Lift vs Stairs: ఆఫీస్‌, మాల్స్‌లో లిఫ్ట్ కోసం పరుగెడుతున్నారు కదా? కానీ మెట్లపై జస్ట్ నడవండి చాలు!

Best Web Hosting Provider In India 2024

మనం ఆఫీస్‌కి లేదా షాపింగ్‌కి వెళ్లినప్పుడు కళ్ల ముందు అందమైన మెట్లు కనిపిస్తున్నా.. లిప్ట్ దగ్గరికే మన కాళ్లు పరుగెడతాయి. దాదాపు లిఫ్ట్ క్లోజ్ అయ్యే టైమ్‌లో చాలా మంది పరుగెత్తుకుంటూ వెళ్లి మరీ బటన్ నొక్కుతారు. అంతలా మనం శరీరంతో పాటు మనసుకి అలవాటు చేసేశాం.

స్టెప్స్‌పై వెళ్లడం ఏదో నామోషీగా అయిపోయింది ఈరోజుల్లో. లిప్ట్‌లో వెళ్తే మీకు హ్యాపీగా అనిపించొచ్చు. కానీ.. మెట్లుపై నడిస్తే మీకు ఆరోగ్యంతో పాటు భవిష్యత్తులో హాయిగా అనిపిస్తుంది. మీ రోజువారీ జీవితంలో ఆరోగ్యంగా, చలాకీగా ఉండటానికి మెట్లు ఎక్కడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి.

ఒటన్ నొక్కితే చాలా?

బిజీ షెడ్యూల్‌లో లిప్ట్‌లో వెళ్లకపోతే సరైన సమయానికి ఆఫీస్‌కి చేరుకోలేం అని మీరు వాదించొచ్చు. కానీ.. మెట్లపై వెళ్లడానికి గంటలకొద్దీ సమయం పట్టదు. కేవలం నిమిషాల్లోనే మీరు సులువుగా వెళ్లిపోవచ్చు. పైపెచ్చు మీరు ప్రతి ఫ్లోర్‌లోనూ లిప్ట్‌లో అందరితో పాటు ఆగాల్సిన పని కూడా ఉండదు.

కేవలం ఒక బటన్ నొక్కడం ద్వారా ఎలాంటి శ్రమ లేకుండా మీరు లిప్ట్‌లో వెళ్లొచ్చు. కానీ అది మీకు సౌకర్యం మాత్రమే ఇస్తుంది.. ఆరోగ్యాన్ని కాదు. మన జీవితంలో ఎలాంటి సౌకర్యాలనైనా డబ్బుతో కొనవచ్చు. కానీ.. సంపూర్ణ ఆరోగ్యాన్ని మాత్రం కొనలేమని గుర్తుంచుకోవాలి.

ఫ్రెష్‌ ఎయిర్‌లో నడవండి

మెట్లు ఎక్కడం ద్వారా ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి మెట్లు ఎక్కడం ద్వారా సుమారు 8-10 కేలరీలు ఖర్చు చేస్తాడు. లిప్ట్‌లో వెళ్తే కేలరీలకి ఎలాంటి ఖర్చు ఉండదు. కేవలం బటన్ నొక్కినప్పుడు తప్ప మీరు చేసే శ్రమ ఏమీ ఉండదు కదా? పైపెచ్చు కాసేపు ఫ్రెష్ ఎయిర్‌కి దూరంగా ఉంటారు.

మెట్లు ఎక్కడం శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, గుండె పనితీరును పెంచుతుంది. ఇది హృదయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నిత్యం మెట్లు ఎక్కడం వల్ల రక్తనాళాలు మెరుగుపడి, గుండె రోగాల ముప్పు తగ్గుతుంది. రక్తపోటు స్థిరంగా ఉంటుంది.

మెటాబాలిజం మెరుగవుతుంది

జిమ్‌కి వెళ్లడం, తక్కువ టైమ్‌లో ఎక్కువ వ్యాయామం చేయడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. కానీ మెట్లు ఎక్కడం లాంటి చిన్న అలవాటు బరువు తగ్గించడంలో సులభమైన మార్గంగా పనిచేస్తుంది. ఇది శరీరంలో అధిక కొవ్వును తగ్గిస్తుంది. అలానే మెట్లు ఎక్కడం వలన శరీరంలో మెటాబాలిజం వేగంగా పనిచేస్తుంది. దీనివల్ల వేగంగా కేలరీలు ఖర్చవుతాయి, తిన్న ఆహారం శరీరంలో శ్రద్ధగా జీర్ణమవుతుంది.

మెట్లు ఎక్కడం కేవలం శారీరక శ్రమకే కాకుండా, మానసిక ఆరోగ్యానికి కూడా మంచిదని పరిశోధనలు చెబుతున్నాయి. శరీరం ఆక్సిజన్‌ను ఎక్కువగా తీసుకోవడం వలన మెదడు వేగంగా పనిచేస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి శారీరక వ్యాయామం చేసినా, శరీరం ఎండార్ఫిన్స్ అనే హార్మోన్లను విడుదల చేస్తుంది. దాంతో హ్యాపీనెస్ మూడ్‌లో ఉంటారు.

బ్లెడ్ సర్కులేషన్‌లో ప్రోగ్రస్

కీళ్ల ఆరోగ్యం మెరుగుపడటానికి మెట్లు ఎక్కడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. పాదాలు, మోకాళ్ళ కీళ్లలో రక్తప్రసరణ మెరుగుపడటం వల్ల కీళ్ల వ్యాధుల రిస్క్ తగ్గుతుంది.మెట్లు ఎక్కడం వల్ల శరీరంలో అవసరమైన హార్మోన్లు సమతుల్యంగా ఉత్పత్తి అవుతాయి, ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఆరంభంలో రెండు అంతస్తులు లేదా మూడు అంతస్తుల వరకు మాత్రమే మెట్లు ఎక్కడం ప్రారంభించండి. మొదట్లో వేగంగా కాకుండా నెమ్మదిగా మెట్లు ఎక్కడం మంచిది. శరీరం ఆ శారీరక శ్రమకి అలవాటు పడిన తర్వాత మీరు పెంచుకుంటూ వెళ్లొచ్చు. మీ శరీరం సహకరించే వరకూ మెట్లు ఎక్కడం మంచిది. అయితే మెట్లు ఎక్కేటప్పుడు మంచి షూ ఉండటం కూడా ముఖ్యం. దాని వల్ల కాలు, మోకాళ్లకి శ్రమ తగ్గుతుంది.

జస్ట్ 10 నిమిషాలు చాలు

ప్రతిరోజు కనీసం 10-15 నిమిషాలపాటు మెట్లు ఎక్కడం ద్వారా ఆరోగ్య పరంగా మీకు ఊహించని ప్రయోజనాలు కనిపిస్తాయి. ఆఫీస్ లేదా ఇంట్లో పని నుంచి కాస్త బ్రేక్ తీసుకుని కూడా ఒత్తిడిని తగ్గించుకోవడానికి మెట్లు ఎక్కవచ్చు. రోజువారీ జీవితంలో కేవలం 10 నిమిషాలు మెట్లు ఎక్కడానికి లేదా దిగడానికి వెచ్చిస్తే చాలు!

గమనిక : పైన ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. వైద్యపరమైన సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024