OTT Comedy Web series: ఆ సూపర్ హిట్ తెలుగు కామెడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. టీజర్ రిలీజ్..

Best Web Hosting Provider In India 2024

OTT Comedy Web series: తెలుగు వెబ్ సిరీస్ లలో మంచి సక్సెస్ సాధించిన సిరీస్ అర్థమయ్యిందా అరుణ్ కుమార్. గతేడాది జూన్ లో తొలి సీజన్ రిలీజై ప్రేక్షకులకు మంచి వినోదం పంచింది. ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ రాబోతోంది. ఆహా ఓటీటీలోనే ఈ రెండో సీజన్ వస్తోంది. తాజాగా గురువారం (అక్టోబర్ 17) సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు.

అర్థమయ్యిందా అరుణ్ కుమార్ సీజన్ 2

ఆహా ఓటీటీలోకి రాబోతున్న వెబ్ సిరీస్ పేరు అర్థమయ్యిందా అరుణ్ కుమార్. ఈ సిరీస్ రెండో సీజన్ అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక దీనికి సంబంధించిన టీజర్ ను గురువారం ఆహా వీడియో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. కార్పొరేట్ కంపెనీలో ఇంటర్న్ తో తన జర్నీ మొదలుపెట్టిన అరుణ్ కుమార్.. ఈ రెండో సీజన్లో అసిస్టెంట్ మేనేజర్ గా మారినట్లు టీజర్లో చూపించారు.

అయితే ఆ ప్రమోషన్ తోనే అతని కష్టాలు కూడా పెరిగినట్లు ఈ టీజర్ చూస్తే తెలుస్తోంది. తన టీమ్ తో పని చేయించుకోవడానికి అరుణ్ కుమార్ పడే కష్టాలను ఈ టీజర్లో చూపించారు. తొలి సీజన్ కంటే రెండో సీజన్ లో ఈ నవ్వులు రెట్టింపైనట్లు అర్థమవుతూనే ఉంది.

అర్థమయ్యిందా అరుణ్ కుమార్ తొలి సీజన్ ఇలా..

హిందీలో ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకున్న అఫీషియల్ చౌక్యాగిరి అనే వెబ్‌సిరీస్ ఆధారంగా అర్ధ‌మైందా అరుణ్‌కుమార్ వెబ్‌సిరీస్‌ను రూపొందించారు ద‌ర్శ‌కుడు జోనాథ‌న్ ఎడ్వ‌ర్డ్స్‌.

కార్పొరేట్ వ‌ర‌ల్డ్‌లో ఓ సామాన్య యువ‌కుడికి ఎదురైన స‌మ‌స్య‌లు, వృత్తి నిర్వ‌హ‌ణ‌లో అత‌డు ఎదుర్కొన్న సంఘ‌ర్ష‌ణ‌ను ఎంట‌ర్‌టైనింగ్‌గా ఈ సిరీస్‌లో చూపించారు. ఈ సింపుల్ పాయింట్‌కు ఓ ట్రాయాంగిల్ ల‌వ్‌స్టోరీతో చిన్న సందేశాన్ని జోడించి సీజ‌న్ వ‌న్‌ను ఎండ్‌చేశారు.

ఇంట‌ర్న్‌గా జాయినైన అరుణ్‌కుమార్ మూడు నెల‌ల‌టైమ్‌లోనే ఎలా ప‌ర్మినెంట్ ఎంప్లాయ్‌గా మారాడ‌న్న‌ది క్లుప్లంగా ఫ‌స్ట్ సీజ‌న్ క‌థ‌. ఈ టైమ్ పీరియ‌డ్‌లో త‌న క‌ల‌ల సాధ‌న‌ కోసం అత‌డు ఏం చేశాడు?

ఈ క్ర‌మంలో ఏం కోల్పోయాడు అన్న‌ది ఎమోష‌న్స్‌, ఫ‌న్ రెండింటిద్వారా ఎక్కడ బోర్ కొట్టకుండా చెప్పడంలో దర్శకుడు చాలా వరకు సక్సెస్ అయ్యాడు. ఎక్కువగా డెప్త్‌గా వెళ్ల‌కుండా స‌హ‌జంగా లైట‌ర్‌వేలోనే సిరీస్‌ను న‌డిపించ‌డం బాగుంది. మెసేజ్ కూడా షుగ‌ర్ కోటేడ్‌లా సింపుల్‌గా ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డ్డాడు త‌ప్పితే లెక్చ‌ర్స్ ఇవ్వ‌లేదు. అయితే కొన్ని చోట్ల అదే మైనస్‌గా కూడా మారింది.

అరుణ్‌కుమార్‌గా హ‌ర్షిత్‌రెడ్డి త‌న డైలాగ్ డెలివ‌రీ, బాడీ లాంగ్వేజ్‌తో ఆక‌ట్టుకున్నాడు. నాచుర‌ల్ యాక్టింగ్‌ను క‌న‌బ‌రిచాడు. ప‌ల్ల‌విగా అన‌న్య శ‌ర్మ సింపుల్ క్యారెక్ట‌ర్‌లో ఒదిగిపోయింది.

ఇంకాస్త ఎమోష‌న‌ల్‌గా ఆమె క్యారెక్ట‌ర్‌ను రాసుకుంటే బాగుండేది. షాలినిగా డామినేష‌న్‌, స్వార్థం క‌ల‌బోసిన పాత్ర‌లో తేజ‌స్వి మ‌దివాడ క‌నిపించింది. మిగిలిన వారిలో కాకా పాత్ర‌లో వాసు ఇంటూరి ఎక్కువ‌గా హైలైట్ అయ్యాడు. హిందీ, తెలుగు మిక్స్ చేస్తూ చెప్పే అత‌డి డైలాగ్స్ కొన్ని చోట్ల న‌వ్విస్తాయి.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024