Naatukodi Pulusu: రాయలసీమ స్టయిల్‌లో నాటుకోడి పులుసు, ఒక్కసారి టేస్టే చేస్తే ఎప్పటికీ వదలరు!

Best Web Hosting Provider In India 2024

నాన్‌వెజ్ ప్రియులకి బాగా ఇష్టమైన కర్రీ.. నాటుకోడి పులుసు. ఈ నాటుకోడిని ఒక్కో ప్రాంతంల్లో ఒక్కోలా చేస్తారు. అయితే.. రాయలసీమ స్టయిల్‌లో చేసే నాటుకోడి కర్రీకి బాగా క్రేజ్ ఉంది. మరీ ముఖ్యంగా రాగి ముద్ద, నాటుకోడి పులుసు డెడ్లీ కాంబినేషన్. రాయలసీమ స్టయిల్‌లో నాటు కోడి పులుసు చేయడం ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

  • నాటుకోడి ముక్కలు: 500 గ్రాములు
  • ఉల్లిపాయలు: 2 (తరిగినవి)
  • పచ్చి మిర్చి : 2-3 (చిన్న ముక్కలుగా తరిగి)
  • టమాటాలు: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసి)
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్: 2 టీస్పూన్లు
  • కారం పొడి: 1 టీస్పూన్
  • పసుపు: 1/2 టీస్పూన్
  • ధనియాల పొడి: 2 టీస్పూన్లు
  • జీలకర్ర పొడి: 1 టీస్పూన్
  • గరంమసాలా: 1 టీస్పూన్
  • ఉప్పు: రుచికి సరిపడా (రాళ్ల ఉప్పు అయితే బెటర్)
  • నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్
  • నూనె: 4 టేబుల్ స్పూన్లు
  • నీరు: 1-2 గ్లాస్‌లు
  • కొత్తిమీర, కరివేపాకు తగినంత

నాటుకోడి పులుసు తయారీ విధానం:

  • నాటుకోడి ముక్కలను నీటితో కనీసం 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక బౌల్‌లో పెట్టుకోవాలి
  • ఆ ముక్కల్లో కొద్దిగా రాళ్ల ఉప్పు, కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలపాలి.
  • ఆ ముక్కల్లోనే కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం కూడా వేసుకుంటే ముక్కలకి మసాలా బాగా పడుతుంది
  • పదార్థాలు అన్నీ వేసి ముక్కలను బాగా కలిపి కాసేపు అలానే పక్కన పెట్టేయాలి
  • స్టవ్ వెలిగించి దానిపై కుక్కర్ పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి. (సాధారణంగా నాటుకోడి ముక్కలు వేడిచేసినప్పుడు కాస్త నూనె బయటికి వస్తుంటుంది. కాబట్టి.. సాధ్యమైనంత తక్కువగానే నూనె వేసుకోండి)
  • ఆ నూనె వేడి అయిన తర్వాత అందులో ఆవాలు, మినప పప్పు (మీకు ఇష్టమైతే వేసుకోండి), దాల్చి చెక్క (ఇది కూడా మీకు ఆప్షన్) వేయండి.
  • సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలతో పాటు కొద్దిగా కరివేపాకు వేసి కనీసం 2 నిమిషాలు సన్నని మంటపై వేయించండి.
  • ఆ తర్వాత మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించాలి
  • అన్ని పదార్థాలు బాగా వేగిన తర్వాత నాటు కోడి ముక్కలను కుక్కర్‌లో వేయాలి
  • కనీసం 5-6 నిమిషాలు చికెన్‌ను కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఆ సమయంలో మీరు నాటు కోడి ముక్కల నుంచి ఆయిల్ బయటికి రావడాన్ని కూడా గమనించొచ్చు.
  • ముక్కలు బాగా వేగిన తర్వాత మిగిలిన కారం, ధనియాల పొడి, పసుపుతో పాటు టమోటా ముక్కల్ని కూడా వేసి వేయించాలి.
  • కనీసం 2-3 నిమిషాలు ఈ పదార్థాలు వేసిన తర్వాత ముక్కల్ని వేగనిస్తే కర్రీలో బాగా కలర్ కూడా వస్తుంది.
  • మిరియాల పొడి వేసి కనీసం ఒక్క నిమిషం ప్రై చేయాలి.
  • ఆ తర్వాత ఆఖర్లో 1-2 గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్‌కి మూత పెట్టేయాలి.
  • నాటుకోడి కాబట్టి ముక్కలు బాగా ఉడకాలంటే కనీసం 3 విజిల్స్ వరకూ ఉండాలి. ఒకవేళ అప్పటికి కూడా మీకు సరిగా ముక్కలు ఉడకలేదు అనిపిస్తే.. మరో విజిల్ వరకు ఉడకనిస్తే చాలు.
  • ఆ తర్వాత కర్రీలో కొత్త మేర వేసి ఒక నిమిషం తర్వాత స్టవ్ మీద నుంచి తీసేయాలి.

నాటుకోడి కర్రీని రాగి సంగటి లేదా దోశతో తినడాన్ని బాగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ కర్రీ తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కూడా పక్కన పెట్టుకుని తింటే ఆ టేస్ట్ మరింత పెరుగుతుంది. ఈ ఆదివారం మీరూ రాయలసీమ స్టయిల్‌లో నాటు కోడి కూరని ట్రై చేయండి..!

Whats_app_banner

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024