OTT Sci-Fi Web Series: ఓటీటీలోకి తెలుగులోనూ వస్తున్న టబు నటించిన సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్.. మొత్తంగా ఏడు భాషల్లో..

Best Web Hosting Provider In India 2024

OTT Sci-Fi Web Series: టబు నటించిన సైన్స్ ఫిక్షన్ వెబ్ సిరీస్ తెలుగులోనూ ఓటీటీలోకి రానుంది. ఈ వెబ్ సిరీస్ పేరు డ్యూన్ ప్రాఫెసీ. వచ్చే నెలలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుండగా.. శుక్రవారం (అక్టోబర్ 18) ట్రైలర్ రిలీజ్ చేశారు. సూపర్ హిట్ డ్యూన్ ఫ్రాంఛైజీ నుంచి వస్తున్న సిరీస్ కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

డ్యూన్: ప్రాఫెసీ ఓటీటీ రిలీజ్ డేట్

డ్యూన్: ప్రాఫెసీ వెబ్ సిరీస్ నవంబర్ 18 నుంచి జియో సినిమా ప్రీమియంలో స్ట్రీమింగ్ కానుంది. ఆ రోజు ఉదయం 6.30 గంటలకు తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్ ప్రారంభం అవుతుంది. ప్రతి సోమవారం కొత్త ఎపిసోడ్ వస్తుంది. ఇలా మొత్తంగా ఆరు ఎపిసోడ్ల పాటు ఈ సిరీస్ సాగనుంది. ట్రైలర్ తోనే మేకర్స్ దీనిపై అంచనాలు పెంచేశారు.

ఫ్రాంక్ హెర్బర్ట్ క్రియేట్ చేసిన యూనివర్స్ లో భాగంగా ఈ డ్యూన్: ప్రాఫెసీ రూపొందింది. డ్యూన్ యూనివర్స్ ప్రధాన పాత్ర అయిన పాల్ అట్రీడెస్ కంటే 10 వేల సంవత్సరాల కిందట జరిగిన స్టోరీగా ఈ డ్యూన్: ప్రాఫెసీని చూపించబోతున్నారు. ఇద్దరు హర్కోనెన్ సిస్టర్స్ మానవాళికి ముప్పుగా పరిణమించిన వారితో ఎలా పోరాడారన్నది ఈ వెబ్ సిరీస్ లో చూడొచ్చు. సిస్టర్‌హుడ్ ఆఫ్ డ్యూన్ నవల ఆధారంగా ఈ డ్యూన్: ప్రాఫెసీ వెబ్ సిరీస్ రూపొందించారు.

టబుతోపాటు ఈ సిరీస్ లో ఎమిలీ వాట్సన్, ఒలీవియా విలియమ్స్, ట్రావిస్ ఫిమ్మెల్, జోడీ మే, మార్క్ స్ట్రాంగ్ లాంటి వాళ్లు నటించారు. తాజాగా రిలీజైన ట్రైలర్ లో రెండు చోట్ల మాత్రమే ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది టబు. అయితే ఈ ట్రైలర్ మాత్రం ఆసక్తికరంగా సాగింది.

డ్యూన్: ప్రాఫెసీ ట్రైలర్

ఈ డ్యూన్: ప్రాఫెసీ ట్రైలర్ ప్రాధాన పాత్రలైన వాల్యా హర్కోనెన్ (ఎమిలీ వాట్సన్), తులా హర్కోనెన్ (ఒలీవియా విలియమ్స్)ల చుట్టే తిరిగింది. ఇందులో అట్రీడెస్, హర్కోనెన్ మధ్య యుద్ధాన్ని మనం చూడొచ్చు. ఈ వెబ్ సిరీస్ లో సిస్టర్ ఫ్రాన్సెస్కా పాత్రలో టబు నటించింది. అయితే ఈ ట్రైలర్ లో ఆమెను రెండు చోట్ల తప్ప పెద్దగా చూపించలేదు.

డ్యూన్ అనేది ఓ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ మీడియా ఫ్రాంఛైజీ. 1965లో డ్యూన్ పేరిట ఫ్రాంక్ హెర్బర్ట్ రాసిన నవల ఆధారంగా దీనిని క్రియేట్ చేశారు. ఇప్పటికే ఈ ఫ్రాంఛైజీ నుంచి మూడు సినిమాలు వచ్చాయి. 1984లో తొలిసారి డ్యూన్ రాగా.. తర్వాత 2021లో మరోసారి డ్యూన్, 2024లో డ్యూన్: పార్ట్ 2 మూవీస్ వచ్చాయి. ఇప్పుడు డ్యూన్: ప్రాఫెసీ పేరుతో కొత్తగా వెబ్ సిరీస్ రాబోతోంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024