Good Husband: ఈ ఏడు లక్షణాలు మీలో ఉంటే.. మీరు కచ్చితంగా గుడ్ హస్బెండ్!

Best Web Hosting Provider In India 2024

భార్యాభర్తల మధ్య ఇంట్లో వాగ్వాదాలు చాలా కామన్. రోజువారీ జీవితంలో చాలా విషయాల్లో భేదాభిప్రాయాలు వస్తుంటాయి. కానీ ఓ మంచి భర్త ఎప్పుడూ ఆ ప్రభావాన్ని కుటుంబంపై పడకుండా జాగ్రత్త తీసుకుంటాడు. గుడ్ హస్బెండ్‌గా ఉండాలంటే కేవలం భార్యపై ప్రేమ చూపిస్తే మాత్రమే సరిపోదు.. కొన్ని లక్షణాలను కూడా అలవర్చుకోవాలి. లేదంటే కేవలం భర్తగా ఉండిపోతారు తప్ప.. మంచి భర్తగా కాదు.

ఓపెన్ కమ్యూనికేషన్

మంచి భర్త ఎల్లవేళలా తన భార్యతో ఓపెన్‌గా, నిజాయితీగానే మాట్లాడతాడు. ఆమెతో మాట్లాడడం మాత్రమే కాదు, ఆమె చెప్పేది కూడా జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ కమ్యూనికేషన్ ద్వారా సులువుగా ఇంట్లో వచ్చే వివాదాలను పరిష్కరించుకోవచ్చు.

ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటూనే తమ బంధాన్ని రోజురోజుకీ బలోపేతం చేసుకుంటూ వెళ్తారు. ఇది మీ కుటంబ భద్రతని పెంచుతూ భార్యాభర్తలు స్వేచ్ఛగా తమ భావాల్ని ఇంట్లో వ్యక్తం చేయడానికి దోహదపడుతుంది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే చాలా మంది భార్యాభర్తలు తరచూ ఇబ్బంది పడుతుంటారు.

కష్ట సమయంలోనూ భార్యకి తోడుగా

మంచి భర్త సమయం ఏదైనా.. సందర్భం ఎలాంటిదైనా తన భార్యకి మద్దతుగా నిలవడానికి ప్రయత్నిస్తాడు. అది ఆమె కెరీర్, వ్యక్తిగత లక్ష్యం లేదా భావోద్వేగ క్షణమైనా ఆమెకి నేనున్నాను అంటూ అండగా నిలుస్తూ భరోసా ఇస్తాడు. ఇది కేవలం మాటల ద్వారానే ఇవ్వడు. చేతల ద్వారా కూడా భార్యకి మద్దతుగా నిలుస్తాడు. ఎవరో ఏదో అనుకుంటారని భావించకుండా.. ఆమె రోజువారీ పనుల్లోనూ సహాయం చేస్తాడు. ఇది భార్యాభర్తల మధ్య భావోద్వేగ బంధాన్ని పెంచుతుంది.

భార్య గౌరవానికి భంగం రానివ్వడు

ప్రతి సంబంధానికి గౌరవం చాలా అవసరం. మంచి భర్త తన భార్య ఆలోచనలు, అభిప్రాయాలను గౌరవిస్తాడు. ఆమెకి పర్సనల్ స్పేస్ ఇస్తూ.. అందరిలో ఆమె గౌరవానికి భంగం కలగకుండా జాగ్రత్తగా చూసుకుంటాడు. భార్యతో వాగ్వాదం జరిగినా గీత దాటకుండా ఆమెని గౌరవించడం మంచి భర్త ప్రధాన లక్షణం. ఇది ఇంట్లో మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడంతో పాటు.. పిల్లలకీ మంచి సందేశాన్ని ఇచ్చినట్లు అవుతుంది.

నమ్మకం కోల్పోడు

వైవాహిక బంధానికి నమ్మకం బలమైన పునాది. మంచి భర్త తన భార్యకి నమ్మకస్తుడిగా ఉంటాడు. అలానే ఆమెపై కూడా పూర్తి నమ్మకంతో ఉంటాడు. ఏదైనా మాట ఇస్తే దానికి పూర్తిగా కట్టుబడి ఉండటం, పనులన్నీ నిజాయితీగా చేయడం మంచి భర్త లక్షణాలు. ఒక్కసారి భార్య దగ్గర నిజాయతీ కోల్పోతే మళ్లీ తిరిగి పొందడానికి చాలా కాలం పడుతుంది. కాబట్టి.. మంచి భర్త ఎప్పుడూ ఆ తప్పు చేయడు.

రొమాంటిక్ సెన్స్

భార్యని హగ్ చేసుకోవడం లేదా ముద్దు పెట్టడం ద్వారా చాలా మంది మంచి భర్తలు తరచూ తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు. రోజువారీ భావోద్వేగ బంధం బలంగా ఉండాలంటే శృంగారం ఒక్కటే సరిపోదు. కొంచెం రొమాంటిక్ సెన్స్ కూడా ఉండాలి. మంచి భర్త ఎల్లప్పుడూ రొమాంటిక్‌గా, సరదాగా భార్యతో మాట్లాడుతూ ఉంటాడు. అంతేకాదు ఆమె తగినట్లుగా తన అభిరుచులను, అలవాట్లని కూడా సరిచేసుకుంటాడు.

బరువు, బాధ్యతలు పంచుకోవడం

మంచి భర్త ఇంటిని నడపడంలో భార్యతో కలిసి బాధ్యతలు పంచుకుంటాడు. కేవలం ఇంట్లో జీతం ఇస్తేనే సరిపోదు. ఇంటి బాధ్యతలు, ఆర్థిక బాధ్యతలు, పిల్లల పెంపకం లాంటివి కూడా ఉంటాయి. వాస్తవానికి రోజువారీ జీవితంలో భార్యకి ఇవి కష్టమైనవి, చికాకు తెప్పించేవి. కాబట్టి.. మంచి భర్త ఆ ఒత్తిడిని తాను పంచుకోవడం ద్వారా భాగస్వామిపై భారాన్ని తగ్గిస్తాడు.

మూడ్ స్వింగ్స్‌కి తగినట్లుగా

మంచి భర్త తన భార్య మూడ్ స్వింగ్స్‌ను అర్థం చేసుకుని దానికి తగినట్లుగా ఇంట్లో వ్యవహరిస్తాడు. భార్య కోప్పడిన సమయంలో వాగ్వాదాన్ని పెంచకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ఆమె భావోద్వేగాలను అర్థం చేసుకుని దానికి తగినట్లుగా సర్దిచెప్పడం లాంటివి చేస్తుంటాడు. మంచి భర్త తన భాగస్వామి భావాలను సానుభూతితో అర్థం చేసుకొని అర్థవంతంగా స్పందిస్తాడు. ఇది సమస్యలను పరిష్కరించడంతో పాటు ఇంట్లో ఒక సానుకూలమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది.

దృష్టి కోణం

తన కోణం నుంచే కాకుండా భార్య కోణం నుంచి కూడా ఆలోచించడం మంచి భర్త మరో లక్షణం. ఇలా చేస్తే ముప్పావు వంతు సమస్యలకి ఇట్టే పరిష్కారం దొరుకుతుంది. కానీ.. చాలా మంది భాగస్వామి కోణం నుంచి ఆలోచించరు. దాంతో సమస్యే మీకు అర్థంకాకపోతే.. ఇక ఎలా పరిష్కరిస్తారు. మీరూ మంచి భర్తగా ఉండాలనుకుంటే ఈ టిప్స్ పాటించండి మరి..!

Whats_app_banner
Source / Credits

Best Web Hosting Provider In India 2024