How to Wake Up Early: తెల్లవారుజామున నిద్రలేస్తే మీ డైలీ లైఫ్‌లో 2-3 గంటలు ఎక్స్‌ట్రా, జీవితంలో బద్ధకం దరిచేరదు!

Best Web Hosting Provider In India 2024

ఉదయం వేగంగా నిద్రలేవడం అనేది ఆరోగ్యకరమైన జీవనశైలికి అతి ముఖ్యమైన విషయం. కానీ.. ఇప్పటికీ చాలా మంది సూర్యుడు ఉదయించిన గంట సేపటికీగానీ బెడ్ దిగరు. అయితే తెల్లవారుజామున నిద్రలేవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఒక్కసారి మీకు అర్థమైతే.. ఇంకెప్పుడూ మీరు ఆలస్యంగా నిద్రలేవరు. ఆరోగ్యకరమైన మనిషి ఎంత సేపు నిద్రపోవాలి? ఉదయాన్నే నిద్ర లేవాలంటే ఏం చేయాలి? తెల్లవారుజామున నిద్రలేవడం వల్ల కలిగే ప్రయోజనాల్ని ఇక్కడ మనం తెలుసుకుందాం.

కఠిన నియమం పెట్టుకోండి

అలసిపోయి రాత్రి పడుకున్న తర్వాత తెల్లవారుజామున నిద్రలేవడం కొంచెం కష్టమే. కానీ.. మనం దృఢ నిశ్చయంతో ఎర్లీగా లేవాలని నిర్ణయించుకుంటే శరీరం కూడా అందుకు అలవాటుపడుతుంది. కొన్ని రోజులకి మీ అలవాట్లలో వేగంగా నిద్రలేవడం ఒక భాగంగా మారిపోతుంది.

రాత్రి పడుకునే ముందు మరుసటి రోజు కోసం అవసరమైన పనులను సిద్ధం చేసుకోండి. ఉదయాన్నే ఒక రకమైన స్పష్టతతో నిద్రలేవడం చాలా కీలకం. రాత్రే మీ ఆలోచనలతో ఒక ప్లానింగ్ చేసుకోండి. అలానే నిద్రలేవడం సులభంగా అనిపించే ఒక మంచి వాతావరణాన్ని కూడా రూములో క్రియేట్ చేసుకోండి.

క్లారిటీతో నిద్రలేవండి

ఉదయాన్నే నిద్రలేవగానే హడావుడి వాతావరణం లేకుండా జాగ్రత్త తీసుకోండి. కాసేపు ప్రశాంతంగా యోగా లేదా ధ్యానం లేదా వాకింగ్ లాంటివి చేస్తే మీరు రోజంతా ఉత్సాహంగా గడిపే ఉత్తేజం లభిస్తుంది. ప్రతి రోజు మనిషికి కనీసం 7-8 గంటల నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోతే శరీరం అలసటగా ఉంటుంది. కాబట్టి తెల్లవారుజామునే నిద్ర లేవాలని అనుకునేవారు వేగంగా నిద్రపోవడం కూడా అలవాటు చేసుకోవాలి.

ఒకే సమయాన్ని అలవాటు

ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయి.. ఒకే సమయానికి నిద్ర లేవడం వల్ల శరీరం కూడా అలవాటు పడిపోయి ఆటోమేటిక్‌గా మీకు మెలకువ వస్తుంది. అయితే ఇది అలవాటు అయ్యే వరకు ఒకటి లేదా రెండు అలారం టైమింగ్స్ పెట్టుకోవడం మంచిది. ఒకవేళ ఫస్ట్ అలారంకి మీకు మెలకువ రాకపోతే రెండో అలారమైనా మిమ్మల్ని అలెర్ట్ చేస్తుంది.

రాత్రి నిద్రపోయే ముందు మొబైల్, టీవీ, ల్యాప్‌టాప్‌ వంటి స్క్రీన్‌లను చూస్తే మెదడుపై ప్రభావం ఉంటుంది. కాబట్టి నిద్రకి ముందు వాటిని చూడటం తగ్గించడం మంచిది. అలానే అలారం మోగినప్పుడు పాజిటివ్ ఆలోచనలతో నిద్ర లేవడం మొదలుపెడితే ఆ రోజు అంతా సానుకూలంగా ఉంటుంది.

ప్రకృతిని ఆస్వాదించండి

ఉదయం లేవగానే కొన్ని నిమిషాలు ప్రకృతిని చూస్తూ ఆస్వాదించండి. ఒకవేళ మీరు వాకింగ్‌కి వెళ్తే సూర్యకాంతి శరీరంలో సిరడోనిన్ వంటి హార్మోన్ల ఉత్పత్తికి సాయపడుతుంది. అలానే మీ మనసుని కూడా ఉత్తేజకరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఉదయం లేవగానే నీరు తాగడం, కాసేపు తర్వాత తేలికపాటి అల్పాహారం తీసుకోవడం శరీరానికి శక్తినిస్తాయి. ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన శక్తి లభిస్తుంది.

రోజులో ఎక్స్‌ట్రా అవర్స్

తెల్లవారుజామున నిద్రలేచేవారికి రోజులో కనీసం 2-3 గంటలు అదనంగా లభించినట్లు అవుతుంది. ఆ సమయానికి శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు మీ నైపుణ్యాలను పెంచుకోవడానికి కూడా వినియోగించుకోవచ్చు.

ఉదాహరణకి మీరు ప్రతి రోజూ ఉదయం 7-8 గంటల మధ్య నిద్రలేస్తున్నారనుకోండి.. ఒకవేళ మీరు తెల్లవారుజామున 4-5 గంటల మధ్య నిద్రలేవగలిగితే.. మీ రోజువారీ జీవితంలో అదనంగానే 2-3 గంటలు లభించినట్లే. ఇంకెందుకు ఆలస్యం.. రేపటి నుంచి తెల్లవారుజామునే నిద్రలేవడానికి ప్లాన్ చేసుకోండి.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024