Wax Coating: అసలు పండ్లకు మైనం పూత ఎందుకు వేస్తారు? మెరిపించడమే కారణం కాదట!

Best Web Hosting Provider In India 2024

మార్కెట్లలో పండ్లు నిగనిగలాడుతూ, చూసేందుకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా యాపిల్‌లు, కొన్ని రకాల కాయగూరల్లాంటివి. చూడగానే ఎంతో తాజాగా కొనుక్కోవాలనిపించేంత ముచ్చటగా ఉంటాయి. అయితే ఆ మెరుపు కోసం యాపిల్ లాంటి వాటి మీద మైనం పూతను పూస్తారు. దాని అవసరం ఏంటో, అలాంటి వాటిని తినాల్సిన పద్ధతి ఏంటో తెల్సుకుందాం.

మైనం పూత ఎందుకు?

పండ్లు, కూరగాయల మీద వ్యాక్స్ లేదా మైనం పూత వేయడం వల్ల వాటి మీద ఫంగస్‌ తొందరగా చేరకుండా ఉంటుంది. అవి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండటానికి అది సహకరిస్తుంది. అలాగే పండ్లలో ఉండే తేమ శాతం తొందరగా కోల్పోకుండానూ ఈ మైనం సాయం చేస్తుందట. మరి ఈ మైనం మనం తినడానికి అనువైనదేనా?

రెండు రకాల వ్యాక్స్:

కూరగాయలు, పండ్లపై వేసే వ్యాక్స్‌ కోటింగ్‌ కోసం రెండు రకాల మైనాలు ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. ఒకటి సహజమైన మైనం, రెండోది కృత్రిమమైనవి. కృత్రిమమైన మైనాలతో పోలిస్తే సహజమైన మైనం తినడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు తక్కువ అనుకోవచ్చు. అయితే ఇవైనా కూడా ఎక్కువ మోతాదులో లోపలికి చేరడం వల్ల కిడ్నీలు, కాలేయం లాంటి వాటి పని తీరు దెబ్బతింటాయి.

కృత్రిమమైన మైనం చాలా హానికరమైనదని కొన్ని అధ్యయనాల్లో తేలింది. దీన్నే సింథటిక్‌ వ్యాక్స్‌ అనీ పిలుస్తారు. యాపిల్స్‌, అవకాడోలు, క్యాప్సికం, పుచ్చకాయలు, పీచ్‌లు, కమలాపండ్లు.. లాంటి కొన్నింటి మీద వీటిని కోట్‌ చేస్తూ ఉంటారు. దీన్ని గ్లేజింగ్‌ ఏజెంట్‌ అని అంటారు. ఇది ఉండటం వల్ల పండ్లు కూరగాయల్లో ఉండే 80 నుంచి 95 శాతం నీరు బయటకు వెళ్లిపోకుండా ఉంటుంది. అందువల్ల అవి ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయి. బరువును సైతం కోల్పోవు.

సహజమైన మైనం అనేది కొంత మొత్తంలో వాడటాన్ని ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ రెగ్యులేషన్స్‌ అనుమతిస్తోంది. ఇవి అంత ప్రమాదకరమైనవి కావని చెబుతోంది. ఒక వేళ ప్యాక్‌ చేసి ఉన్న పండ్లు, కూరగాయల్ని కొనుక్కుంటున్నట్లయితే అవి ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ రెగ్యులేషన్‌ అప్రూవ్ చేసినవి అయి ఉన్నాయో లేదో లేబుల్‌ మీద చెక్‌ చేసుకోండి. అలా లేకపోతే వాటిని కొనకుండా ఉండటమే మంచిది.

ఇలా శుభ్రం చేయండి:

ఒక వేళ అలా మెరుస్తూ ఉన్న పండ్లు, కూరగాయల్ని కొనుక్కున్నారే అనుకుందాం. తప్పకుండా వాటిని శుభ్రంగా క్లీన్‌ చేసుకున్న తర్వాత మాత్రమే వాడుకోవాలి. అందుకు గోరు వెచ్చని నీటిలో కాస్త బేకింగ్‌ సోడా వేసి ఈ పండ్లను అందులో నాననివ్వాలి. దాదాపుగా అర గంట సమయం అలా వదిలేయాలి. తర్వాత వాటిని నీటిలోంచి తీసి శుభ్రంగా తుడిచి అప్పుడు తినాలి.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024