Brahmamudi October 18th Episode: బ్రహ్మముడి- రుద్రాణిని కొట్టిన తల్లి, చేయెత్తిన అపర్ణ- ఒంటరిగానే రాజ్, కావ్య బతుకులు

Best Web Hosting Provider In India 2024

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ టుడే ఎపిసోడ్‌లో దాంపత్య వ్రతంలో కనకం క్యాన్సర్ నాటకం బయటపెట్టేందుకు రుద్రాణి ట్రై చేస్తుంది. ఏం జరిగిందో చెప్పకుండా ఏంటిది అత్త అని రుద్రాణి అంటుంది. అది మీ అత్తనే అడుగు రాజ్. కూతురు అత్తారిల్లు వదిలి పుట్టింటికి వచ్చిందంటే ఏం చేస్తుంది అని రుద్రాణి అంటుంది.

భర్తతో కలిసి వెళ్లి కూతురు అత్త మామలను బతిమిలాడుకుంటుంది. అల్లుడు కాళ్లు పట్టుకుని అయినా బతిమిలాడుతుంది. కానీ, అలా చేస్తే కనకం ఎలా అవుతుంది. పెళ్లి అప్పుడు పెళ్లికూతురికే ముసుగు వేసింది. ఇప్పుడు అందరికి వేసింది ముసుగు. ఏ అత్త చేయకూడని పనిచేసింది అని రుద్రాణి అంటుంది. నేను ఏం చేయలేదు. దయచేసి మీరేం మాట్లాడకుండా ఉంటారా. మీకు దండం పెడతాను అని కనకం అంటుంది.

సంతోషంగా ఉంటే ఓర్వలేవా

రుద్రాణి అంతా సంతోషంగా ఉంటే ఓర్వలేవా. అందుకే నిన్ను స్వప్న రావద్దని అంది. దూరంగా వెళ్లు అని ఇందిరాదేవి అంటుంది. ఎలాంటి ఆధారం లేకుండా మా అమ్మను అంటే ఇంటి వియ్యపురాలు అని కూడా చూడని అని కావ్య అంటుంది. నువ్వేంటీ చూసేది.. ఇలాంటి ఇంటికి వియ్యపురాలు అని చెప్పుకుంటే నా పరువే పోతుంది అని రుద్రాణి అంటుంది. అంత తప్పు మా అమ్మ ఏం చేసింది అని కావ్య అడుగుతుంది.

అల్లుడుని రప్పించడానికి, కూతురిని, అల్లుడిని కలపడానికి క్యాన్సర్ వచ్చిందని నాలుగు రోజుల్లో చనిపోతుందని అబద్ధం చెప్పింది అని రుద్రాణి అంటుంది. దాంతో అంతా షాక్ అయి లేస్తారు. అత్త.. నీకు ఏం తెలుసని అంటున్నావ్. ఇలాంటి విషయాలు అందరిముందు బయటపెడతారా. అత్తయ్యకు నిజంగానే క్యాన్సర్ ఉంది అని రాజ్ అంటాడు. అవునా ఆ విషయం నిజం అని ఆమెను చెప్పమనండి అని రుద్రాణి అంటుంది.

ఇప్పుడెందుకు మౌనంగా నిల్చుని ఉంది. క్యాన్సర్‌తో కుంగిపోయిందా. సిగ్గుతో మౌనంగా ఉందా అని రుద్రాణి అంటుంది. ఏంటండి మీరు అలాగే ఏం మాట్లడకుండా ఉన్నారు. మా అత్త చెప్పింది అబద్ధం అని ఎందుకు చెప్పట్లేదు. మిమ్మల్నే అడుగుతుంది. మీకు నిజంగానే క్యాన్సర్ లేదా. చెప్పండి అని రాజ్ నిలదీస్తాడు. దాంతో లేదు అని తల ఆడిస్తుంది. చూశారా, అందరు విన్నారా అమాయక జనులారా. దుగ్గిరాల పరివారం అంతా విన్నారా. ఇది కురు సభ కాదు మాయ సభ అని రుద్రాణి అంటుంది.

కనకం డ్రామా కంపెనీ

ఈ ఇంట్లో మాయ విలయతాండవం చేస్తుంది అని పెద్ద పెద్ద డైలాగ్స్ కొడుతుంది రుద్రాణి. కనకం ఏంటే ఇది. ఏం చేసిన క్షమిస్తున్నాను అని చివరికి ఇలా కూడా తలవంపులు తీసుకొస్తున్నావా. ఇంతమంది ముందిలో దోషిగా నిలబడి ఏం సాధించావే అని కోప్పడతాడు కృష్ణమూర్తి. ఇవన్నీ కాదు కానీ నువ్ ఒక డ్రామా కంపెనీ పెట్టుకో. కనకం డ్రామా కంపెనీ. ముగ్గురు కూతుళ్లను హీరోయిన్స్‌గా పెట్టుకో. నువ్వేం చేసిన తాళం ఆడించడానికి మీ ఆయన ఉన్నారు కదా అని రుద్రాణి అంటుంది.

అందులో ఇందులో నిజంగా నా స్వార్థం లేదు. నిజానికి అని కనకం చెప్పబోతుంటే.. రాజ్ దండం పెడతాడు. ఎందుకండి నా ఎమోషన్స్‌తో ఇలా ఆడుకున్నారు. మీరు చనిపోతున్నారని, మీ ఆఖరి కోరిక నెరవేర్చాలని ఇదంతా నా భుజాలపై వేసుకుని చేసినందుకు చివరకు నన్నే ఫూల్‍ను చేశారు కదండి. అడగడుగునా నాటకమే, అబద్ధమే. చివరికి నాకు మీ కూతురు అంటే నచ్చకపోయినా.. మీ కూతురుకు నచ్చకపోయినా ఈ వ్రతం జరిపించాలనుకుని చివరకు వెర్రివాన్ని అయ్యాను అని రాజ్ అంటాడు.

నేను మీ ఇద్దరిని కలపడానికే అని కనకం అంటుంటే.. చాలు ఆపండి అని గట్టిగా అరుస్తాడు రాజ్. వంచనతో కాపురాలు నిలబడతాయని ఎలా అనుకున్నారు. ఏంటీ దారుణం. దుగ్గిరాల ఫ్యామిలీ అనుకుంటున్నారా. లేదా ఏదో సాధారణ కుటుంబం అనుకుంటున్నారా. మీకు లేకపోతే లేదు కనీసం మీ కూతురికి అయినా లేదా.. అని రాజ్ అంటే.. సిగ్గు.. అనండి.. ఆ మాట కూడా అనండి అని కావ్య అంటుంది. ఎన్ని అంటే ఏంటీ ఆ రక్తంలోనే మోసం చేసే గుణం. ఆ పెంపకంలోనే ఉంది వంచించే గుణం అని రాజ్ అంటాడు.

చచ్చిపోవాలని ఉంది

ఎక్కడచోట మారిపోతారని అనిపించింది. కానీ, మీ బుద్ధి చూపించారు. కావాల్సిన దానికోసం ఎంతకైనా దిగజారతారు. చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని రాజ్ అంటాడు. దాంతో చాలు ఆపండి అని కావ్య అంటుంది. ఇందుకేనా ఆ నాటకం ఆడింది. కలిపావా మా ఇద్దరిని.. ఆ.. సిగ్గు లేదు అన్న మాటను మింగేసిన.. ఏం బతుకులు మీవి అంటున్నారు. ఎందుకీ బతుకు మనకు. చచ్చిపోవాలన్నంత అవమానంగా ఉంది. ఏమ్మా నేను నీకు బారమయ్యానా. నన్ను వదిలించుకోవాలని అనుకున్నావా. నన్ను వెళ్లగొట్టాల్సింది అని కావ్య అంటుంది.

అప్పుడు నాకు ముసుగు వేశావ్. నా నిజాయితీ ఆ ముసుగు కిందే ఉండిపోయింది. ఇప్పుడు ఎవరు నమ్ముతారు అని కావ్య అంటుంది. ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. ఈ నాటకానికి తెరతీసిందే నేను అని అపర్ణ అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. కనకం వెనుక ఉండి నడిపించింది నేను అని ఇందిరాదేవి కూడా చెబుతుంది. ఇందులో కనకం సహకరించిందే తప్పా. మోసం చేయలేదు. నా కోడలికి ఏం తెలియదు అని అపర్ణ అంటుంది.

అంటే మీరు కూడా.. మీరు నాలాగే మోసపోయారని ఈ క్షణం వరకు అనుకున్నాను. ఈవిడ లాగే మోసం చేశారని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. వీళ్లతో చేరి మీరు ఇలాగే తయారయ్యారా అని రాజ్ అంటాడు. చెప్పేది విను అని అపర్ణ అంటే.. ఏం చెబుతారమ్మా. అంతా చేరి నాకు ఉచ్చు బిగించారు. ఇప్పుడు చెబుతున్నాను విను. ఇంతకుముందు నువ్ చేసిన సంఘటన వల్ల కళావతిని అపార్థం చేసుకున్నాను అనుకున్నాను. కానీ, ఇప్పుడే బాగా అర్థం చేసుకున్నాను. తల్లితో కలిసి కూతురు కూడా బాగా నటించింది అని రాజ్ అంటాడు.

సిగ్గు పడుతున్నాను

నాటకం బయటపడేసరికి ఏం ఎరగనట్లు మాట్లాడుతుంది. మమ్మీ ఇప్పుడు చెబుతున్నాను విను. ఇక జీవితంలో కళావతిని, ఈ కుటుంబాన్ని నేను చచ్చినా నమ్మను. గుడ్ బై అని తెగేసి చెప్పి వెళ్లిపోతాడు. రుద్రాణి సంతోషిస్తుంది. అది చూసిన ఇందిరాదేవి రుద్రాణిని లాగిపెట్టి కొడుతుంది. ఛీ.. నువ్ అసలు ఆడదానివేనా. విడిపోయినా భార్యాభర్తలను కలిపేందుకు చిన్న ప్రయత్నం చేస్తుంటే జీవితంలో కలవనంత విడిపోయేలా చేశావ్ కదే. ఇన్నాళ్లు పాముకు పాలు పోసి పెంచినందుకు సిగ్గు పడుతున్నాను అని ఇందిరాదేవి అంటుంది.

ఎంతో కష్టపడి ఇద్దరుని ఒక్కటి చేసి పీటలపై కూర్చోబెడితే ఒక్క క్షణంలో ముక్కలు చేశావ్. ఈ పాపం ఊరికే పోదు. సర్వనాశనం అయిపోతావ్ అని ఇందిరాదేవి అంటుంది. అమ్మా మర్యాదగా మాట్లాడు. తప్పు చేసినవాళ్లను వదిలేసి.. వాళ్లతో మీరు చేతులు కలిపి అని రుద్రాణి అంటే.. రుద్రాణి అని కొట్టాడనికి వెళ్తుంది అపర్ణ. ఇంటి ఆడపడుచువు అయిపోయావ్. నువ్ చేసినదానికి నీ ప్రాణం తీసేదాన్ని. ఇక్కడే ఉంటే ప్రాణం తీస్తే.. వెళ్లు ఇక్కడి నుంచి. రేయ్ రాహుల్ తీసుకెళ్లురా మీ అమ్మని అని అపర్ణ అంటుంది.

దాంతో రాహుల్ రుద్రాణిని తీసుకెళ్లిపోతాడు. కావ్య మీ అమ్మను ఏమనకు. కూతురి కాపురం కోసం తల్లడిల్లి పోయే తన బాధను అర్థం చేసుకో. అపార్థం చేసుకోకు అని ఇందిరాదేవి చెబుతుంది. కనకం ఏడుస్తుంటుంది. అర్థం చేసుకుంటావని అనుకుంటాను అని చెప్పి అపర్ణ కూడా వెళ్లిపోతుంది. అప్పు, కల్యాణ్ వెళ్లిపోతారు. తర్వాత కిందకూలిపోతుంది కనకం. చీకటి ఆయే జీవితం అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో సాంగ్ ప్లే అవుతుంది.

ఏంటీ పురుషాహంకారం

మరోవైపు రాజ్ కోపంగా ఉంటాడు. ఏంటిది. ఏం చేశావ్. నువ్ మొండిగా మారి కాపురం ముక్కలు చేసుకుంటే కనకంతో చేరి నాటకం ఆడాం అని అపర్ణ అంటుంది. కానీ, ఓ దరిద్రదేవత కాపురాలు కూల్చడమే పనిగా పెట్టుకుని నాశనం చేసింది అని అపర్ణ అంటుంది. మాట్లాడితే నీ భార్యదే తప్పు అంటావేంట్రా. వాడెవడో ఫోన్ చేస్తే ఆఫీస్‌కు వెళ్లిన కావ్యదే తప్పు, అనామిక మోసం చేసిన అందులోనూ కావ్యదే తప్పు. ఇప్పుడు కూడా కావ్యదే తప్పా. ఏంటీ పురుషాహంకారం అని ఇందిరాదేవి నిలదీస్తుంది.

తప్పులు పొరపాట్లు ఎవరు చేయట్లేదు. దానికి విడిపోతున్నారా. అది ఓ బతుకారా. తెగిన గాలిపటంలా మారుతార్రా. అర్థం చేసుకో. నాకు వంశాభివృద్ధి కావాలి. నీతోనే వంశం అంతమైపోకూడదు. పంతాలు పట్టింపులు తెంచుదామనుకుంటే నువ్ పెంచుకుంటూ పోతున్నావ్ అని అపర్ణ అంటుంది. భార్యాభర్తలు విడిపోతే ఎలా ఉంటారో సాక్ష్యంగా ఇద్దరు ఉన్నారు. రుద్రాణి ఏం సాధించింది, అనామిక బంధం తెంచుకుని ఏం అయింది. నీ భార్య మాత్రం నిన్నే నమ్ముకుంది. అలాంటిదానికి అన్యాయం చేస్తే ఆ బాధ నిన్ను జీవితాంతం వదలదురా అని ఇందిరాదేవి అంటుంది.

చాలు ఆపండి. నాకు చెప్పే హక్కు మీరిద్దరు పోగొట్టుకున్నారు. నాటకం చూశాకా నాకు ఎవరు ఎన్ని చెప్పిన నేను నమ్మను. నాకు నమ్మకం కుదరదు అని రాజ్ అంటాడు. దీంతో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్‌లో నన్నిలా వదిలేయండి. నేను ఇక ఒంటరిగానే బతకాలని అనుకుంటున్నాను. కలపాలని ఎలాంటి ప్రయత్నం చేయకండి అని రాజ్ అంటాడు. మేము కలుస్తామన్న నమ్మకమే నాకు లేదు. ఇక దీన్ని ఇక్కడితో వదిలేయండి అని కావ్య అంటుంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024