Salman Khan: ‘బాబా సిద్ధిఖీ హత్య కంటే దారుణంగా..’ – సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు

Best Web Hosting Provider In India 2024


Salman Khan: ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబర్ కు వచ్చిన ఒక బెదిరింపు సందేశంలో.. తమకు రూ. 5 కోట్లు ఇవ్వాలని లేదంటే, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను దారుణంగా హత్య చేస్తామని ఉంది. డబ్బులు ఇవ్వకపోతే బాబా సిద్ధిఖీ కంటే సల్మాన్ ఖాన్ పరిస్థితి దారుణంగా ఉంటుందని బెదిరించారు. సల్మాన్ ఖాన్ ను హత్య చేస్తామని గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది.

లారెన్స్ తో శత్రుత్వం వద్దు..

‘‘ఈ బెదిరింపులను తేలిగ్గా తీసుకోవద్దు. సల్మాన్ ఖాన్ జీవించి ఉండాలనుకుంటే, లారెన్స్ బిష్ణోయ్ తో శత్రుత్వానికి ముగింపు పలకాలి. అందుకు రూ.5 కోట్లు చెల్లించాలి. డబ్బులు ఇవ్వకపోతే బాబా సిద్ధిఖీ కంటే సల్మాన్ ఖాన్ పరిస్థితి దారుణంగా ఉంటుంది’’ అని ఆ వాట్సాప్ సందేశంలో బెదిరించారు. ఈ మెసేజ్ పై దర్యాప్తు ప్రారంభించినట్లు ముంబై పోలీసులు తెలిపారు.

బాబా సిద్దిఖీ హత్య

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ (66)ని అక్టోబర్ 12 రాత్రి ముంబైలోని బాంద్రాలోని తన ఎమ్మెల్యే కుమారుడు జీషన్ సిద్ధిఖీ కార్యాలయం వెలుపల కాల్చి చంపారు. ఆయనపై కాల్పులు జరిపిన హరియాణాకు చెందిన గుర్మైల్ బల్జీత్ సింగ్ (23), ఉత్తరప్రదేశ్ కు చెందిన ధర్మరాజ్ రాజేష్ కశ్యప్ (19)లతో పాటు, పుణెకు చెందిన హరిశ్ కుమార్ బలక్రామ్ నిసాద్ (23), ప్రవీణ్ లోంకర్ లను పోలీసులు అరెస్టు చేశారు.

సల్మాన్ ఖాన్ ను చంపేందుకు కుట్ర

సల్మాన్ ఖాన్ ను చంపేందుకు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కుట్ర పన్నినట్లు నవీ ముంబై పోలీసులు ప్రకటించిన మరుసటి రోజే సల్మాన్ ఖాన్ కు ఈ బెదిరింపు సందేశం వచ్చింది. నిందితుడు సుఖా అలియాస్ సుఖ్బీర్ బల్బీర్ సింగ్ ను హర్యానాలోని పానిపట్లో పన్వేల్ టౌన్ పోలీసుల బృందం (నవీ ముంబైలో) బుధవారం అరెస్టు చేసింది. సల్మాన్ ఖాన్ ను చంపేందుకు బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. సుఖ్బీర్ సింగ్ పాకిస్తాన్ లో ఉన్న తన హ్యాండ్లర్ డోగర్ తో టచ్ లో ఉన్నాడని తెలిపారు. లారెన్స్ బిష్ణోయ్ ముఠా సభ్యులతో కలిసి సల్మాన్ ఖాన్ ను హతమార్చేందుకు పాకిస్థాన్ నుంచి వచ్చిన ఏకే-47లు, ఎం16లు, ఏకే92లు వంటి ఆయుధాలను ఉపయోగించాలని ప్లాన్ వేశాడు. నవీ ముంబైకి తీసుకువచ్చిన తర్వాత అతడిని కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు. ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కేసులో సుఖ్బీర్ సింగ్ ను కూడా నవీ ముంబై పోలీసులు విచారించనున్నారు.

ఏప్రిల్ 24న కేసు నమోదు

సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర పన్నారని ఈ ఏడాది ఏప్రిల్ 24న నవీ ముంబై పోలీసులు 18 మంది నిందితులు, బిష్ణోయ్ ముఠాకు చెందిన ఇతరులపై కేసు నమోదు చేశారు. ముంబైలోని సల్మాన్ ఖాన్ బాంద్రా నివాసం వెలుపల బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యులు కాల్పులు జరిపిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని సోదరుడు అన్మోల్, సంపత్ నెహ్రా, గోల్డీ బ్రార్, రోహిత్ గోధారాలను నిందితులుగా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఈ కేసులో నవీ ముంబై పోలీసులు ఐదుగురు బిష్ణోయ్ ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వారు ధనంజయ్ అలియాస్ అజయ్ కశ్యప్ అలియాస్ నహ్వీ, గౌరవ్ భాటియా, వాస్పి ఖాన్ అలియాస్ వసీం చిక్నా, రిజ్వాన్ ఖాన్ అలియాస్ జావేద్, దీపక్ హవా సింగ్ అలియాస్ జాన్. జూన్ నెలలో నవీ ముంబైలోని పన్వేల్ సమీపంలోని తన ఫాంహౌస్ కు వెళ్తుండగా సల్మాన్ ఖాన్ (salman khan) పై కాల్పులు జరపాలని నిందితులు కుట్ర పన్నినట్లు పోలీసులు పేర్కొన్నారు.

సల్మాన్ ఖాన్ కదలికలపై ఆరా

సల్మాన్ ఖాన్ తరచూ వెళ్లే బాంద్రా నివాసం, పన్వేల్ ఫాంహౌస్, సినిమా షూటింగ్ లొకేషన్ల వద్ద సల్మాన్ ఖాన్ కదలికలను గుర్తించి, రెక్కీ నిర్వహించడానికి లారెన్స్ బిష్ణోయ్, సంపత్ నెహ్రా ముఠాలు సుమారు 60 నుంచి 70 మంది సభ్యులను నియమించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. నిందితులు మైనర్లను షార్ప్ షూటర్లుగా ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నారని, పాకిస్తాన్ నుండి ఆయుధాలను ఉపయోగిస్తున్నారని అధికారులు తెలిపారు. తనను, తన కుటుంబ సభ్యులను చంపాలనే ఉద్దేశంతోనే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తన నివాసంలో కాల్పులు జరిపిందని తాను భావిస్తున్నట్లు సల్మాన్ ఖాన్ పోలీసులకు తెలిపాడు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024



Source link