Johnny Master: జానీ మాస్ట‌ర్‌పై ఇండ‌స్ట్రీలో కుట్ర -నేష‌న‌ల్ అవార్డు ర‌ద్దు చేయ‌డం క‌రెక్ట్ కాదు-అనీ మాస్ట‌ర్ కామెంట్స్‌

Best Web Hosting Provider In India 2024


లేడీ కొరియోగ్రాఫ‌ర్‌పై లైంగిక దాడికి పాల్ప‌డ్డాడ‌నే ఆరోప‌ణ‌ల‌తో టాలీవుడ్ డ్యాన్స్ మాస్ట‌ర్ జానీ అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. త‌న‌పై అత్యాచారం చేయ‌డ‌మే కాకుండా పెళ్లి చేసుకోవాల‌ని జానీ మాస్ట‌ర్ బెదిరింపుల‌కు పాల్ప‌డిన‌ట్లు జానీ మాస్ట‌ర్‌పై లేడీ కొరియోగ్రాఫ్ కేసు పెట్టింది. ఈ కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్ట‌ర్ ప్ర‌స్తుతం చంచ‌ల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. పోక్సో చ‌ట్టం క్రింద జానీ మాస్ట‌ర్‌పై కేసు న‌మోదు కావ‌డంతో అత‌డికి బెయిల్ మంజూరు చేయ‌డానికి కోర్టు నిరాక‌రించింది.

అనీ మాస్ట‌ర్ మ‌ద్ద‌తు…

కాగా లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జానీ మాస్ట‌ర్‌కు టాలీవుడ్ కొరియోగ్రాఫ‌ర్ అనీ మాస్ట‌ర్ మ‌ద్ధ‌తుగా నిలిచింది. జానీ మాస్ట‌ర్ త‌ప్పు చేసిన‌ట్లు నిరూప‌ణ కాకుండానే అత‌డి నేష‌న‌ల్ అవార్డును ర‌ద్దు చేయ‌డం బాధ‌ను క‌లిగించింద‌ని అన్న‌ది.

కేసు పెట్ట‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది…

ఆరు నెల‌ల క్రితం వ‌ర‌కు జానీ మాస్ట‌ర్ గ్రేట్ అంటూ చెప్పిన లేడీ కొరియోగ్రాఫ‌ర్ ఇప్పుడు హ‌ఠాత్తుగా అత‌డిపై కేసు పెట్ట‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింద‌ని అనీ మాస్ట‌ర్ అన్న‌ది. జానీ మాస్ట‌ర్ ద‌గ్గ‌ర అసిస్టెంట్‌గా ప‌నిచేసేట‌ప్పుడు ఆ అమ్మాయి చాలా హ్యాపీగా క‌నిపించింద‌ని అనీ మాస్ట‌ర్ చెప్పింది.

లైంగిక ఆరోప‌ణ‌లు అన్న‌ది సెన్సిటివ్ ఈష్యూ కావ‌డంతో డ్యాన్స్ అసోసియేష‌న్ నుంచి ఎవ‌రూ దీని గురించి మాట్లాడ‌టానికి ఇన్నాళ్లు ముందుకురాలేద‌ని అనీ మాస్ట‌ర్ చెప్పింది. జానీ మాస్ట‌ర్‌ను కావాల‌నే ఈ కేసులో కొంద‌రు ఇరికించార‌ని, ఇండ‌స్ట్రీలో అత‌డిపై కుట్ర జ‌రుగుతోంద‌ని వ‌స్తోన్న వార్త‌ల గురించి త‌న‌కు తెలియ‌ద‌ని అనీ మాస్ట‌ర్ అన్న‌ది. అనీ మాస్ట‌ర్ అన్న‌ది.

అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్‌గా…

“జానీ మాస్ట‌ర్ నాకు గురువు. ర‌చ్చ సినిమా టైమ్‌లో ఆయ‌న వ‌ద్ద నేను రెండేళ్లు అసిస్టెంట్ కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశాను. ఆయ‌న వ‌ల్ల ఏ రోజు నేను ఇబ్బందులు ప‌డ‌లేదు. ఇండ‌స్ట్రీలో నాకు ఎలాంటి కాస్టింగ్ కౌచ్ స‌మ‌స్య‌లు ఎదుర‌వ్వ‌లేదు. ఇండ‌స్ట్రీలో వేధింపులు ఉన్నాయ‌న్న‌ది పూర్తిగా అబ‌ద్ధం. జానీ మాస్ట‌ర్ త‌ప్పు చేశాడ‌ని తేలితే శిక్ష ప‌డాలి. ఒక‌వేళ అత‌డు త‌ప్పు చేయ‌లేద‌ని తేలితే ఏం చేస్తారు”అని అనీ మాస్ట‌ర్ అన్న‌ది.

జానీ మాస్ట‌ర్‌…శేఖ‌ర్ మాస్ట‌ర్‌…

“టాలీవుడ్‌లోని డ్యాన్స‌ర్‌కు ఏమైనా ఇబ్బందులు వ‌స్తే తొలుత రియాక్ట్ అయ్యేది జానీ మాస్ట‌ర్‌, శేఖ‌ర్ మాస్ట‌ర్ అని అనీ అన్న‌ది. జానీ మాస్ట‌ర్ వ‌ల్లే ఆ లేడీ కొరియోగ్రాఫ‌ర్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. ఆమెకు డ్యాన్స‌ర్స్ అసోసియేష‌న్ మెంబ‌ర్‌షిప్ ఇప్పించ‌మ‌ని జానీ మాస్ట‌ర్ ఫైట్ చేశాడు. రూల్స్‌, రెగ్యులేష‌న్స్ ఆ అమ్మాయి ఫాలో కాక‌పోవ‌డంతో మెంబ‌ర్‌షిప్ రాలేదు. ఆ అమ్మాయికి మెంబ‌ర్‌షిప్ ఇవ్వ‌కుండా జానీ మాస్ట‌ర్ అడ్డుకున్నాడ‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. జానీ మాస్ట‌ర్‌పై ఆరోప‌ణ‌లు నిరూప‌ణ కాకుండా అత‌డి జాతీయ అవార్డును ర‌ద్దు చేయ‌డం క‌రెక్ట్ కాదు” అని అనీ మాస్ట‌ర్ అన్న‌ది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024