Prabhas Birthday: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. బర్త్‌డే రోజు ఏకంగా ఆరు సినిమాలు రీరిలీజ్

Best Web Hosting Provider In India 2024

Prabhas Birthday: ప్రభాస్ తన బర్త్ డేను అక్టోబర్ 23న జరుపుకోనున్నాడు. ఈ మధ్యకాలంలో ఈ హీరో బర్త్ డే ఉన్నా అతనికి సంబంధించిన హిట్ మూవీస్ రీరిలీజ్ చేస్తున్నారు. అయితే రెబల్ స్టార్ మాత్రం తన ఫ్యాన్స్ కు ఈసారి ఎవరూ ఇవ్వని గిఫ్ట్ ఇస్తున్నాడు. ఎందుకంటే ప్రభాస్ నటించిన ఆరు సినిమాలు అతని బర్త్ డే నాడు థియేటర్లలో రీరిలీజ్ కానున్నాయి.

ప్రభాస్ బర్త్‌డే స్పెషల్

రెబల్ స్టార్ ప్రభాస్ అక్టోబర్ 23న తన 45వ పుట్టిన రోజు జరుపుకోబోతున్నాడు. హ్యాట్రిక్ ఫ్లాపుల తర్వాత సలార్, కల్కి 2898 ఏడీ రూపంలో రెండు వరుస హిట్స్ ను అతడు అందుకోవడంతో ఈసారి మరింత ఉత్సాహంగా అతని ఫ్యాన్స్ ఈ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. వాళ్ల ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి ప్రభాస్ గతంలో నటించిన ఆరు సినిమాలు థియేటర్లలో రీరిలీజ్ కాబోతున్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం.

సలార్ పార్ట్ 1

సలార్ పార్ట్ 1 గతేడాది థియేటర్లలో రిలీజై ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన మూవీ. ఈ సినిమా ద్వారానే రెబల్ స్టార్ మళ్లీ గాడిలో పడ్డాడు. దీంతో ఈసారి పుట్టిన రోజున ఈ మూవీని రీరిలీజ్ చేస్తున్నారు.

ఈశ్వర్

ఈశ్వర్ మూవీ ద్వారానే ప్రభాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ వచ్చి రెండు దశాబ్దాలకుపైనే అయింది. శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కూడా ప్రభాస్ బర్త్ డే సందర్భంగా థియేటర్లలో రీరిలీజ్ కాబోతోంది.

మిర్చి

ప్రభాస్ 2013లో నటించిన మూవీ మిర్చి. అతన్ని పాన్ ఇండియా స్టార్ గా మార్చిన బాహుబలి కంటే ముందు ప్రభాస్ నటించిన చివరి మూవీ ఇది. అప్పట్లో రికార్డులు తిరగరాసింది. ఇప్పుడు మరోసారి రిలీజ్ కు సిద్ధమైంది.

రెబల్

ప్రభాస్ 2012లో నటించిన సినిమా రెబల్. యంగ్ రెబల్ స్టార్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్.. ఈ రెబల్ మూవీ ద్వారా ఓ మాస్ హీరోగా మారిపోయాడు. బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ మూవీ రీరిలీజ్ ద్వారా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.

ఛత్రపతి

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మూవీ ఛత్రపతి. 2005లో రిలీజైన ఈ మూవీ మళ్లీ ఇన్నాళ్లకు రీరిలీజ్ కానుంది. మరి ఈసారి ఏం మాయ చేస్తుందో చూడాలి.

మిస్టర్ పర్ఫెక్ట్

2011లో రిలీజైన ఫ్యామిలీ డ్రామా మిస్టర్ పర్ఫెక్ట్.. ప్రభాస్ ను ఫ్యామిలీ ఆడియెన్స్ కు దగ్గర చేసింది. కాజల్, తాప్సీ నటించిన ఈ మూవీ కూడా అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా మ్యూజిక్ మంచి హిట్ అయింది. ఇప్పుడీ సినిమా కూడా రీరిలీజ్ కాబోతోంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024