Ileana: హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు డైరెక్ట‌ర్‌తో త‌మ‌న్నా, ఇలియానా రొమాంటిక్‌ మూవీ – షూటింగ్ పూర్త‌యినా రిలీజ్‌కు నోచుకోలేదు

Best Web Hosting Provider In India 2024

Ileana: త‌మ‌న్నా, ఇలియానా కాంబోలో 2006లో జాదు పేరుతో తెలుగులో ఓ రొమాంటిక్ థ్రిల్ల‌ర్ మూవీ తెర‌కెక్కింది. భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ ఇప్ప‌టికీ రిలీజ్ కాలేదు. ఈ సినిమాకు హ‌రి హ‌రి వీర‌మ‌ల్లు ఫేమ్ ఏఎమ్ జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డం గ‌మ‌నార్హం.

త‌మిళంలో కేడీ…తెలుగులో జాదు…

7 జీ బృందావ‌న కాల‌నీ హిట్ త‌ర్వాత త‌న కొడుకు ర‌వికృష్ణ హీరోగా ఓ భారీ బ‌డ్జెట్ బైలింగ్వ‌ల్ మూవీని స్టార్ ప్రొడ్యూస‌ర్ ఏఎమ్ ర‌త్నం అనౌన్స్‌చేశారు. ఈ మూవీకి త‌మిళంలో కేడీ, తెలుగులో జాదు అనే పేరును ఫిక్స్‌చేశారు. హీరోయిన్లుగా త‌మ‌న్నా, ఇలియానాల‌ను తీసుకున్నారు. కేడి మూవీతోనే త‌మ‌న్నా, ఇలియానా ఇద్ద‌రు కోలీవుడ్‌లోకి హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాకు ఏఎమ్ ర‌త్నం పెద్ద కొడుకు ఏఎమ్ జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. తెలుగు వెర్ష‌న్ ట్రైల‌ర్‌తో పాటు సాంగ్స్ రిలీజ్ చేశారు. పాట‌లు పెద్ద హిట్ట‌వ్వ‌డంతో సినిమాపై టాలీవుడ్‌లో మంచి బ‌జ్ ఏర్ప‌డింది.

రిలీజ్ కాలేదు…

తెలుగు, త‌మిళం రెండు భాష‌ల్లో ఒకేసారి షూటింగ్ పూర్తిచేశారు. తెలుగు వెర్ష‌న్‌కు సంబంధించి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఆల‌స్యం కావ‌డంతో ముందుగా త‌మిళంలో ఈ మూవీని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశారు. త‌మిళంలో ఈ మూవీ డిజాస్ట‌ర్ కావ‌డంతో తెలుగు వెర్ష‌న్ జాదు రిలీజ్‌కు నోచుకోలేదు. జాదు సినిమాల‌కు సంబంధించి ఇప్ప‌టికీ పాట‌లు, ట్రైల‌ర్ యూట్యూబ్‌లో క‌నిపిస్తాయి.

త‌మ‌న్నా నెగెటివ్ రోల్‌…

జాదు మూవీకి యువ‌న్ శంక‌ర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలో త‌మ‌న్నా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించింది. 2006లోనే దాదాపు ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో ఏఎమ్ ర‌త్నం ఈ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమా ఆయ‌న‌కు భారీగా న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది.

హ‌రి హ‌ర‌వీర‌మ‌ల్లు…

జాదుతో పాటు నీకు మ‌న‌సు నాకు తెలుసు, ఆక్సిజ‌న్, రూల్స్ రంజ‌న్‌ సినిమాల‌కు ఏఎమ్ జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇవేవీ అత‌డికి విజ‌యాల్ని తెచ్చిపెట్ట‌లేక‌పోయాయి. ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు సినిమా చేస్తోన్నాడు జ్యోతికృష్ణ. తొలుత ఈ మూవీకి క్రిష్ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల్ని చేప‌ట్టాడు. స‌గం షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత క్రిష్ త‌ప్పుకోవ‌డంతో అత‌డి స్థానంలో జ్యోతికృష్ణ డైరెక్ష‌న్ బాధ్య‌త‌ల్ని తీసుకున్నాడు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న‌ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు వ‌చ్చే ఏడాది మార్చిలో రిలీజ్ కాబోతోంది.

మ‌రోవైపు బాలీవుడ్‌తో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో హీరోయిన్‌గా, స్పెష‌ల్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంది త‌మ‌న్నా. ఇలియానా మాత్రం సినిమాలు చేసి చాలా కాల‌మే అయ్యింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024