OTT Telugu Releases: ఓటీటీల్లోకి ఈ వారం తెలుగులో వచ్చిన ఆరు సినిమాలు.. నాలుగు డబ్బింగ్‍లోనే..

Best Web Hosting Provider In India 2024

ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లోకి ఈ వారం స్ట్రైట్ తెలుగు చిత్రాలు ఎక్కువగా రాలేదు. అయితే తెలుగు డబ్బింగ్‍లో మాత్రం నాలుగు సినిమాలు స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చాయి. రెండు చిన్న బడ్జెట్ తెలుగు స్ట్రైట్ చిత్రాలు కూడా ఈ వారం ఓటీటీల్లోకి అడుగుపెట్టాయి. మొత్తంగా తెలుగులో ఆరు సినిమాలు ఈ వారం స్ట్రీమింగ్‍కు వచ్చాయి. అవేవో ఇక్కడ చూడండి.

కలి

తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘కలి’ ఈ గురువారం (అక్టోబర్ 17) ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ప్రిన్స్ సెసిల్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి శివ శేషు దర్శకత్వం వహించారు. అక్టోబర్ 4న థియేటర్లలో రిలీజైన ఈ కలి చిత్రం రెండు వారాల్లోనే ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.

ఉరుకు పటేలా

తేజూస్ కంచర్ల, కుష్బూ చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన ‘ఉరుకు పటేలా’ సినిమా అక్టోబర్ 18న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఈ కామెడీ థ్రిల్లర్ మూవీకి వివేక్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ చిత్రంలో గోపరాజు రమణ, లావణ్య రెడ్డి కూడా కీలకపాత్రలు పోషించారు. ఈ ఉరుకు పటేలా మూవీని ఇప్పుడు ప్రైమ్ వీడియో ఓటీటీలో చూడొచ్చు.

లవ్ సితార

హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల, రాజీవ్ సిద్ధార్థ్ లీడ్ రోల్స్ చేసిన ‘లవ్ సితార’ చిత్రం ఈవారమే తెలుగు డబ్బింగ్‍లో అందుబాటులోకి వచ్చింది. ఈ హిందీ రొమాంటిక్ డ్రామా మూవీ సెప్టెంబర్ 27న జీ5 ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. అయితే, తెలుగు డబ్బింగ్‍లో ఈ వారం అక్టోబర్ 18న ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. లవ్ సితార మూవీకి వందన కటారియా దర్శకత్వం వహించారు.

కొండల్

మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కొండల్ ఈ వారమే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగు డబ్బింగ్‍లోనూ ఎంట్రీ ఇచ్చింది. మలయాళం, తెలుగుతో పాటు కన్నడ, హిందీ, తమిళంలోనూ ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఆంటోనీ వర్గీస్, రాజ్ బీ శెట్టి, షబీర్ కల్లరకల్ ప్రధాన పాత్రలు పోషించిన కొండల్ మూవీకి థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చింది. ఈ చిత్రానికి అజీత్ మాంపల్లి దర్శకత్వం వహించారు. ఈ మూవీని నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో చూసేయండి.

రైడ్

యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘రైడ్’ నేడు ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తమిళ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రైడ్‍కు తెలుగు వెర్షన్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రంలో విక్రమ్ ప్రభు, శ్రీదివ్య, అనంతిక సనీల్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించారు. కార్తీ దర్శకత్వం వహించిన రైడ్ మూవీ తమిళంలో గతేడాది నవంబర్‌లో రిలీజైంది. ఇప్పుడు దాదాపు 11 నెలల తర్వాత తెలుగులో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది.

లెవెల్ క్రాస్

లెవెల్ క్రాస్ సినిమా ఈ వారం రెండు ఓటీటీల్లో అడుగుపెట్టింది. ఈ మలయాళ యాక్షన్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీలోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. ప్రైమ్ వీడియోలో మలయాళం, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహాలో తెలుగు డబ్బింగ్‍లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. లెవెల్ క్రాస్ మూవీలో ఆసిఫ్ అలీ, అమలాపాల్, షరఫ్ ఉద్దీన్ లీడ్ రోల్స్ చేశారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024