Kiccha Sudeep: కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం – ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంతాపం

Best Web Hosting Provider In India 2024

Kiccha Sudeep: న‌టుడు కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం క‌లిగింది. కిచ్చా సుదీప్ త‌ల్లి స‌రోజ సంజీవ్ (86) ఆదివారం క‌న్నుమూసింది. వ‌యోసంబంధిత స‌మ‌స్య‌ల‌తో బెంగ‌ళూరులోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న స‌రోజ తుదిశ్వాస విడిచింది. స‌రోజ మ‌ర‌ణంతో కిచ్చా సుదీప్ కుటుంబం శోక‌సంద్రంలో మునిగిపోయింది.

త‌ల్లి ప్రోత్సాహంతోనే..

న‌టుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి త‌ల్లి స‌రోజ‌ ఓ కార‌ణ‌మ‌ని సుదీప్ ప‌లు సినిమా ఇంట‌ర్వ్యూల‌లో చెప్పాడు. త‌ల్లి త‌న క‌ల‌ను గుర్తించి ప్రోత్స‌హించ‌డం వ‌ల్లే న‌టుడిగా ఈ స్థాయికి చేరుకున్నాన‌ని అన్నాడు. త‌ల్లి కార‌ణంగానే తాను బిగ్‌బాస్ హోస్ట్‌గా మారాన‌ని గ‌తంలో పేర్కొన్నాడు. యాక్ట‌ర్‌గా, హోస్ట్‌గా త‌న‌లోని త‌ప్పొప్పుల్ని స‌రిదిద్దుతూ త‌ల్లి స‌రోజ‌ అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు ఇస్తుంద‌ని బిగ్‌బాస్‌లోని ఓ ఎపిసోడ్‌లో పేర్కొన్నాడు.

సాయంత్రం అంత్య‌క్రియ‌లు…

అభిమానుల సంద‌ర్శ‌నార్థం స‌రోజ భౌతిక‌కాయాన్ని బెంగ‌ళూరు జేపీ న‌గ‌ర్‌లోని సుదీప్ ఇంటికి త‌ర‌లించిన‌ట్లు తెలిసింది. సాయంత్రం ఆమె అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిసింది. సుదీప్ త‌ల్లి మ‌ర‌ణం ప‌ట్ల సినీ, రాజ‌కీయ వ‌ర్గాల‌తో పాటు అభిమానులు సంతాపం తెలుపుతూ సోష‌ల్ మీడియాలో పోస్ట్‌లుపెడుతోన్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంతాపం…

ఏపీ డిప్యూటీ సీఏం ప‌వ‌న్ క‌ళ్యాణ్, క‌ర్ణాట‌క డిప్యూటీ సీఏం శివ‌కుమార్‌తో పాటు ప‌లువురు సినీ రాజ‌కీయ ప్ర‌ముఖులు సుదీప్ త‌ల్లి మ‌ర‌ణం ప‌ట్ల సంతాపం వ్య‌క్తంచేశారు.

“ప్రముఖ నటులు శ్రీ కిచ్చా సుదీప్ గారి మాతృమూర్తి శ్రీమతి సరోజ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సరోజ గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తన నట జీవితంపై తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఉందని శ్రీ సుదీప్ గారు తెలిపారు. మాతృ వియోగం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలి. శ్రీ సుదీప్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను” అని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోస్ట్ పెట్టారు.

అగ్ర హీరోగా…

క‌న్న‌డంలో అగ్ర హీరోల్లో ఒక‌రిగా కొన‌సాగుతోన్నాడు సుదీప్‌. తెలుగులో రాజ‌మౌళి ఈగ‌తో పాటు చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డిలో న‌టించాడు. ప్ర‌స్తుతం మాక్స్ పేరుతో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ చేస్తోన్నాడు సుదీప్‌. విక్రాంత్ రోనా త‌ర్వాత డైరెక్ట‌ర్ నిరూప్ భండారీతో బిల్లా రంగా బాషా పేరుతో ఓ యాక్ష‌న్ మూవీని అనౌన్స్‌చేశాడు కిచ్చా సుదీప్‌.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024