డయేరియాపై దండగ మాటలు

Best Web Hosting Provider In India 2024

ప్రభుత్వంపై వైయస్ఆర్‌సీపీ నేతలు రాజ‌న్న దొర‌, మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు ధ్వజం

విజయనగరం జిల్లాలో డయేరియా కలకలం

అయినా ఏ మాత్రం పట్టించుకోని ప్రభుత్వం

కిడ్నీ వ్యాధులు, హృద్రోగాలతో చనిపోతున్నారని వక్రభాష్యం

11 మంది మరణించినా స్పందించని ప్రభుత్వం

తూతూమంత్రంగా జిల్లా మంత్రి పరామర్శలు

ఎక్కడా కనీసం ఆచూకీ లేని స్థానిక ఎమ్మెల్యే 

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు రాజన్నదొర, చిన్న శీను ఆక్షేపణ

డయేరియా బాధితులకు దారుణ వైద్యసేవలు

బడుల్లోనే మెడికల్‌ క్యాంప్‌లు. బెంచీలపైనే వైద్యం

ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొరవడిన కనీస వసతులు

రోగులతో క్రిక్కిరిసిపోతున్న ప్రైవేటు ఆస్పత్రులు

ఇప్పటికైనా ప్రభుత్వం ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలి

వ్యాధిగ్రస్తులను ఆదుకోవాలి. డయేరియా నివారించాలి

ప్రెస్‌మీట్‌లో వైయ‌స్ఆర్‌సీపీ నేతల డిమాండ్‌

విజయనగరం: విజయనగరం జిల్లాలో డయేరియాతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని, వారం రోజుల్లో  11 మంది చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వ్యాధిపై దండగ మాటలు మాట్లాడుతోందని మాజీ డిప్యూటీ సీఎం పి.రాజన్నదొర, విజయనగరం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశీను) ఆక్షేపించారు. డయేరియా వ్యాధి వ్యాప్తిని ఒప్పుకోని ప్రభుత్వం, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులతో జనం మరణిస్తున్నారని వక్రభాష్యం చెబుతోందని వారు దుయ్యబట్టారు. డయేరియా వ్యాధిగ్రస్తులను వైద్య ఆరోగ్య మంత్రి కనీసం పరామర్శించలేదన్న వారు, స్థానిక ఎమ్మెల్యే కూడా ఆచూకీ లేకుండా పోయారని తెలిపారు. విజయనగరంలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, వైయ‌స్ఆర్‌సీపీ  జిల్లా అధ్యక్షుడు, జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు (చిన్నశీను) మీడియా స‌మావేశంలో మాట్లాడారు.

    డయేరియా బాధితులకు వైద్యసేవలు దారుణంగా ఉన్నాయని, స్కూళ్లలో మెడికల్‌ క్యాంప్‌లు నిర్వహిస్తూ, బెంచీలపై రోగులకు వైద్యం చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస వసతులు లేకపోవడంతో, రోగులంతా అనివార్యంగా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని.. దీంతో ఆ ఆస్పత్రులన్నీ డయేరియా రోగులతో కిటకిటలాడుతున్నాయని వెల్లడించారు. డయేరియా బాధితులను తమపార్టీ నేతలు పరామర్శించిన తర్వాతే స్థానిక మంత్రి చుట్టంచూపుగా వచ్చి వెళ్లారే తప్ప, వ్యాధి నియంత్రణకు చర్యలు చేపట్టలేదని ఆక్షేపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇక్కడ ప్రత్యేక దృష్టి పెట్టి, డయేరియా వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, వ్యాధిని పూర్తిగా అరికట్టాలని రాజన్నదొర, చిన్నశీను డిమాండ్‌ చేశారు.
    తన సొంత నియోజకవర్గం సాలూరు పరిధిలోని పాచిపెంట మండలం, విశ్వనాథపురంలో ఈనెల 3న డయేరియా ఇప్పుడు మొత్తం జిల్లాను వణికిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం పి.రాజన్నదొర తెలిపారు. ఇంత జరుగుతున్నా కనీసం బయో టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా? అని నిలదీసిన ఆయన, గవర్నమెంట్‌ స్కూళ్లలో నిర్వహిస్తున్న మెడికల్‌ క్యాంప్‌ల్లో రోగులు బెంచీల మీద పడుకోలేక, ఇళ్ల నుంచి మంచాలు తెచ్చుకునే దౌర్భాగ్యస్థితి నెలకొందని ఆవేదన చెందారు.
    జిల్లాను డయేరియా వణికిస్తున్నా ఒప్పుకోని ప్రభుత్వం, అసలు ఆ వ్యాధి లేదని చెబుతోందని.. అలాంటప్పుడు మెడికల్‌ క్యాంప్‌లు ఎందుకు ఏర్పాటు చేశారని మజ్జి శ్రీనివాసరావు నిలదీశారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే జాడ లేదని దుయ్యబట్టారు. డయేరియా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్న ఆయన, గతంలో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం కరోనాను సమర్థంగా విషయాన్ని ప్రస్తావించారు.

Best Web Hosting Provider In India 2024