Palak rolls: పాలకూరలో పోషకాలన్నీ అందాలంటే.. ఇలా పాలక్ రోల్స్ చేసి తినండి

Best Web Hosting Provider In India 2024


పాలకూర రోల్స్‌నే ఉత్తర భారతంలో పాలక్ పాత్రా, పాలక్ వడీ అని రకరకాలుగా పిలుస్తారు. ఇదొక సాంప్రదాయ వంటకం. చామకూరకు పిండి రాసి ఆవిరిమీద ఉడికించడం మన దగ్గర ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి రెసిపీయే ఇది. దీన్ని అల్పాహారంలోకి తీసుకోవడం ఆరోగ్యకరం. అసలు నూనె చుక్క కూడా వాడకూండానూ దీన్ని చేసేయొచ్చు. రెసిపీ చూసేయండి.

పాలకూర శనగపిండి రోల్స్ తయారీకి కావాల్సినవి:

1 పాలకూర కట్ట

1 కప్పు శనగపిండి

సగం కప్పు బియ్యం పిండి

అర టీస్పూన్ పసుపు

అర చెంచా కారం

1 చెంచాడు నువ్వులు

పావు టీస్పూన్ వాము

అర టీస్పూన్ జీలకర్ర

అర చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద

2 పచ్చిమిర్చి

తగినంత ఉప్పు

2 చెంచాల నూనె

పాలకూర శనగపిండి రోల్స్ తయారీ విధానం:

  1. పాలకూర రోల్స్ కోసం పాలకూరకు మసాలాలు వేసి కలిపిన పిండి రాసి ఉడికించాలి. దాని కోసం ముందుగా పిండి సిద్ధం చేసుకోవాలి.
  2. ఒక పెద్ద బౌల్‌లో శనగపిండి, బియ్యం పిండి తీసుకోండి. అందులోనే మసాలాలాలన్నీ వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు, వాము, జీలకర్ర, నువ్వులు వేసి పిండి బాగా కలుపుకోండి.
  3. అందులోనే అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కాస్త నూనె కూడా వేసుకుని బాగా కలుపుకోండి.
  4. అందులోనే కప్పు నీళ్లు కూడా పోసుకుని పిండిని రెడీ చేసుకోండి. పిండి మరీ పలుచగా ఉండకూడదని చూసుకోండి. అది ఆకుకు అంటుకునేలా ఉండాలి.
  5. ఇప్పుడు పాలకూరను శుభ్రంగా కడుక్కోండి. పెద్ద ఆకులున్న పాలకూరను ఎంచుకోవాలని గుర్తుంచుకోండి.
  6. ఈ ఆకుల మీద ముందుగా సిద్దం చేసుకున్న పిండిని అంతటా రాసుకోండి. అలా పిండి రాసుకున్న ఆకు మీద మరో ఆకును పెట్టుకోండి. అలా మూడు ఆకులు ఒకదాని మీద ఒకటి పెట్టుకోండి.
  7. అన్నీ కలిపి గుండ్రంగా రోల్ లాగా చుట్టేయండి. ఈ రోల్స్ ఒక్కోటి స్టీమర్ లేదా ఇడ్లీ కుక్కర్‌లో పెట్టి కనీసం పావుగంట సేపు ఆవిరి మీద ఉడికించుకోవాలి.
  8. అంతే వాటిని తీసి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసేయొచ్చు. ఇలా చేస్తే వాటిని చేయడానికి చుక్క నూనె కూడా అక్కర్లేదు.
  9. కాస్త రుచి పెంచాలంటే మాత్రం మరోసారి ఫ్రై చేసుకుంటే మరింత బాగుంటుంది.
  10. దానికోసం ఒక కడాయిలో నూనె వేడి చేసుకుని కట్ చేసుకున్న పాలకూర రోల్స్ ముక్కలు వేసుకుని రెండు నిమిషాలు వేయించాలి. అలా చేస్తే కాస్త క్రీస్పీగా అవుతాయి.
  11. కాస్త కరకరమంటే వాటి మీద నువ్వులు చల్లుకుని ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోండి.

Whats_app_banner

Source / Credits

Best Web Hosting Provider In India 2024