చెయ్యి కోసుకుని లవర్​కి వీడియో పంపిన మహిళ- ఆమె కళ్లల్లోకి చూస్తూ గుండెపోటుతో అబ్బాయి మృతి!

Best Web Hosting Provider In India 2024


దేశ రాజధాని దిల్లీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ, తన చెయ్యి కోసుకుని లవర్​కి వీడియో పంపించింది. ఆ వ్యక్తి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు! కానీ ఆమెను కళ్లల్లోకి చూస్తూ ఉండగా, గుండెపోటుతో మరణించాడు. ఆ మహిళకు చికిత్స చేయగా ప్రాణాలతో బయటపడింది! ఈ వార్త ఇప్పుడు దిల్లీలో హెడ్​లైన్స్​గా మారింది.

ఇదీ జరిగింది..

దిల్లీలోని జగత్​పురిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పలు మీడియా కథనా ప్రకారం.. ఏడాది క్రితం వీరిద్దరూ ఆన్​లైన్​లో కలుసుకున్నారు. క్రమం తప్పకుండా కలుసుకున్న తరువాత, వారు ప్రేమలో పడ్డారు. డేటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే అర్జున్ అనే వ్యక్తి ఉద్యోగం వెతుక్కోకపోవడం, తరచూ పార్టీ చేసుకునే అలవాటుతో పాటు పలు ఇతర అంశాలపై ప్రేమికుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. న్యాయశాస్త్రం చదువుతున్న ఆ మహిళ తాను ఎంచుకున్న రంగంలో కెరీర్​ను కొనసాగించాలని సీరియస్​గా ఉన్నట్లు సమాచారం.

ఆ దురదృష్టకరమైన రోజు ఏం జరిగింది?

వీరి మధ్య శుక్రవారం గొడవ జరిగినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. అర్జున్ బంధువుతో మహిళ గొడవపడి ఇంటికి వెళ్లిపోయింది. రాత్రి 11.30 గంటల సమయంలో ఆమె మణికట్టు కోసి, దాన్ని రికార్డ్ చేసి వాట్సాప్​లో అర్జున్​కు పంపింది!

ఈ వీడియో చూసి షాకైన అర్జున్ వెంటనే ఆ మహిళ తల్లిని సంప్రదించి చివరకు ఆమెకు సహాయం చేయడానికి పరుగెత్తాడు. తెల్లవారుజామున 2.45 గంటల సమయంలో ఆమెను గురు తేజ్ బహదూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య సదుపాయానికి చేరుకున్న తర్వాత, అతను ఒక నర్సుకు జరిగినది వివరించాడు.

ఇదీ చూడండి:- Kadapa Petrol Attack : పెట్రోల్‌ దాడికి గురైన ఇంటర్‌ విద్యార్థిని మృతి

ఆ వెంటనే.. అతను తన ప్రియురాలి కళ్లలోకి చూశాడు. కొద్ది క్షణాల్లోనే నేల మీద కుప్పకూలి పడిపోయాడు.

ఓవైపు మహిళ గాయానికి కొందరు వైద్యులు చికిత్స చేస్తుండగా మరికొందరు అతడిని బతికించడానికి ప్రయత్నించారు. రక్తస్రావాన్ని ఆపి మహిళను కాపాడగలిగినప్పటికీ, ఆమె లవర్​ గుండెపోటుతో మృతి చెందాడు.

“ఆమెను రక్షించండి… ఆమెను రక్షించండి.. లేకపోతే చనిపోతుంది,” అంటూ అర్జున నేల మీద కుప్పకూలాడు.

అర్జున్ మృతదేహాన్ని శవపరీక్ష అనంతరం అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై ఆ మహిళ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని, ప్రాణాలకు ప్రమాదం లేదని సమాచారం. ఆమెకు కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. లవర్​ కళ్లల్లోకి చూస్తు, అబ్బాయి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడన్న వార్త విని చాలా మంది దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024



Source link