TG LAWCET Counselling 2024 : తెలంగాణ లాసెట్ స్పాట్ అడ్మిషన్లు – ఇవాళ ఒక్కరోజే రిజిస్ట్రేషన్లు, పూర్తి వివరాలు

Best Web Hosting Provider In India 2024

రాష్ట్రంలో లాసెట్ ప్రవేశాల ప్రక్రియ చివరి దశకు చేరింది. ఇప్పటికే రెండు విడతల్లో సీట్ల కేటాయింపు జరగా… ఇవాళ(అక్టోబర్ 17) ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ స్పాట్ అడ్మిషన్లలో భాగంగా… ఎల్ఎల్ బీ మూడేళ్లు, ఐదేళ్ల కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. జనరల్ అభ్యర్థులు రూ. 800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి. ఆన్ లైన్ లో చెల్లించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో ధ్రువపత్రాల పరిశీలన పూర్తి అవుతుంది. మొత్తం 23 కాలేజీల్లో స్పాట్ ప్రవేశాలు ఉంటాయి.

కాలేజీల వివరాలతో పాటు రిజిస్ట్రేషన్ లింక్ కూడా అందుబాటులో ఉంది. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత సంబంధిత కాలేజీకి నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. స్పాట్ అడ్మిషన్లలో కూడా లాసెట్ ర్యాంక్ కార్డు కీలకంగా ఉంటుంది. మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా ప్రవేశాలు ఉంటాయి.

Open PDF in New Window

కావాల్సిన ధ్రువపత్రాలు :

  • టీజీ లాసెట్ ర్యాంక్ కార్డు – 2024
  • పదో తరగతి మెమో
  • ఇంటర్మీడియట్ మెమో
  • డిగ్రీ ఒరిజినల్ మెమో
  • స్టడీ సర్టిఫికెట్స్
  • టీసీ
  • కుల ధ్రువీకరణపత్రం
  • రెసిడెన్స్ సర్టిఫికెట్

ఈ ఏడాది జరిగిన తెలంగాణ లాసెట్ పరీక్షకు 40,268 మంది హాజరయ్యారు. వీరిలో 29,258 మంది అర్హత సాధించారు. మొత్తంగా 72.66 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులు అయ్యారు. పరీక్ష రాసిన అభ్యర్థులు https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

  • తెలంగాణ లాసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు మొదటగా https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • Download Rank Card అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • Hall Ticket Number, పుట్టిన తేదీని ఎంట్రీ చేయాలి.
  • గెట్ రిజల్ట్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే మీ స్కోర్ తో పాటు ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.

NOTE : స్పాట్ అడ్మిషన్స్ రిజిస్ట్రేషన్ లింక్స్ : https://lawcetadm.tsche.ac.in/spot/info/index?cc=collegecode

 

 

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Ts LawcetAp LawcetAdmissionsTelangana NewsEducationOsmania University
Source / Credits

Best Web Hosting Provider In India 2024