Best Web Hosting Provider In India 2024
Pradeep Machiraju: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా తర్వాత దాదాపు మూడేళ్ల అనంతరం హీరోగా సెకండ్ మూవీతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు యాంకర్ ప్రదీప్ మాచిరాజు. ఈ సినిమా టైటిల్‌తో పాటు దర్శకుడు, హీరోయిన్ల వివరాలను గురువారం అనౌన్స్‌చేశారు.
ప్రదీప్ మాచిరాజు కొత్త సినిమాకు పవన్ కళ్యాణ్ డెబ్యూ మూవీ ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి పేరును ఫిక్స్చేశారు. ఈ మూవీతో జబర్ధస్థ్ కామెడీ షో క్రియేటర్స్‌గా, డైరెక్టర్లుగా చాలా కాలం పనిచేసిన నితిన్, భరత్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్నారు. ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయితో దర్శకులుగా మారుతున్నారు.
దీపికా పిల్లి హీరోయిన్…
అక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి మూవీలో యాంకర్ దీపికా పిల్లి హీరోయిన్గా నటిస్తోంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్, సర్కార్ షోలకు దీపికా పిల్లి హోస్ట్‌గా వ్యవహరించింది. ఇక్కడ అమ్మాయి…అక్కడ అబ్బాయి ఫస్ట్ లుక్ పోస్టర్లో ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి రొమాంటిక్ లుక్‌లో కనిపిస్తోన్నారు.
సివిల్ ఇంజినీర్ లవ్‌స్టోరీ…
ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన లవ్ ఎంటర్టైనర్గా ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి మూవీని తెరకెక్కించబోతున్నట్లు దర్శకద్వయం ప్రకటించారు. ఈ మూవీలో ప్రదీప్ మాచిరాజు సివిల్ ఇంజినీర్ క్యారెక్టర్లో కనిపించనున్నట్లు వెల్లడించారు. తన ఉద్యోగం నిమిత్తం ఓ విలేజ్‌కు వస్తాడు సివిల్ ఇంజినీర్.
అక్కడి పల్లెటూరి అమ్మాయితో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. తన ప్రేమను దక్కించుకోవడం కోసం ఇంజినీర్ ఎలా కష్టాలు పడ్డాడు? ఆ అమ్మాయి కూడా అతడికి ఇష్టపడిందా? లేదా? అనే అంశాలతో ఈ మూవీ సాగనున్నట్లు సమాచారం.
వెన్నెలకిషోర్, సత్య…
ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి మూవీలో వెన్నెలకిషోర్, గెటప్ శ్రీను, సత్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. అర్జున్ రెడ్డి ఫేమ్ రధన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి షూటింగ్ పూర్తయినట్లు సమాచారం.
టీవీ షోస్‌కు దూరం…
ఈ మూవీ కోసమే కొన్నాళ్లుగా ప్రదీప్ మాచిరాజు టీవీ షోస్‌కు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. తెలుగులో ఢీ, డ్రామా జూనియర్స్, కామెడీ ఖిలాడీలు, సరిగమప, సర్కార్‌తో పాటు పలు టీవీ షోస్‌కు హోస్ట్‌గా పనిచేశాడు ప్రదీప్ మాచిరాజు. వరుడు, అత్తారింటికి దారేది, జులాయితో పాటు మరికొన్ని సినిమాల్లో చిన్న పాత్రలు చేశాడు.
హీరోగా తొలి మూవీ 30 రోజుల్లో ప్రేమించడం మిక్స్డ్ రిజల్ట్‌ను తెచ్చిపెట్టింది. పాటలు పెద్ద హిట్టయినా రొటీన్ స్టోరీ కారణంగా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా ఈ మూవీ నిలిచింది. జబర్ధస్థ్తో పాటు ఢీ, నా షో నా ఇష్టం, దసరా మహోత్సవంతో పాటు మరికొన్ని టీవీ షోస్‌కు డైరెక్టర్లుగా పనిచేశారు నితిన్ భరత్.