Bigg Boss 8 Telugu: మీ ఇద్దరి బుద్ధి ఏమైంది: నాగార్జున సీరియస్.. అవినాశ్ మొనగాడు.. పృథ్వికి బంపర్ ఆఫర్లు: వీడియో

Best Web Hosting Provider In India 2024


బిగ్‍బాస్ 8 తెలుగు ఏడో వారం చివరికి వచ్చేసింది. హోస్ట్ నాగార్జున నేటి (అక్టోబర్ 19) శనివారం ఎపిసోడ్‍లో కంటెస్టెంట్లతో మాట్లాడనున్నారు. హౌస్‍లో ఈ వారం చార్జింగ్ గేమ్ రచ్చరచ్చగా సాగడంతో కంటెస్టెంట్లకు నాగ్ ఏం చెబుతారన్న ఆసక్తి నెలకొని ఉంది. అందుకు తగ్గట్టే నాగార్జున సీరియస్ అయ్యారు. ఈ నేటి వీకెండ్ ఎపిసోడ్‍కు సంబంధించిన ప్రోమో వచ్చింది.

నిఖిల్, గౌతమ్‍పై నాగ్ సీరియస్

చార్జింగ్ గేమ్‍లో కొట్టుకున్న నిఖిల్, గౌతమ్ కృష్ణపై నాగార్జున సీరియస్ అయ్యారు. బీబీ టైమ్స్ హెడ్‍లైన్స్ అంటూ ఆ ఇద్దరికి చివాట్లు పెట్టారు. “కండబలం ఎక్కువ.. బుద్ధిబలం తక్కువ” అనే హెడ్‍లైన్‍ను గౌతమ్‍కు ఇచ్చారు.

“నిన్న హీరో.. నేడు జీరో”.. “బూడిదలా మారుతున్న నిప్పు” అనే హెడ్‍లైన్లు నిఖిల్‍కు వచ్చాయి. చార్జింగ్ గేమ్‍లో గౌతమ్, నిఖిల్ మెడలు పట్టుకొని ఒకరిని ఒకరు తోసుకున్నారు, తిట్టుకున్నారు. కొట్టుకున్నంత పని చేశారు. దీంతో నాగార్జున ఈ విషయంపై గట్టిగా క్లాస్ తీసుకున్నారు.

ఫిజికల్ బలం తప్ప.. మెంటల్‍గా ఎలాంటి గేమ్ కనిపించడం లేదని హరితేజ అన్నారు. గొడవ వీడియోను కంటెస్టెంట్లకు మళ్లీ చూపారు నాగ్.

బుద్ధి ఏమైంది

ఆటలో అగ్రెసివ్‍నెస్, కసి ఉంటే మజా వస్తుందని నాగార్జున అన్నారు. కానీ ఇద్దరి బుద్ధి ఏమైంది అని నిఖిల్, గౌతమ్‍ను నిలదీశారు. దీంతో వారిద్దరూ బిక్కముఖం వేశారు. ఈ విషయంపై ఈ ఇద్దరికి నాగార్జున గట్టిగానే చివాట్లు పెట్టే అవకాశం కనిపిస్తోంది.

అవినాశ్ మొనగాడు

ప్రైజ్‍మనీకి రూ.50వేలు యాడ్ అయ్యేందుకు హెయిర్ కట్ చేయించుకున్న అవినాశ్‍ను నాగార్జున ప్రశంసించారు. అవినాశ్ మొనగాడు అంటూ పొగిడారు. ప్రైమమనీ ఎంత అని కాదని, ముందుకు వచ్చి చేయించుకున్నందుకు అతడిని ప్రశంసించారు. “విష్ణు.. అవినాశ్‍ను మొనగాడు అన్నానంటే.. ఇంకెవరినో అనలేదనేగా” అని విష్ణుతో నాగార్జున చెప్పారు. హెయిర్ కట్‍కు పృథ్వి ముందుకు రాలేదని పరోక్షంగా పంచ్ వేశారు.

పృథ్వికి బంపర్ ఆఫర్లు

హెయిర్ కట్ తర్వాత అవినాశ్ బాగా ఉన్నారని నాగ్ అన్నారు. “నీకు కూడా అలాగే ఉండేదేమో” అని పృథ్వితో చెప్పారు. దీంతో “అంత అందం వద్దు నాకు” అని వృథ్వి నవ్వారు. పృథ్వి గడ్డం తీసేస్తే ప్రైజ్‍మనీకి రూ.5లక్షలు యాడ్ అవుతాయని నాగార్జున అన్నారు. “పృథ్వి నీకో ఆఫర్ ఇస్తున్నా. పృథ్వి గడ్డం తీసేస్తే రూ.5లక్షలు” అని నాగ్ చెప్పారు. తన గడ్డంపై అంత టార్గెట్ ఎందుకు అని పృథ్వి నవ్వుతూ అన్నారు. అందరూ సైలెంట్‍గా ఉండాలని సీరియస్‍గా ఓ విషయం చెప్పారు నాగ్.

పృథ్వికి నాగార్జున మరో ఆఫర్ ఇచ్చారు. గడ్డం తీసేస్తే మూడు వారాలు పృథ్వి నామినేషన్లలో ఉండడని, నేరుగా పదో వారానికి వెళతాడని నాగార్జున మరో సూపర్ ఆఫర్ ఇచ్చారు. దీంతో పృథ్వి ఆలోచనలో పడ్డారు. తీసుకో అని గంగవ్వ సూచించారు. దీంతో ఈ ప్రోమో ముగిసింది. నాగార్జున ఈ విషయాన్ని సరదాగా చెప్పారా అనేది చూడాలి. ఏం జరిగిందో నేటి ఎపిసోడ్‍లో పూర్తిగా తెలియనుంది. ఈ వారం నామినేషన్లలో తొమ్మిది మంది ఉండగా.. నేడు కొందరు సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024