OTT Thriller: ఓటీటీలోకి థ్రిల్లర్ సిరీస్.. వెయ్యేళ్లకు ఒక్కసారి వరుసలో 4 గ్రహాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Best Web Hosting Provider In India 2024

Aindham Vedham OTT Release: ఓటీటీలోకి ఎన్నోరకాల కంటెంట్ వస్తూ ఉంటుంది. హారర్, క్రైమ్, సస్పెన్స్, బోల్డ్, కామెడీ, యాక్షన్ ఇలా ఎన్నో రకాల జోనర్స్‌లో సినిమాలు, వెబ్ సిరీసులను తెరకెక్కిస్తుంటారు దర్శకనిర్మాతలు. అలాగే, పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కూడా ఒరిజినల్ కంటెంట్‌ను అందిస్తుంటాయి.

మైథలాజికల్ థ్రిల్లర్

అంటే, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సొంతగా సినిమాలు, వెబ్ సిరీసులను రూపొందిస్తుంటాయి. అలా తాజాగా ఓటీటీలోకి వస్తోన్న నాలుగు జోనర్స్ కలిపిన మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఐంధమ్ వేదమ్. అభిరామి మీడియా వర్క్స్ బ్యానర్ మీద అభిరామి రామానాథన్, నల్లమై రామనాథన్ నిర్మించిన ఒరిజినల్ వెబ్ సిరీస్‌ ఐంధమ్ వేదమ్. ఈ వెబ్ సిరీస్‌కు ఎల్. నాగరాజన్ దర్శకత్వం వహించారు.

ఐంధమ్ వేదమ్ టీజర్

ఈ ఐంధమ్ వేదమ్ సిరీస్‌లో సాయి ధన్సిక, సంతోష్ ప్రతాప్, వివేక్ రాజగోపాల్, వైజీ మహేంద్రన్, క్రిషా కురుప్, రాంజీ, దేవదర్శిని, మాథ్యూ వర్గీస్, పొన్వన్నన్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇంతకుముందు విడుదలైన ఐంధమ్ వేదమ్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ప్రమోషనల్ కంటెంట్‌ను మరింత పెంచారు.

విజయ్ సేతుపతితో రిలీజ్

ఈ నేపథ్యంలో తాజాగా ఐంధమ్ వేదమ్ ట్రైలర్‌ను బయటకు వదిలారు మేకర్స్. స్టార్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఐంధమ్ వేదమ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆద్యంతం మైథలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఐంధమ్ వేదమ్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది.

ఐదో వేదం బయటకు

“వెయ్యేళ్లకు ఒకసారి గురుడు, శుక్రుడు, శని, కుజుడు ఈ నాలుగు గ్రహాలు సూర్యుడ్ని చూసే విధంగా ఒకే వరుసలో ఉంటాయట.. అలా జరిగినప్పుడు అద్భుతం జరుగుతుందని చరిత్ర చెబుతుంది”, “నాలుగు వేదాలు ఉన్నాయి.. ఐదో వేదం ఇప్పుడు బయటకు రాబోతోంది” అంటూ వచ్చి డైలాగ్స్ సిరీస్‌పై మరింత క్యూరియాసిటీ పెంచాయి.

నాలుగు గ్రహాలు

చూస్తుంటే ఐంధమ్ వేదమ్ వెబ్ సిరీస్ ఐదో వైదం గురించి చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే, వెయ్యేళ్లకు జరిగే నాలుగు గ్రహాల వరుసక్రమం గురించి చెప్పారు. ఇలా ఆద్యంతం క్యూరియాసిటీగా సాగిన ఈ ట్రైలర్‌ ద్వారా ఎన్నో అంతు చిక్కని రహస్యాలను వెబ్ సిరీస్‌లో చూపించబోతోన్నట్టుగా కనిపిస్తోంది.

నాలుగు జోనర్స్

మర్డర్, మిస్టరీ, థ్రిల్లర్, సోషియో ఫాంటసీ ఇలా అన్నింటిని కలిపి ఐంధమ్ వేదమ్ వెబ్ సిరీస్‌ను నాగ అద్భుతంగా తెరకెక్కించినట్టుగా తెలుస్తోంది. ట్రైలర్‌‌లో చూపించిన విజువల్స్, ఇచ్చిన ఆర్ఆర్, భయపెట్టేలా చేసిన కెమెరా వర్క్, యాక్షన్ సీక్వెన్స్ ఇవన్నీ కూడా హైలెట్ అవుతున్నాయి.

రెండు భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్

ఐంధమ్ వేదమ్ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 25 నుంచి జీ5లో ఐంధమ్ వేదమ్ ఓటీటీ రిలీజ్ కానుంది. అది కూడా తెలుగు, తమిళ భాషల్లో ఐంధమ్ వేదమ్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అందిరికీ తెలిసిన నాలుగు వేదాలు కాకుండా ఐదో వేదాన్ని కూడా ఇందులో చూపించనుండటం విశేషంగా మారింది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024