Bomb hoax: విమానాలకు బాంబు బెదరింపు మెసేజ్ ల కేసులో మైనర్ అరెస్ట్; కారణం వింటే విస్తుపోతారు..

Best Web Hosting Provider In India 2024


Fke bomb threats: విమానాలకు నకిలీ బాంబు బెదిరింపుల కేసులో చత్తీస్ గఢ్ కు చెందిన 17 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన పొరుగింటి వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించడానికిి, అతడి పేరుపై ఎక్స్ లో ఖాతా తెరిచి, ఆ అకౌంట్ నుంచి విమానాల్లో బాంబులు ఉన్నట్లు తప్పుడు సందేశాలు పంపించాడు.

ఇండిగో, ఎయిరిండియా విమానాల్లో..

రెండు ఇండిగో, ఒక ఎయిరిండియా విమానాల్లో బాంబులు పెట్టినట్లు సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి మూడు సందేశాలను పోస్ట్ చేసినట్లు పోలీసులు ఇప్పటివరకు గుర్తించారు. చత్తీస్ గఢ్ లోని రాజ్ నంద్ గావ్ జిల్లాకు చెందిన యువకుడిని, అతని పొరుగింటి వ్యక్తి (34)ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరినీ విచారణ నిమిత్తం ముంబైకి తీసుకొచ్చారు. రాజ్ నంద్ గావ్ జిల్లాలో 33 ఏళ్ల యువకుడు దుకాణం నిర్వహిస్తుండగా, 17 ఏళ్ల యువకుడు కాలేజీ స్టూడెంట్. ఆ మైనర్ ను విచారించగా పక్కింటి 33 ఏళ్ల యువకుడు, తను గతంలో ఒకరికొకరు ఆర్థిక సహాయం చేసుకునేవారని, ఆ లావాదేవీలపై వివాదాలు ఉన్నాయని వెల్లడైంది. పక్కింటి వ్యక్తిని తప్పుడు కేసులో ఇరికించేందుకు ఆ యువకుడి పేరు మీద ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేసి ఫేక్ మెసేజ్ లు పోస్ట్ చేశాడు.

అసహజ శృంగారంపై కేసు

మూడు నెలల క్రితం మైనర్ నిందితుడు పక్కింటి 33 ఏళ్ల యువకుడిపై స్థానిక పోలీస్ స్టేషన్ లో అసహజ శృంగారం (unnatural sex) కేసు నమోదు చేశాడు. అంతేకాకుండా, పక్కింటి వ్యక్తి పేరిట ఎక్స్ ఖాతాను క్రియేట్ చేసి అక్టోబర్ 14న తెల్లవారుజామున 1:20 నుంచి 3:30 గంటల మధ్య బెదిరింపు సందేశాలను పోస్ట్ చేశాడని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. షాపు యజమాని పేరు మీద ఎక్స్ ఖాతా ఉందని, 17 ఏళ్ల యువకుడు ఆ ఖాతాను ఆపరేట్ చేశాడని పోలీసులు గుర్తించారు. ఆ షాపు యజమానికి వ్యతిరేకంగా ఏమీ లభించలేదని పోలీసులు చెప్పారు.

కేసు నమోదు

ఎలక్ట్రానిక్ ఆధారాలు సేకరించేందుకు షాపు యజమాని మొబైల్ ఫోన్, మైనర్ ల్యాప్ టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్స్ కు వచ్చిన బెదిరింపు గురించి ఇండిగో ఎయిర్ లైన్స్ సీనియర్ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సహర్ పోలీసులు యువకుడిపై భారతీయ న్యాయ సంహితలోని 125, 351 (4), 353 (1) (బి) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముంబై-మస్కట్ విమానంలో టైమ్ బాంబులు పెట్టారని, ముంబై-న్యూయార్క్ ఎయిరిండియా విమానంలో ఆరు కిలోల ఆర్డీఎక్స్ ఉందని, అందులో ఉన్న ఉగ్రవాదులు మరో 20 నిమిషాల్లో దాన్ని హైజాక్ చేస్తారని @indiGo6E హ్యాండిల్ ను ట్యాగ్ చేస్తూ ఈ బెదిరింపులను ఎక్స్ లో పోస్ట్ చేశారు. సోమవారం తెల్లవారుజామున 1.44 గంటలకు ఈ బెదిరింపులు వచ్చాయి. ఎక్స్ పోస్టు చత్తీస్ గఢ్ లో ఉన్నట్లు గుర్తించిన నగర పోలీసు బృందం అక్కడకు వెళ్లి ఇద్దరిని అరెస్టు చేసి బుధవారం ముంబైకి తీసుకొచ్చారు.

మరో కేసు

ఇదిలావుండగా, అక్టోబర్ 15న ముంబై-సింగపూర్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో సహర్ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముంబై-దర్భాంగా విమానానికి సంబంధించిన ఫేక్ కాల్ కు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్లో మూడో ఎఫ్ఐఆర్ నమోదైంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024



Source link