Actor Ajay: విక్రమార్కుడు తర్వాత అంతలా నచ్చిన పాత్ర ఇది.. నటుడు అజయ్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Actor Ajay About Pottel Movie Role: వకీల్ సాబ్ బ్యూటి అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ హీరో హీరోయిన్స్‌గా నటించిన సినిమా పొట్టేల్. సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా పొట్టేల్ మూవీలో సీనియర్ నటుడు అజయ్ పవర్‌ఫుల్ రోల్ పోషించారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మించారు.

పొట్టేల్ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అవుతోంది. ఈ నేపథ్యంలో పొట్టేల్ మూవీ అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా యాక్టర్ అజయ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

‘పొట్టేల్’ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?

సాహిత్ కథ చెప్పాడు. మొదట నేను చాలా క్యాజువల్‌గా విన్నాను. ఒక రెండు గంటల నేరేషన్ తర్వాత ఈ సినిమాలో క్యారెక్టర్ డెఫినెట్‌గా చేయాలనిపించింది. నా క్యారెక్టర్‌ని చాలా బాగా చేయాలి, లేకపోతే సినిమా పాడైపోతుందనే ఫీలింగ్‌ని డైరెక్టర్ కలిగించగలిగారు. కథని ఎంత అద్భుతంగా చెప్పాడో సినిమాని కూడా అంత అద్భుతంగా తెరకెక్కించాడు.

ఇది మల్టీ లేయర్ కథ. పాప ఎడ్యుకేషన్ కోసం ఫైట్ చేసే బ్యాక్ డ్రాప్. ఇలాంటి కథలు చెప్పినప్పుడు కొన్నిసార్లు సందేశం ఎక్కువైపోయే అవకాశం ఉంది. దీన్ని కమర్షియల్‌గా తీసుకురావడం చాలా కష్టం. డైరెక్టర్ సాహిత్ ఈ కథని మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో చాలా మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా తీర్చిదిద్దాడు. ఇందులో విజిల్స్ పడే సీన్స్ ఉంటాయి.

ఇందులో మిమ్మల్ని బాగా ఎగ్జైట్ చేసిన ఎలిమెంట్ ఏంటి?

ఈ కథ చాలా నచ్చింది. అదే నన్ను ఈ సినిమా చేయడానికి ఎగ్జైట్ చేసింది. తర్వాత నా క్యారెక్టర్ నచ్చింది. నాదే కాదు యువ, అనన్య వీళ్ల క్యారెక్టర్స్ అన్నీ చాలా అద్భుతంగా కుదిరాయి. స్లాంగ్ విషయంలో సాహిత్ చాలా హోంవర్క్ చేసుకున్నాడు. తన నేటివ్ నిర్మల్. డైలాగ్ రాయడమే ఆ స్లాంగ్‌లో రాశాడు. అయితే డబ్బింగ్ చెప్పినప్పుడు కొంచెం హార్డ్ అనిపించింది. నా క్యారెక్టర్‌కి కొన్ని చాంట్స్ ఉంటాయి. అవి చెప్పడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది.

విక్రమార్కుడిలో టిట్ల క్యారెక్టర్ తర్వాత పటేల్ క్యారెక్టర్ నచ్చిందని చెప్పడానికి కారణం?

విక్రమార్కుడు తర్వాత అంతా టెర్రిఫిక్ విలన్ వేషాలు తక్కువే వచ్చి ఉంటాయి. అవి కూడా చాలా వరకు రాజమౌళి గారి సినిమాలోనే ఉన్నాయి. టిట్ల లాంటి క్యారెక్టర్స్ రెగ్యులర్‌గా రావు. అదొక మ్యాజిక్ లాగా జరిగిపోయింది. తర్వాత నేను కొన్ని క్యారెక్టర్స్ ట్రై చేసాను. కానీ, ఆ మ్యాజిక్ కుదరలేదు. ఈ సినిమాలో చేస్తున్న పటేల్ క్యారెక్టర్‌లో చాలా షేడ్స్ ఉన్నాయి. అందుకే చాలా రోజుల తర్వాత నాకు నచ్చిన రోల్ దొరికిందని చెప్పాను. యాక్టర్‌గా హ్యాపీనెస్ ఇచ్చిన రోల్ ఇది.

పటేల్ క్యారెక్టర్ కోసం ఎలాంటి హోంవర్క్ చేశారు?

ప్రతి సినిమా యాక్టర్‌కి ఒక డిస్కవరీలానే ఉంటుంది. ఈ సినిమాలో నా వరకు కష్టపడింది కల్చర్‌ని ప్రజెంట్ చేయడం కోసం. తెలంగాణలో సిగం అని ఉంటుంది. సిగం అంటే దేవుడు రావడం అంటారు. దానికి ఒక పాటర్న్ ఉంటుంది. అది వచ్చినప్పుడు మాట్లాడే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. దానిమీద నేను డైరెక్టర్ కూర్చొని కొంత హోమ్ వర్క్ చేశాం. కొంతమందిని కలిశాం. చాలా ఎఫర్ట్ పెట్టాం.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024