Rava Laddu: ఇంట్లోనే అరగంటలో నోరూరించే రవ్వ లడ్డుని సింపుల్‌గా తయారు చేసుకోండిలా!

Best Web Hosting Provider In India 2024

రవ్వ లడ్డుని పిల్లలే కాదు.. పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. నిమిషాల వ్యవధిలోనే మంచి రుచికరమైన రవ్వ లడ్డులను మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి రవ్వ లడ్డు టేస్ట్ చూసిన వారు.. పదే పదే చేయమని అడిగేంతగా రవ్వు లడ్డు రుచి ఉంటుంది.

రవ్వ లడ్డు తయారీకి కావాల్సిన పదార్థాలు

  • సన్నని సూజి లేదా ఉప్మా రవ్వ -1 కప్పు
  • చక్కెర- 1 కప్పు
  • కొబ్బరి -1/2 కప్పు (తురిమిన)
  • గోరు వెచ్చని పాలు- 1 కప్పు
  • జీడిపప్పు- 1 స్పూన్
  • బాదం-1 స్పూన్
  • ఎండు ద్రాక్ష -1 స్పూన్
  • యాలకుల పొడి- 1/4 స్పూన్
  • నెయ్యి -6 స్పూన్‌లు

తయారీ విధానం

  • స్టవ్ ఆన్ చేసి.. కడాయిలో రెండు స్పూన్‌ల నెయ్యి వేయాలి
  • నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము వేయాలి. ఒకవేళ పచ్చి కొబ్బరి మీకు అందుబాటులో లేకపోతే తురిమిన ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు.
  • సన్నని మంటపై కాసేపు కొబ్బరిని వేయించి.. గోల్డెన్ కలర్‌లోకి మారిన తర్వాత కడాయిని దించేసి ఒక గిన్నెలోకి ఆ కొబ్బరిని తీసుకుని పక్కన పెట్టుకోవాలి
  • ఆ తర్వాత మళ్లీ కడాయి గ్యాస్‌పై పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేయాలి
  • నెయ్యి వేడెక్కిన తర్వాత బాదం, జీడిపప్పు వేసి వేయించాలి
  • అవి కలర్ కొద్దిగా మారిన తర్వాత అందులోనే ఎండు ద్రాక్ష కూడా వేసి వేయించాలి
  • బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష గోల్డెన్ కలర్‌లోకి మారిన తర్వాత ఒక గిన్నెలోకి ఆ పదార్థాలను తీసుకుని పక్కన పెట్టుకోవాలి
  • ఆ తర్వాత మళ్లీ కడాయి పెట్టి రెండు స్పూన్‌ల నెయ్యి వేయాలి
  • సన్నని మంటపై నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నని సూజి లేదా ఉప్మా రవ్వ వేసి కలపాలి
  • రవ్వ గోధుమ రంగులోకి వచ్చే వరకూ కలుపుతూ వేయించాలి
  • ఇలా వేయిస్తున్నప్పుడే రవ్వ నుంచి సువాసన కూడా వస్తుంది. అప్పుడు ఆ రవ్వని ఒక బౌల్‌లోకి తీసుకుని పక్కన పెట్టాలి.
  • అనంతరం బౌల్‌లోని రవ్వని తీసుకుని.. అందులో వేయించిన పచ్చి కొబ్బరిని వేసి కలపాలి
  • బాగా కలిపిన తర్వాత ఓ 10 నిమిషాలు అలానే ఉంచేయాలి.
  • అలా 10 నిమిషాలు పెట్టడం ద్వారా కొబ్బరిలోని ప్లేవర్ అంతా రవ్వకి పట్టుకుంటుంది.
  • ఈ 10 నిమిషాల బ్రేక్ సమయంలో.. ఒక కప్పు చక్కెర (రవ్వ ఏ కప్పుతో తీసుకున్నామో.. ఆ కప్పుతోనే) తీసుకుని మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి
  • ఆ తర్వాత బౌల్‌లోని రవ్వలో తొలుత ఆ చక్కెరని..  ఆ తర్వాత బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష మిశ్రమాన్ని కలిపాలి. అలానే యాలకుల పొడిని కూడా వేసి బాగా కలపాలి
  • రవ్వతో అన్ని పదార్థాలు బాగా కలిసిపోయాయని నిర్ధారణకి వచ్చిన తర్వాత గోరు వెచ్చని పాలను రెండు స్పూన్‌‌లు వేసి తొలుత కలపాలి
  • ఆ తర్వాత ఒక్కో స్కూన్ పాలను నెమ్మదిగా వేస్తూ ముద్దగా అయ్యే వరకూ రవ్వని బాగా కలపాలి (ఒకేసారి కప్పు పాలని పొరపాటున కూడా వేయకూడదు. ఒక్కోసారి అరకప్పు పాలు కూడా సరిపోవచ్చు)
  • రవ్వ ముద్దగా అయిన తర్వాత అరచేతికి నెయ్యి రాసుకుని.. కొద్దిగా కొద్దిగా రవ్వని తీసుకుని లడ్డూలుగా చుట్టుకుని ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి

రుచికరమైన రవ్వ లడ్డు రెడీ.. ఇంకెందుకు ఆలస్యం ఈరోజే ప్రయత్నించి రవ్వ లడ్డు టేస్ట్‌ని ఎంజాయ్ చేయండి.

Whats_app_banner

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024