Thalapathy Vijay: దళపతి విజయ్ సినిమాకు ఏడాది.. స్పెషల్ వీడియో షేర్ చేసిన టీమ్.. ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడొచ్చంటే..

Best Web Hosting Provider In India 2024

దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమాకు స్పెషల్ క్రేజ్ ఉంది. స్టైలిష్‍గా ఉండే యాక్షన్ థ్రిల్లర్ మూవీ విజయ్ అభిమానులకు తెగ నచ్చేసింది. ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. మాస్టర్ తర్వాత విజయ్ – లోకేశ్ కాంబో మరోసారి రిపీట్ అయింది. చాలా హైప్ మధ్య గతేడాది అక్టోబర్ 19వ తేదీన లియో రిలీజైంది. ఈ మూవీ బ్లాక్‍బస్టర్ కొట్టింది. ఈ చిత్రానికి నేటితో (అక్టోబర్ 19, 2024) ఏడాది పూర్తయింది.

స్పెషల్ వీడియో

లియో సినిమాకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది ఈ మూవీని నిర్మించిన సెవెన్ స్క్రీన్ స్టూడియో. ది క్రానికర్స్ ఆఫ్ లియో పేరుతో ఈ వీడియోను తీసుకొచ్చింది. లియో సినిమా షూటింగ్ సెట్స్ విజువల్స్ ఈ వీడియోలో ఉన్నాయి. డూప్ లేకుండా విజయ్ స్టంట్స్ చేసిన షాట్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి.

లియో మూవీలోని కొన్ని ఫేమస్ షాట్స్, కొన్ని డైలాగ్‍లతో ఈ స్పెషల్ వీడియోను మూవీ టీమ్ తీసుకొచ్చింది. హైనాతో ఫైట్, కాఫీ షాప్ ఫైట్ సీన్ల మేకింగ్ ఈ వీడియోలో ఉంది. 7 నిమిషాల 55 సెకన్ల పాటు ఈ స్పెషల్ వీడియోలో ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొత్తంగా లియోకు ఏడాది అయిన సందర్భంగా అభిమానులకు మంచి గిఫ్ట్ తీసుకొచ్చింది మూవీ టీమ్. దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కూడా ఈ వీడియోను షేర్ చేశారు.

చాలా జ్ఞాపకాలు

లియో సినిమాకు సంవత్సరం పూర్తవటంతో విజయ్‍తో ఉన్న ఓ ఫొటోను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ట్వీట్ చేశారు. చాలా నేర్చుకున్నానని, చాలా జ్ఞాపకాలు ఉన్నాయంటూ రాసుకొచ్చారు.

లియో చిత్రం తన మనసుకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటుందని పోస్ట్ చేశారు. “చాలా నేర్చుకున్నా. ఎన్నో జ్ఞాపకాలు, చాలా ఉత్సాకరమైన క్షణాలు ఉన్నాయి. లియో సినిమా నా మనసుకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది. ఈ మూవీ అయ్యేలా చేసినందుకు విజయ్‍కు లవ్ యూ సో మచ్. ఈ చిత్రం కోసం చెమట, రక్తం పెట్టిన అందరికీ, ప్రేక్షకులకు కృతజ్ఞుడిగా ఉంటా” అని లోకేశ్ కనగరాజ్ పేర్కొన్నారు. లియోకు సీక్వెల్ ప్లాన్ ఉందని, అయితే విజయ్ అంగీకరించాల్సి ఉందని లోకేశ్ ఇటీవలే ఓ ఈవెంట్‍లో చెప్పారు.

సోషల్ మీడియాలో హంగామా

లియో సినిమాకు ఏడాది కంప్లీట్ అవడంతో సోషల్ మీడియాలో హంగామా గట్టిగానే జరుగుతోంది. దళపతి విజయ్ ఫ్యాన్స్ ఈ మూవీ గురించి పోస్టులు చేస్తూనే ఉన్నారు. ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో లియో సందడి నేడు జోరుగా ఉంది.

లియో ఓటీటీలో ఎక్కడ..

లియో సినిమా ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలోనూ స్ట్రీమింగ్‍కు ఉంది. లియో చిత్రంలో విజయ్ సరసన త్రిష హీరోయిన్‍గా నటించారు. సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ మీనన్, గార్జ్ మర్యన్, మిస్కిన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

దళపతి విజయ్ హీరోగా నటించిన ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రం’ ఈ ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అనుకున్న రేంజ్‍లో బ్లాక్‍బస్టర్ అవలేదు. హెచ్.వినోత్ దర్శకత్వంలో విజయ్ ప్రస్తుతం ఓ మూవీ (దళపతి 69) చేస్తున్నారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్‍కు ఇదే చివరి మూవీ అనే అంచనాలు ఉన్నాయి.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024