OTT Thriller Movie: ఓటీటీలోకి నేరుగా వచ్చేస్తున్న థ్రిల్లర్ మూవీ.. ఇండియాలో బిగ్గెస్ట్ స్కామ్ అంటూ..

Best Web Hosting Provider In India 2024


OTT Thriller Movie: థ్రిల్లర్ మూవీ ఒకటి ఓటీటీలోకి నేరుగా వస్తోంది. ఈ సినిమా పేరు డిస్పాచ్ (Despatch). విలక్షణ నటుడిగా పేరుగాంచిన మనోజ్ బాజ్‌పేయీ నటించిన మూవీ ఇది. ఇప్పుడు ముంబై అకాడెమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఆ తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది.

డిస్పాచ్ ఓటీటీ రిలీజ్ డేట్

మనోజ్ బాజ్‌పేయీ నటించిన థ్రిల్లర్ మూవీ డిస్పాచ్. జీ5 ఓటీటీ ఒరిజనల్ మూవీగా తెరకెక్కింది. “డిస్పాచ్ ను సమర్పిస్తున్నందుకు థ్రిల్ గా ఫీలవుతున్నాం. ఇదొక జీ5 ఒరిజినల్ మూవీ. ముంబై అకాడెమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ప్రదర్శించబోతున్నాం. ఎక్సైటింగ్ అప్డేట్స్ కోసం చూస్తేనే ఉండండి” అనే క్యాప్షన్ తో డిస్పాచ్ మూవీ విషయాన్ని జీ5 తమ ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

ఈ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఇదొక న్యూస్ పేపర్ మోడల్లో రూపొందిన పోస్టర్. మూవీ టైటిల్ డిస్పాచ్ నే పేపర్ పేరుగా చూపించారు. కాను బెహల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నాడు. ఈ పోస్టర్ లో ఇండియా బిగ్గెస్ట్ స్కామ్ అని మెయిన్ హెడ్‌లైన్ కనిపిస్తుంది. దీనిపై మనోజ్ బాజ్‌పేయీ క్లీన్ షేవ్ తో సీరియస్ లుక్ తో కనిపిస్తున్నాడు.

ఏంటీ డిస్పాచ్ మూవీ?

డిస్పాచ్ మూవీ ఓ జర్నలిస్ట్ చుట్టూ తిరిగే స్టోరీ. ఈ కాలంలో వార్తలన్నీ డిజిటల్ అయిపోయిన వేళ ప్రింట్ జర్నలిస్టుల పరిస్థితి అర్థం కాకుండా ఉంది. అలాంటి జాయ్ అనే ఓ సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ కథే ఈ డిస్పాచ్. ఇలాంటి క్లిష్ప పరిస్థితుల్లో ఓ పెద్ద స్టోరీని బ్రేక్ చేసి తిరిగి తనను తాను నిరూపించుకోవాలని బయలుదేరుతాడతడు.

అప్పటికే వ్యక్తిగత జీవితంలో సమస్యలతో సతమవుతుంటాడు. అలాంటి పరిస్థితుల్లో ముంబైలో ఓ సెన్సేషనల్ న్యూస్ కోసం జాయ్ వెతుకుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అన్నది డిస్పాచ్ మూవీలో చూడొచ్చు.

థ్రిల్లర్ మూవీ త్వరలోనే జీ5 ఓటీటీలోకి రానుంది. ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పాయీతోపాటు అభిషేక్ భలేరావ్, షహానా గోస్వామి, రితుపర్ణ సేన్, నిఖిల్ విజయ్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. జీ5 ఓటీటీలోనే మనోజ్ బాజ్‌పాయీ నటించిన సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై, భయ్యాజీలాంటి సినిమాలు ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడీ డిస్పాచ్ కూడా రాబోతోంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024