Gladiator 2 Release Date: 2500 కోట్ల బ‌డ్జెట్‌తో గ్లాడియేట‌ర్ 2 – రిలీజ్ ఎప్పుడంటే!

Best Web Hosting Provider In India 2024

Gladiator 2 Release Date: హాలీవుడ్ హిస్టారిక‌ల్ యాక్ష‌న్ మూవీ గ్లాడియేట‌ర్ 2 రిలీజ్‌డేట్ ఫిక్స‌యింది. నవంబ‌ర్ 15న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇండియాలో తెలుగుతో పాటు ఇంగ్లీష్‌, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో గ్లాడియేట‌ర్ 2 విడుద‌ల కాబోతోంది. 4డీఎక్స్‌తో పాటు ఐమాక్స్ వెర్ష‌న్‌లో ఈ భారీ బ‌డ్జెట్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

బ‌డ్జెట్ ఎంతంటే?

2000 ఏడాదిలో వ‌చ్చిన గ్లాడియేట‌ర్ మూవీకి సీక్వెల్‌గా గ్లాడియేట‌ర్ 2 తెర‌కెక్కుతోంది. 310 మిలియ‌న్ డాల‌ర్ల‌ (ఇండియ‌న్ క‌రెన్సీలో 2500 వంద‌ల కోట్లు) బ‌డ్జెట్‌తో గ్లాడియేట‌ర్ 2 మూవీని డైరెక్ట‌ర్ రిడ్లీ స్కాట్ తెర‌కెక్కిస్తోన్నాడు. ఈ సినిమాలో పాల్ మెస్క‌ల్‌, పెడ్రో పాస్క‌ల్‌, డేంజిల్ వాషింగ్ట‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

స్ట‌న్నింగ్ విజువ‌ల్స్‌…

గ్లాడియేట‌ర్ 2 ట్రైల‌ర్‌లోని విజువ‌ల్స్‌,యుద్ద స‌న్నివేశాలు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. త‌న‌ను బంధీని చేసిన రోమ్ చ‌క్ర‌వ‌ర్తుల‌పై మాక్రిస‌న్‌తో క‌లిసి లూసియ‌స్ ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడ‌న్న‌ది ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు రిడ్లీ స్కాట్ చూపించాడు. ఓ వైపు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చూపిస్తేనే అధికారం కోసం రోమ్ సామ్రాజ్యంలో జ‌రిగిన కుట్ర‌లు, కుతంత్రాలు, రోమ్ చ‌క్ర‌వ‌ర్తిపై లూసియ‌స్‌ ప్ర‌తీకారాన్ని చూపించారు.

యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను లూసియ‌స్ ప్రేమ‌క‌థ అంత‌ర్లీనంగా క‌థ‌లో చోటిచ్చిన‌ట్లుగా లిప్‌లాక్ సీన్ చూస్తుంటే తెలుస్తోంది. గ్లాడియేట‌ర్ 2లో జోసెఫ్ క్విన్ (స్ట్రేంజర్ థింగ్స్), ఫ్రెడ్ హెచింగర్ (ది వైట్ లోటస్), లియర్ రాజ్ (ఫౌడా), డెరెక్ జాకోబి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.

ఐదు ఆస్కార్ అవార్డ్స్‌…

2000 ఏడాదిలో రిలీజైన గ్లాడియేట‌ర్ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఐదు ఆస్కార్ అవార్డుల‌ను గెలుచుకుంది. ఇర‌వై నాలుగు ఏళ్ల త‌ర్వాత ఈ క‌ల్ట్ క్లాసిక్‌ మూవీకి సీక్వెల్ రాబోతుండ‌టంతో గ్లాడియేట‌ర్ 2పై సినీ ల‌వ‌ర్స్‌లో ఆస‌క్తి ఏర్ప‌డింది. గ్లాడియేట‌ర్ వ‌న్‌కు కొన‌సాగింపుగానే ఈ సీక్వెల్ క‌థ ఉంటుంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. గ్లాడియేట‌ర్ 2కు కొన‌సాగింపుగా గ్లాడియేట‌ర్ 3ని కూడా తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు డైరెక్ట‌ర్ రిడ్లీ స్కాట్ ప్ర‌క‌టించాడు. గ్లాడియేట‌ర్‌కు సీక్వెల్ తెర‌కెక్కించాల‌ని 2001 నుంచి రిడ్లీ స్కాట్ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024