Tirumala : తగ్గిన వర్షాలు.. భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ అధికారులు

Best Web Hosting Provider In India 2024

శ్రీవారి భ‌క్తుల‌కు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శుభ‌వార్త చెప్పారు. స్వామివారి మెట్టు మార్గాన్ని తిరిగి తెరిచినట్టు వెల్లడించారు. నడ‌క‌దారిన వచ్చి భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకోవ‌చ్చ‌ని స్పష్టం చేశారు. వ‌ర్షాలు త‌గ్గ‌డంతో శుక్రవారం శ్రీవారి మెట్టు మార్గాన్ని తెరిచారు టీటీడీ అధికారులు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో.. మెట్టు మార్గాన్ని మూసేశారు.

తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం 26 కంపార్ట్‌మెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నారు. టోకెన్‌లేని భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నానికి 12 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. గురువారం స్వామివారిని 58,637 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.69 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్ల‌డించారు.

2025 జనవరి నెల కోటాకు సంబంధించిన టికెట్లపై టీటీడీ ప్రకటన విడుదల చేసింది. టికెట్లు విడుదల చేసే తేదీలను ప్రకటించింది. అక్టోబరు 19వ తేదీన (రేపు) ఉదయం 10 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు తెలిపింది. టీటీడీ ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవాలని సూచించింది.

22న ఆర్జిత సేవా టికెట్ల విడుదల : కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను అక్టోబరు 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన జనవరి నెల కోటాను అక్టోబరు 22న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

జనవరి నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబరు 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన జనవరి నెల ఆన్ లైన్ కోటాను అక్టోబరు 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా జనవరి నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను అక్టోబరు 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

జనవరి నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబరు 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమల, తిరుపతిల‌లో జనవరి నెల గదుల కోటాను అక్టోబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని అధికారులు సూచించారు.

Whats_app_banner

టాపిక్

TirumalaTtdAndhra Pradesh NewsAp Rains
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024