Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి మూవీ ఓటీటీలో ఫ్రీ స్ట్రీమింగ్ – వీకెండ్ వ‌ర‌కే ఈ ఆఫ‌ర్‌

Best Web Hosting Provider In India 2024

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫ్యాన్స్‌కు స‌న్ నెక్స్ట్ ఓటీటీ వీకెండ్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. అజ్ఞాత‌వాసి మూవీ త‌మ ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చ‌ని ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్ 18 నుంచి 20 వ‌ర‌కు మూడు రోజులు ఎలాంటి స‌బ్‌స్క్రిప్ష‌న్ ఛార్జీలు లేకుండా అజ్ఞాత‌వాసి మూవీ ఉచితంగా స్ట్రీమింగ్ రూపంలో అందుబాటులో ఉంటుంద‌ని స‌న్ నెక్స్ట్ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు మూవీ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్న‌ది.

త్రివిక్ర‌మ్ డైరెక్ట‌ర్‌…

అజ్ఞాత‌వాసి సినిమాకు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. జ‌ల్సా, అత్తారింటికి దారేది బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ త‌ర్వాత హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా తెర‌కెక్కిన అజ్ఞాత‌వాసి పై భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. క‌థ‌లోతో పాటు డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ టేకింగ్‌లో కొత్త‌ద‌నం మిస్స‌వ్వ‌డంతో 2018 సంక్రాంతి కానుక‌గా రిలీజైన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

సినిమా ఫెయిల్యూర్‌…కానీ నిర్మాత‌కు లాభాలు…

మిక్స్‌డ్ టాక్‌తో సంబంధం లేకుండా ఫ‌స్ట్‌డేనే 60 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. 90 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన అజ్ఞాత‌వాసి మూవీ 100 కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు మాత్రం లాభాల‌ను తెచ్చిపెట్ట‌డం గ‌మ‌నార్హం. సినిమా ఫెయిల్యూర్ అయినా నిర్మాత‌లు మాత్రం సేఫ్ అయ్యారు.

ఇద్ద‌రు హీరోయిన్లు…

అజ్ఞాత‌వాసి రివ్యూ మూవీలో కీర్తిసురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టించారు. ఆది పినిశెట్టి విల‌న్‌గా క‌నిపించిన ఈ మూవీలో సీనియ‌ర్ హీరోయిన్ ఖుష్బూ ఓ కీల‌క పాత్ర‌ను పోషించింది.అజ్ఞాత‌వాసి మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీతోనే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా అనిరుధ్‌ను టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేశారు త్రివిక్ర‌మ్‌. అనిరుధ్ పాట‌లు పెద్ద హిట్ట‌య్యాయి. అజ్ఞాత‌వాసి త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన బ్రో మూవీకి త్రివిక్ర‌మ్ స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించారు.

మూడు సినిమాలు…

ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లుతో పాటు ఓజీ, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమాలు చేస్తోన్నాడు. రాజ‌కీయాల కార‌ణంగా కొన్నాళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌లే హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు షూటింగ్‌ను తిరిగి మొద‌లుపెట్టారు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ న‌వంబ‌ర్ 10 నాటికి పూర్తికానున్న‌ట్లు స‌మాచారం. ఏఎమ్ జ్యోతికృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఓజీ షూటింగ్‌…

సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఓజీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌లోకి ప‌వ‌న్ అడుగుపెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ రెండు సినిమాల షూటింగ్‌లు పూర్త‌యిన త‌ర్వాతే ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ షూటింగ్‌ను ప‌వ‌న్ మొద‌లుపెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024