ECHS Hyderabad Recruitment : హైదరాబాద్ ECHSలో 102 కాంట్రాక్ట్ ఉద్యోగాలు – కేవలం ఇంటర్వ్యూనే, దరఖాస్తులకు మరికొన్ని గంటలే

Best Web Hosting Provider In India 2024

102 ఖాళీల భర్తీకి సికింద్రాబాద్ లోని ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీమ్‌ స్టేషన్‌ (ECHS) ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ నడుస్తుండగా.. ఈ గడువు దగ్గరపడింది. రేపటితో(అక్టోబర్ 20) అప్లికేషన్ల ప్రాసెస్ పూర్తి అవుతుంది. అర్హులైన అభ్యర్థులు https://www.echs.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

కాంట్రాక్ట్ ప్రాతిపదికన 102 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. వీటిలో పారా మెడికల్, నాన్ మెడికల్ తో పాటు మెడికల్ కేటగిరి పోస్టులు ఉన్నాయి. 102 పోస్టుల్లో అత్యధికంగా మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు 24 ఉన్నాయి.

ముఖ్య వివరాలు:

  • ఉద్యోగ ప్రకటన – ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీమ్‌ స్టేషన్‌ (ECHS), సికింద్రాబాద్, హైదరాబాద్.
  • మొత్తం ఖాళీలు – 102
  • పోస్టులను అనుసరించి అర్హతలు ఉన్నాయి. ఎనిమిదో తరగతి నుంచి ఎంబీబీఎస్/ బీడీఎస్/ఎండీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలి.ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేస్తున్నారు.
  • ఓఐసీ పాలీక్లినిక్, మెడికల్ ఆఫీసర్, డెంటల్ ఆపీసర్ పోస్టులకు నెలకు రూ.75000 జీతం చెల్లిస్తారు.
  • మెడికల్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్‌ పోస్టులకు రూ.1,00,000గా ఉంది, టెక్నీషియన్, క్లర్క్, డీఈఓ, ప్యూన్, సఫాయివాలా, చౌకీదార్, అటెండెంట్ పోస్టులకు రూ.16,800 చెల్లిస్తారు.
  • దరఖాస్తులు – ఆఫ్ లైన్ సమర్పించాలి.
  • దరఖాస్తు ఫారమ్ ను https://www.echs.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
  • పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్ ను సికింద్రాబాద్ లో ఉన్న ECHS కేంద్రంలో సమర్పించాలి.
  • దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి… ఇంటర్వూ తేదీలను ఖరారు చేస్తారు. మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. ఇంటర్వూకి ఎంపికైన వారు పూర్తి ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో రావాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల విద్యార్హతల్లో సాధించిన మార్కులను పరిశీలిస్తారు. వీటిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు.
  • అధికారిక వెబ్ సైట్ – https://www.echs.gov.in/
  • ఏమైనా సందేహాలు ఉంటే 7703818578 / 7701976194 / 8448086480 / 8448086481 నెంబర్లను వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు.

Open PDF in New Window

ఉద్యోగాలు – ఖాళీల వివరాలు:

  • డీఈఓ: 02
  • ప్యూన్: 01
  • మెడికల్ ఆఫీసర్: 24
  • గైనకాలజిస్ట్‌: 01
  • డెంటల్ ఆపీసర్: 08
  • డెంటల్ హైజనిస్ట్‌: 03
  • ఫార్మాసిస్ట్: 12
  • IOC పాలీక్లినిక్: 06
  • ల్యాబ్ టెక్నీషియన్: 07
  • ల్యాబ్ అసిస్టెంట్: 01
  • నర్సింగ్ అసిస్టెంట్‌: 03
  • ఫిజియోథెరపిస్ట్‌: 03
  • మెడికల్ స్పెషలిస్ట్: 03
  • ఐటీ నెట్‌వర్క్ టెక్నీషియన్: 01
  • ఫిమేల్ అటెండెంట్: 02
  • చౌకీదార్‌: 06
  • డ్రైవర్: 05
  • సఫాయివాలా: 09
  • క్లర్క్: 05

Whats_app_banner

టాపిక్

RecruitmentJobsTelangana NewsGovernment Jobs
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024