Goddess Of Justice : చట్టానికి కళ్లున్నాయ్.. న్యాయదేవత కళ్ల గంతలు తొలగింపు, చేతిలోకి రాజ్యాంగం!

Best Web Hosting Provider In India 2024


చట్టానికి కళ్లు లేవు అనే మాట ఎప్పుడూ వింటుంటాం. చాలా మంది ఈ విషయాన్ని అంటుంటారు. అయితే సుప్రీం కోర్టులోని జడ్జీల లైబ్రరీలో ఏర్పాటు చేసిన న్యాయదేవత కళ్లకు గంతలు తొలగించారు. ఎడమ చేతిలో ఖడ్గానికి బదులుగా రాజ్యాంగాన్ని పెట్టారు. దీనిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టులో లేడీ ఆఫ్ జస్టిస్ కొత్త విగ్రహం కళ్లకు గంతలు తొలగించడంపై అందరూ మాట్లాడుకుంటున్నారు. చట్టం గుడ్డిది కాదని చెప్పడం దీని ఉద్దేశం.

న్యాయదేవత కుడిచేతిలో త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉంటాయి. త్రాసు న్యాయానికి ప్రతిబింబంగా, ఖడ్గం తప్పు చేసినవారికి శిక్ష తప్పదనే ఉద్దేశాన్ని చెప్పేవి. అయితే తాజాగా ఎడమచేతిలోకి రాజ్యాంగం వచ్చింది, కళ్లకు గంతలు తొలగించారు. కళ్లకు గంతలు చట్టం ముందు సమానత్వాన్ని సూచించడానికి ఉద్దేశించినది. న్యాయస్థానాల ముందుకు వచ్చే వారి సంపద, అధికారం లేదా ఇతర హోదా గుర్తులను పట్టించుకోదని ఈ విషయం సూచిస్తుంది. ఖడ్గం అధికారాన్ని, అన్యాయాన్ని శిక్షించే శక్తిని సూచిస్తుంది.

ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టులోని న్యాయమూర్తుల లైబ్రరీలోని కొత్త విగ్రహాని కళ్లు తెరిచి, ఎడమచేతిలో రాజ్యాంగాన్ని పెట్టారు. న్యాయం గుడ్డికాదని, చట్టానికి కళ్లున్నాయ్ అని చెప్పే బలమైన ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు సుప్రీం కోర్టు లైబ్రరీలోని న్యాయదేవత విగ్రహానికి మార్పులు చేశారు.

ప్రధాన న్యాయమూర్తి కార్యాలయానికి సంబంధించిన ఉన్నత వర్గాల సమాచారం ప్రకారం, భారతదేశం బ్రిటిష్ వలస పాలన ఛాయల నుంచి ముందుకు సాగాలని, చట్టం ఎప్పుడూ గుడ్డిది కాదని, అది అందరినీ సమానంగా చూస్తుందని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారని అంటున్నారు.

‘ప్రధాన న్యాయమూర్తి న్యాయదేవత విగ్రహ రూపాన్ని మార్చాలని అన్నారు. విగ్రహానికి ఒక చేతిలో రాజ్యాంగం ఉండాలి.. కత్తి కాదు. తద్వారా ఆమె న్యాయం చేస్తుందని దేశానికి సందేశం వెళ్తుంది. న్యాయస్థానాలు రాజ్యాంగ చట్టాల ప్రకారం న్యాయాన్ని అందజేస్తాయి.’ అని ప్రధాన న్యాయమూర్తి కార్యాలయ అధికారులు తెలిపినట్టుగా ఎన్డీటీవీ చెప్పింది.

Whats_app_banner

టాపిక్

Best Web Hosting Provider In India 2024



Source link