Chatpata Snacks: చట్‌పటా మసాలా కాజూ, మసాలా ఫూల్ మఖానా ఇలా చేసేయండి

Best Web Hosting Provider In India 2024

బజార్లో దొరికే మసాలా కాజూ అంటే చాలా మందికి ఇష్టమే. తినడానికి కాస్త పుల్లగా, ఘాటుగా, కారంగా ఉండే వీటిని ఎన్నయినా తినేయొచ్చు. కానీ వాటి ధర కాస్త ఎక్కువే అనిపిస్తుంది. అయితే కాస్త ఓపిక ఉంటే ఇంట్లోనే వాటిని తయారు చేసి పెట్టుకోవచ్చు. అలాగే ఆరోగ్యం కోసం తినే ఫూల్ మఖానా కూడా కాస్త క్రిస్పీగా, కారంగా ఉండేలా చేసుకోవచ్చు. ఇవి రెండు పిల్లలకు మంచి హెల్దీ స్నాక్స్. వాటిని ఎలా తయారు చేయాలో చూసేయండి.

మసాలా కాజూ తయారీకి కావాల్సిన పదార్థాలు:

2 కప్పుల కాజూ / జీడిపప్పు

3 చెంచాల నెయ్యి లేదా బటర్

1 చెంచా మిరియాల పొడి

సగం చెంచా ఆమ్‌చూర్ పొడి

1 టీస్పూన్ ఉప్పు

సగం చెంచా జీలకర్ర పొడి

సగం టీస్పూన్ నల్ల ఉప్పు

మసాలా కాజూ తయారీ విధానం:

1. ముందుగా నెయ్యి, కాజూ తప్ప మిగతా పదార్థాలన్నీ ఒక గిన్నెలో వేసుకుని బాగా కలుపుకోవాలి.

2. ఇప్పుడు ఒక ప్యాన్ లో నెయ్యి లేదా బటర్ వేసుకోవాలి. బటర్ వాడితే అన్ సాల్టెడ్ రకం వాడాలి. అది కరిగాక కాజూ వేసుకోవాలి. బంగారు వర్ణంలోకి మారేదాకా వాటిని వేయించుకోవాలి.

3. ఇప్పుడు కాజూను వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న మసాలా పొడిని వీటిమీద వేసుకుని బాగా కలుపుకోవాలి. అంతే మసాలా కాజూ రెడీ.

మసాలా ఫూల్ మఖానా తయారీకి కావాల్సిన పదార్థాలు:

1 చెంచా నెయ్యి లేదా బటర్

2 కప్పుల ఫూల్ మఖానా

సగం చెంచా కారం

పావు చెంచా మిరియాల పొడి

పావు చెంచా జీలకర్ర పొడి

సగం చెంచా చాట్ మసాలా

పావు చెంచా ఉప్పు

మసాలా ఫూల్ మఖానా తయారీ విధానం:

1. ముందుగా పెద్ద కడాయిలో నెయ్యి లేదా బటర్ వేసుకుని వేడెక్కాక ఫూల్ మఖానా వేసుకోవాలి.

2. అవి కరకరలాడేదాకా కనీసం అయిదు నిమిషాలు వేయించాలి.

3. ఇప్పుడు మఖానాను బయటకు తీసుకోవాలి. అదే ప్యాన్ లో మరికొంత నెయ్యి వేసుకుని కొద్దిగా వేడెక్కాక కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి.

4. వాటిని మాడిపోకుండా చూసుకోవాలి. వెంటనే అందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఫూల్ మఖానా వేసుకుని బాగా కలియబెట్టుకుంటే చాలు. మసాలా మఖానా రెడీ అయినట్లే.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024