OTT Tamil Web Series: తెలుగులో ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ తమిళ వెబ్ సిరీస్.. ఐఎండీబీలో అదిరిపోయే రేటింగ్

Best Web Hosting Provider In India 2024

OTT Tamil Web Series: తమిళ వెబ్ సిరీస్ ఒకటి త్వరలో తెలుగులోనూ వస్తోంది. ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్ట్ వరకు ఏకంగా 100 ఎపిసోడ్ల పాటు ఈసాగిన ఈ సిరీస్ ను తెలుగులోనూ అందుబాటులోకి తీసుకురానున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా శుక్రవారం (అక్టోబర్ 18) వెల్లడించింది. ఈ సిరీస్ కు ఐఎండీబీలో ఏకంగా 8.5 రేటింగ్ ఉండటం విశేషం.

హార్ట్ బీట్ తెలుగు ఓటీటీ స్ట్రీమింగ్

ఈ తమిళ వెబ్ సిరీస్ పేరు హార్ట్ బీట్. దీనికి రిథమ్ ఆఫ్ లైఫ్ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ద ఇయర్ వెబ్ సిరీస్ అంటూ దీనిని త్వరలో తెలుగులోకి తీసుకొస్తున్నట్లు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వెల్లడించింది.

“హార్ట్ బీట్ ఇప్పుడు తెలుగులోనూ కొట్టుకోనుంది. తెలుగులో హార్ట్ బీట్ కమింగ్ సూన్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్” అనే క్యాప్షన్ తో సదరు ఓటీటీ ఈ విషయం తెలిపింది. హాట్‌స్టార్ స్పెషల్స్ గా తమిళంలో ఈ వెబ్ సిరీస్ రూపొందగా.. అక్కడి ప్రేక్షకులు బాగా ఆదరించారు. మెడికల్ రొమాంటిక్ డ్రామాగా ఈ సిరీస్ ను తెరకెక్కించారు.

ఏంటీ హార్ట్ బీట్ వెబ్ సిరీస్?

హార్ట్ బీట్ వెబ్ సిరీస్ మొదట ఈ ఏడాది మార్చి 8న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. ఆర్కే అనే ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రెసిడెంట్స్, ఇంటర్న్స్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాల చుట్టూ తిరిగే కథే ఈ హార్ట్ బీట్ సిరీస్. దీనిని దీపక్ సుందరరాజన్ డైరెక్ట్ చేశాడు. ఈ సిరీస్ లో దీపా బాలు, అనుమోల్, చారుకుశ్, అమిత్ భార్గవ్ లాంటి వాళ్లు నటించారు.

అమెరికాలో వచ్చిన న్యూ ఆమ్‌స్టర్‌‌డ్యామ్, గ్రేస్ అనాటమీలను ఈ హార్ట్ బీట్ పోలి ఉంటుంది. మార్చి నుంచి ఆగస్ట్ వరకు 100 ఎపిసోడ్ల పాటు ఈ సిరీస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. దీనికి తమిళ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో తెలుగులోనూ తీసుకురావాలని హాట్‌స్టార్ నిర్ణయించింది. త్వరలోనేఅని చెప్పింది తప్ప ఈ హార్ట్ బీట్ తెలుగులో ఎప్పుడు వస్తుందన్నది మాత్రం ఇంకా వెల్లడించలేదు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024