Exercises for Liver: కాలేయంలో పేరుకున్న కొవ్వు కరిగించాలంటే ఈ పనులు చేయండి

Best Web Hosting Provider In India 2024

ఫ్యాటీ లివర్ డిసీజ్ సమస్య ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తోంది. ముఖ్యంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కేసులు పెరుగుతున్నాయి. దీన్ని ప్రారంభ దశలోనే గుర్తిస్తే సులభంగా తగ్గించుకోవచ్చు. ఈ సమస్య ఉన్నవాళ్లు వారానికి కనీసం 150 నిమిషాల నుండి 300 నిమిషాల వ్యాయామం చేయడం వల్ల కాలేయంలో పేరుకున్న కొవ్వు తగ్గిపోతుంది. ఈ సమస్యను దూరం చేయాలంటే ఏం చేయాలో తెల్సుకోండి.

అరగంట వ్యాయామం

కనీసం అరగంట వ్యాయామాన్ని రోజూవారీ చేయడం వల్ల కాలేయ పనితీరు మెరుగవుతుంది. భవిష్యత్తులోనూ కాలేయ పనితీరుకు సంబంధించిన సమస్యలు ఉండవు. దీని కోసం జిమ్ కు మాత్రమే వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ వ్యాయామాలు చేయడం ద్వారా, ఫలితాలు కనిపిస్తాయి. అవేంటో చూద్దాం.

స్పీడ్ వాకింగ్

అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం ఇది. ఇది మీ పాదాలు, కీళ్ల నొప్పులు రాకుండా చూడటమే కాకుండా  కాలేయ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. రోజూ వేగంగా నడవడం వల్ల లివర్ ఫ్యాట్ తగ్గుతుంది. కనీసం 30 నిమిషాల స్పీడ్ వాకింగ్ అనేది తప్పక అవసరం.

హైకింగ్

హైకింగ్ ను దినచర్యలో చేర్చుకుంటే ఇది కాలేయ పనితీరును పెంచడానికి సహాయపడుతుంది. హైకింగ్ కోసం పర్వతానికి వెళ్లాల్సిన అవసరం లేదు, ప్రతిరోజూ కాస్త ఏటవాలుగా ఉన్న ప్రదేశాన్ని ఎక్కినట్లు చేయడం ప్రాక్టీస్ చేస్తే చాలు.

స్ట్రెంత్ ఎక్సర్‌సైజులు

మీ దినచర్యలో స్ట్రెంత్ ఎక్సర్‌సైజులను చేర్చుకోండి. పుషప్స్, స్క్వాట్స్ వంటి వ్యాయామాలు మీ శరీర బలాన్ని, శక్తిని పెంచుతాయి. అంతేకాక ఈ వ్యాయామాలు కాలేయ పనితీరును మెరుగుపరచడంలో సాయపడతాయని పరిశోధనలో తేలింది.

సైక్లింగ్

సైక్లింగ్‌ను దినచర్యలో అరగంట సేపు చేర్చడం ద్వారా ఫ్యాటీ లివర్ వ్యాధిని తగ్గించుకోవచ్చు. ఇంట్లోనే సైక్లింగ్ చేయడం కన్నా ఒక సైకిల్ తెచ్చుకుని ప్రకృతిలో ఉండే ప్రయత్నం చేయండి. దీంతో మానసికంగానూ లాభాలుంటాయి. 

Whats_app_banner

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024