Nindu Noorella Saavasam: అరుంధతి ఆత్మతో ఘోరా పూజలు- భర్తను చంపేయమన్న మనోహరి- రంగంలోకి యముడు- భాగీకి డౌట్- ఏడ్చిన అంజు

Best Web Hosting Provider In India 2024

Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం టుడే ఎపిసోడ్‌ (NNS 18th October Episode)లో అంజు పుట్టిన రోజుకి భాగీ ఇచ్చిన గిప్ట్‌ చూడగానే అందరూ షాక్ అవుతారు. దాంతో అంజు తన తల్లిని గుర్తు చేసుకుంటుంది. మనోహరి మాత్రం దాన్ని బంధించాడా లేదా? అనుకుటుంది. అంజు గిఫ్ట్‌ తీసుకుని చూసి ఏడుస్తుంది.

గుప్తా వెతుకులాట

అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటే ఏమైందని అడుగుతుంది భాగీ. డాడ్‌ అచ్చం మామ్‌ చేసిన బొమ్మలాగే ఉందని అంటారు పిల్లలు. ఆ బొమ్మ ఎవరిచ్చారని భాగీని అమర్ అడుగుతాడు. అదిగో అక్కడే అని చూపించగానే అక్కడ ఎవ్వరూ కనిపించరు. కంగారుగా ఇల్లంతా వెతుకుతుంది భాగీ. మరోవైపు అరుంధతి కోసం గుప్తా కూడా వెతుకుతుంటాడు.

ఘోరా బయటకు వచ్చి ఆత్మను బంధించానని మనోహరికి చూపించి వెళ్తాడు. మనోహరి హ్యాపీగా ఫీలవుతుంది. ఈ బొమ్మ అచ్చం అమ్మ చేసినట్టే ఉంది అని బాధపడుతున్న అంజుని చూసి అంజు ప్రతి బర్తుడేకు అమ్మ ఇలా స్పెషల్ గిఫ్ట్‌ ఇచ్చేది అంటాడు ఆకాష్. లాస్ట్‌ ఇయర్‌ అంజుకు హ్యపీ ప్యారెట్‌ నచ్చిందని నెక్ట్స్ ఇయర్‌ ఇస్తా అంది అంటాడు ఆనంద్​.

బర్త్‌డే పూట ఏడుస్తారా

మీ అమ్మ లేకపోయినా మాట నిలబెట్టుకుంది అంటాడు అమర్​. నాకు తెలుసు మా అమ్మే నాకోసం ఈ గిఫ్ట్‌ పంపించినట్టు ఉంది. డాడ్‌ నిజం చెప్పండి డాడ్‌ మమ్మీ కదా వచ్చింది. నిజం చెప్పండి డాడ్‌ మమ్మే కదా ఈ బొమ్మ నాకు పంపించింది అంటుంది అంజు. అరే బర్త్‌డే పూట ఎవరైనా ఏడుస్తారా? చెప్పు.. చూడు నీకు ఎన్ని గిఫ్టులు వచ్చాయే చూడు అంటూ అంజుని అక్కడనుంచి తీసుకుని వెళ్తుంది కరుణ.

నాన్నా.. రాథోడ్‌ వచ్చిన వాళ్లకు భోజనాలు అరేంజ్‌ చేయండి. మిస్సమ్మ ఇంకొకసారి ఆ పక్కింటి అక్క వస్తే నాకు పరిచయం చేయ్‌.. అంటాడు అమర్​. తను ఇంక కనిపించదులే అమర్‌ అంటుంది మనోహరి. అంత కచ్చితంగా ఎలా చెప్తున్నారు మనోహరి గారు. ఆవిడ మీకు కూడ తెలుసా..? అని అడుగుతుంది భాగీ. అంటే గిప్ట్‌ ఇచ్చి వెళ్లారు అంటే మళ్లీ రారని అనుకున్నాను అంటుంది మనోహరి.

అక్కను పరిచయం చేస్తాను

ఏదో పని ఉందని వెళ్లారు. మళ్లీ వస్తారు అంటున్న భాగీతో రాలేని పరిస్థితుల్లో ఉంటే.. అంటుంది మనోహరి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అక్క తిరిగి వస్తారు. వస్తారనే నమ్మకం నాకు ఉంది అంటుంది భాగీ. పిచ్చిదానా అరుంధతిని పర్మినెంట్‌‌గా పంపిచేశాను అని మనసులో అనుకుంటుంది మనోహరి. సరేలేండి అక్కను కలిసిన వెంటనే తప్పకుండా పరిచయం చేస్తాను అంటుంది భాగీ.

జీ సార్‌ ఏదో అప్‌సెట్‌‌లో ఉన్నారు. నేను తర్వాత వచ్చి కలుస్తాను అ చెప్పి వెళ్లిపోతాడు రణ్​వీర్​. అరుంధతి చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఆలోచిస్తుంది భాగీ. గుప్త కంగారుగా ఆరు కోసం ఇళ్లంతా వెతుకుతాడు. ఎక్కడా కనిపించదు. మరోవైపు ఆరు ఆత్మను తీసుకెళ్లిన ఘోరా పూజ చేస్తుంటాడు. సీసాలో బంధిగా ఉన్న ఆరు ఆత్మ నన్ను వదిలేయండి అని ఏడుస్తుంది. అప్పుడే మనోహరి వస్తుంది.

మనం గెలిచాం మనోహరి.. మనం గెలిచాం.. ఇప్పుడు నీకేం కావాలో చెప్పు.. చేస్తాను.. అంటాడు ఘోరా. ముందు ఆ రణవీర్‌ను చంపేయ్‌ ఘోరా.. అంటుంది మనోహరి. ఆలోచించుకుని చెప్పు మనోహరి. ఏం చెప్పినా ఏం చేసినా అతను నీ మెడలో తాళి కట్టిన భర్త అంటాడు ఘోరా. ఆ భర్త ఆ బతుకు వదిలేసుకుని వచ్చినదాన్ని నేను. ఆ రణవీర్‌ ప్రాణాలతో ఉన్నని రోజులు నేను ప్రశాంతంగా ఉండలేను అంటుంది మనోహరి.

రంగంలోకి యముడు

సరే నీకు మాటిచ్చినట్టు నీకున్న రెండు కోరికలు తీరుస్తాను. ఇవాళ రాత్రికి పూజ చేస్తాను. రేపు తెల్లవారగానే నీ సమస్యలు తీరిపోతాయి అంటాడు ఘోరా. అదెంత.. దాని బతుకెంత. దేవుళ్లను పూజిస్తూనే ఉంది. ఈసారి ఏ దేవుడొచ్చి కాపాడతాడో నేను చూస్తాను అంటూ హ్యాపీగా ఫీలవుతుంది మనోహరి. అరుంధతి కోసం గుప్తా వెతికి ఘోరా.. ఆరును బంధించాడేమోనని అనుకుంటుండగానే యముడు వస్తాడు.

అరుంధతి కనిపించడం లేదని గుప్త చెప్పగానే యముడు ఆ బాలికను ఘోరా బంధించాడని చెప్తాడు. ఆ బాలిక ఆత్మను ఘోరా తన ఆధీనంలోకి తెచ్చుకోకముందే ఎలాగైనా విడిపించాలని అంటాడు యముడు. అక్కడితే నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ముగిసింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024