Mysterious Fever: ఫాస్ట్ ఫుడ్ తినేవారిలో అంతుపట్టని కుంటి జ్వరం, ఈ లక్షణాలు మీలోనూ కనిపిస్తే జాగ్రత్త

Best Web Hosting Provider In India 2024

వాతావరణ చల్లగా మారడంతో వైరల్ ఫీవర్లు పెరిగిపోతున్నాయి. బీహార్లో అంతుపట్టని జ్వరం వ్యాప్తి చెందింది. దీని లక్షణాలను బట్టి దానికి కుంటి జ్వరం అన పేరుపెట్టారు. ఈ జ్వరం వల్ల మోకాళ్లు, నడుము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. దీంతో ఆ జ్వరానికి ‘లేమ్ ఫీవర్’ అని పేరు వచ్చింది. అదే తెలుగులో కుంటి జ్వరంగా చెప్పుకుంటున్నారు.

ఫాస్ట్ ఫుడ్ తినేవారిలో

బీహార్లోని పాట్నాలో ప్రమాదకరమైన వైరల్ ఫీవర్ వేగంగా వ్యాపిస్తోంది. దీన్నే లామ్ ఫీవర్ అంటే ‘కుంటి జ్వరం’ అంటారు. ఈ జ్వరం ఎక్కువగా మోకాళ్లు, నడుముపై ప్రభావం చూపి యువతను బలి తీసుకుంటోంది. రోడ్డు పక్కన దొరికే జంక్ ఫుడ్ తినడం వల్ల వైరస్ వ్యాప్తి చెందుతోందని వైద్యులు చెబుతున్నారు. ‘కుంటి జ్వరం’ అంటే ఏమిటి, దాని లక్షణాలు, నివారణ చర్యలు ఏంటో తెలుసుకుందాం.

‘కుంటి జ్వరం’ లక్షణాలు చాలావరకు చికున్ గున్యాను పోలి ఉంటాయి, కానీ ఇది చికున్ గున్యాకు కాస్త భిన్నంగానే ఉంటుందని చెబుతున్నారు. ఈ జ్వరంతో బాధపడుతున్న రోగి నడవడానికి చాలా ఇబ్బంది పడతాడు. కాస్త వంగి నడవాల్సి వస్తోంది. అందుకే ఈ జ్వరానికి కుంటి ఫీవర్ అని పేరు పెట్టారు. ఈ జ్వరం చికున్ గున్యా మాదిరిగా ఎక్కువకాలం ఇబ్బంది పెడుతుంది. కోలుకున్న తరువాత కూడా 10 నుంచి 15 రోజుల వరకు రోగి సరిగా నడవలేడు.

కుంటి జ్వరం లక్షణాలు

డెంగ్యూ, చికున్ గున్యా జ్వరం లక్షణాలనే లాంగ్డా ఫీవర్ కూడా కలిగి ఉంటుంది. కుంటి జ్వరంలో రోగికి చీలమండలు, మోకాళ్లలో వాపు వస్తుంది. దీని వల్ల రోగి నడవడానికి చాలా ఇబ్బంది పడతాడు. దీంతోపాటు అధిక జ్వరం, మోకాళ్ల నొప్పి, నడుము నొప్పి, విపరీతమైన నీరసం ఉంటుంది. మామూలుగా నడవడం, రోజువారీ పనులు చేయడంలో ఇబ్బందులు పడుతుంటారు. జ్వరం కారణంగా కీళ్లలో విపరీతమైన నొప్పి రావడంతో రోగి వంగి నడవాల్సి వస్తుంది.

వర్షం కురిసిన తర్వాత దోమకాటు వల్ల ఏదో ఒక వైరస్ లేదా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతుందని, దీని వల్ల లాంగ్డా జ్వరం లక్షణాలు సోకినప్పుడు వారిలో కనిపిస్తాయని వైద్యులు అంచనా వేస్తున్నారు. అయితే, జ్వరం వ్యాప్తి గురించి మరింత పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం, ఈ జ్వరం వ్యాప్తికి ఒకకారణం బహిరంగంగా విక్రయించే ఆహారం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బయట జంక్ ఫుడ్ తినే చాలా మంది ఈ జ్వరం బారిన పడుతున్నట్టు వైద్యులు గుర్తించారు.

లాంగ్డా జ్వర నివారణ

లాంగ్డా జ్వరం దోమల వల్ల వస్తుంది. అటువంటి పరిస్థితిలో, దీనిని నివారించడానికి మొదట ఇంట్లో దోమతెరలను ఉపయోగించండి.

– ఇంటి నుంచి బయటకు వెళ్లినప్పుడు చేతులు, కాళ్లకు దోమ వికర్షక క్రీమ్ వాడాలి.

– ఇంటి చుట్టుపక్కల దోమలు వృద్ధి చెందకుండా నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.

మీకు కాలులో నొప్పి, వాపు వంటి ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

అన్నింటి కన్నా ముఖ్యంగా బయట దొరికే ఆహారాన్ని తినడం మానుకోండి.

Whats_app_banner

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024