Unstoppable 4 OTT: అన్‍స్టాపబుల్ 4 తొలి ఎపిసోడ్‍ గెస్ట్‌గా ఏపీ సీఎం.. బావతో బాలయ్య టాక్ షో కొత్త సీజన్ షురూ

Best Web Hosting Provider In India 2024

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఉన్న టాక్ షో ‘అన్‍స్టాపబుల్ విత్ ఎన్‍బీకే’ చాలా పాపులర్ అయింది. ఆహా ఓటీటీలో మొదటి మూడు సీజన్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. బాలకృష్ణ హోస్టింగ్ స్టైల్, మాటలు జనాలకు విపరీతంగా నచ్చేశాయి. తొలి రెండు సీజన్లు బంపర్ హిట్ కాగా.. మూడో సీజన్ మూడు ఎపిసోడ్లే వచ్చింది. అందరూ ఎంతో ఎదురుచూస్తున్న అన్‍స్టాపబుల్ నాలుగో సీజన్ వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‍లో తొలి ఎపిసోడ్‍లో స్పెషల్ గెస్ట్ రానున్నారు.

తొలి ఎపిసోడ్‍కు ఏపీ సీఎం

అన్‍స్టాపబుల్ నాలుగో సీజన్ తొలి ఎపిసోడ్‍లో గెస్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. చంద్రబాబుతో మరోసారి ఈ షోలో బాలకృష్ణ ముచ్చటించనున్నారు. అన్‍స్టాపబుల్ రెండో సీజన్‍లో తొలి ఎపిసోడ్‍కు చంద్రబాబు వచ్చారు. అప్పుడు ఆయన ఏపీ ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఈ టాక్ షోలో కనిపించనున్నారు.

ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ భారీ మెజార్టీ సాధించడటంతో మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు చంద్రబాబు. హిందూపురం నియోజకవర్గం నుంచి బాలకృష్ణ మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న బావ చంద్రబాబును ఈ టాక్ షోలో బాలకృష్ణ ప్రశ్నించనున్నారు. సరదాగా ఆటలు ఆడించనున్నారు. ఈ ఎపిసోడ్‍పై చాలా ఆసక్తి నెలకొని ఉంది. చంద్రబాబు ఎలాంటి విషయాలు చెబుతారా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

షూటింగ్ ఎప్పుడంటే..

సీఎం చంద్రబాబు నాయుడుతో అన్‍స్టాపబుల్ 4వ సీజన్ తొలి ఎపిసోడ్ షూటింగ్ రేపు (అక్టోబర్ 20) జరగనుందని తెలుస్తోంది. హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్‍లో ఈ ఎపిసోడ్ కోసం ప్రత్యేకంగా సెట్ వేశారని సమాచారం.

పవన్ వస్తారా?

చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా ఈ అన్‍స్టాపబుల్ 4వ సీజన్ తొలి ఎపిసోడ్‍లో గెస్టుగా వస్తారని రూమర్లు వచ్చాయి. అయితే, ఈ విషయం ఇంకా ఖరారు కాలేదు. చంద్రబాబు పాల్గొనడం అయితే ఫిక్స్ అయింది. పవన్ విషయంపై స్పష్టత రాలేదు. రేపు షూటింగ్ సమయంలో ఈ అంశంపై క్లారిటీ రానుంది.

సీజన్ ఎప్పటి నుంచి..

అన్‍స్టాపబుల్ 4వ సీజన్ ట్రైలర్ ఇటీవలే వచ్చింది. మాసీయెస్ట్ సూపర్ హీరో అంటూ ఆహా టీజ్ చేసింది. ‘థింకింగ్ మారి తీరాల’ అంటూ ఈ ట్రైలర్లో మంచి జోష్ చూపించారు బాలకృష్ణ. ఈ నాలుగో సీజన్ అక్టోబర్ 24న మొదలవుతుందని ఆహా పేర్కొంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొనే తొలి ఎపిసోడ్ ఆరోజే వచ్చే అవకాశం ఉంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా అన్‍స్టాపబుల్ 4లో ఓ ఎపిసోడ్‍కు గెస్టుగా రానున్నారు. లక్కీ భాస్కర్ మూవీ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా ఓ ఎపిసోడ్‍లో సందడి చేయనున్నారు. కంగువ సినిమా ప్రమోషన్ కోసం తమిళ స్టార్ హీరో సూర్య కూడా అన్‍స్టాపబుల్‍కు రానున్నారని సమచారం. మొత్తంగా ఈ నాలుగో సీజన్ మరింత సక్సెస్ అయ్యేలా ఆహా గట్టిగా ప్లాన్ చేసినట్టు అర్థమవుతోంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024