట్రీ నుంచి తిరిగి వెళ్లిపోయే ఉద్దేశం లేదు. తను మంచి స్థాయికి చేరుకోవాలి. శ్రావణి తెలుగింటి అమ్మాయిలా ఉంది. ఆమె మాట్లాడిన స్పీచ్ ‌కైనా సినిమాకు వెళ్లండి” అని కిరణ్ అబ్బవరం చెప్పాడు.

కర్ణాటకలో హోంబలే ఫిల్మ్స్

“నా క సినిమా ఈనెల 31న రిలీజ్ అవుతోంది. లవ్ రెడ్డి 18న వస్తోంది. నా సినిమా రెండు రోజులు ఆగి చూసినా పర్వాలేదు. లవ్ రెడ్డి మాత్రం వెంటనే చూసేయండి. సినిమా మీద ఎంతో ప్రేమ ఉన్న ఇలాంటి టీమ్ సక్సెస్ కావాలి. లవ్ రెడ్డి సినిమాను నైజాంలో రిలీజ్ చేస్తున్న మైత్రీ వారికి, ఆంధ్రలో రిలీజ్ చేస్తున్న వంశీ గారికి, కర్ణాటకలో రిలీజ్ చేస్తున్న హోంబలే సంస్థకు థ్యాంక్స్ చెబుతున్నా” అని కిరణ్ అబ్బవరం తెలిపాడు.

పాన్ ఇండియన్ మూవీగా

ఇదిలా ఉంటే, కిరణ్ అబ్బవరం చేస్తున్న పాన్ ఇండియా మూవీ క. యాక్షన్, సస్పెన్స్ డ్రామాగా తెరకెక్కిన క టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సుజీత్, సందీప్ ద్వయం తెరకెక్కిస్తున్న క మూవీలో హీరోయిన్స్‌గా తన్వి రామ్, నయన్ సారిక చేస్తున్నారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024